S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

10/23/2017 - 01:32

విజయవాడ, అక్టోబర్ 22: ఆంధ్రప్రదేశ్‌ను ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ హబ్‌గా చేసుకోవచ్చని సిఎం చంద్రబాబు ఎమిరేట్స్ విమానయాన సంస్థలకు సూచించారు. ఆదివారం ఎమిరేట్స్ స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ ఇన్‌చార్జ్ అద్నాన్ ఖాజిమ్, ఫ్లైదుబాయ్ సిఈవో ఘయిత్ అల్ ఘయిత్‌లతో భేటీఅయ్యారు. ఎయిర్‌క్రాప్ట్ మెయింటెనెన్స్, రిపేర్, ఓవరాయిల్ సదుపాయాలు కల్పించేందుకు ఆంధ్రలో అవసరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు.

10/22/2017 - 03:57

విజయపురిసౌత్, అక్టోబర్ 21: ప్రముఖ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్ నుండి శ్రీశైలం వరకు కృష్ణానదిలో ప్రతిపాదించిన లాంచీ ప్రయాణానికి ఆదివారం ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. పర్యాటక అభివృద్ధి సంస్థ డివిఎం శ్యామ్‌ప్రసాద్ శనివారం నాగార్జునసాగర్ లాంచీ స్టేషన్‌లో విలేఖరులతో మాట్లాడుతూ నాగసిరి లాంచికి ఆదివారం ట్రైల్న్ నిర్వహిస్తున్నామన్నారు.

10/22/2017 - 03:09

హైదరాబాద్, అక్టోబర్ 21: రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణతోపాటు బంగారు తెలంగాణ సాధనలో పోలీసులే కీలకమని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. విధినిర్వహణలో ఈ యేడాది 383 మంది పోలీసులు అమరులయ్యారని మంత్రి తెలిపారు. నేరస్థులు తప్పించుకోలేరనే దిశగా పోలీసులు పనిచేయాలని సూచించారు.

10/22/2017 - 03:15

హైదరాబాద్, అక్టోబర్ 21: కెసిఆర్ కిట్స్ పథకం ప్రారంభమైన తర్వాత దవాఖానాల్లో పనిభారం పెరగడంతో డాక్టర్లను ప్రోత్సహించేందుకు ‘నగదు ప్రోత్సాహకాలు’ ఇవ్వాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నిర్ణయించారు. వైద్య ఆరోగ్య శాఖ కార్యక్రమాలపై శనివారం ఆయన ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు.

10/22/2017 - 01:58

హైదరాబాద్, అక్టోబర్ 21: రేషన్ (సబ్సిడీ బియ్యం) బదులుగా తాత్కాలికంగా నగదును పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రేషన్ డీలర్లు రాష్టవ్య్రాప్తంగా సమ్మెకు దిగుతున్నట్టు ప్రభుత్వానికి నోటీసు ఇవ్వడంతో శనివారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయంచారు. సిఎం నేతృత్వంలో జరిగిన సమావేశంలో డీలర్ల సమ్మెకు కారణాలు, పరిష్కార మార్గాలపై చర్చించారు.

10/22/2017 - 04:09

రాజమహేంద్రవరం, అక్టోబర్ 21: రాజమహేంద్రవరంలోని మధురపూడి విమానాశ్రయం శరవేగంగా విస్తరణ పనులు జరుగుతున్నాయి. రన్‌వేను విస్తరిస్తున్నారు. ఒకే సారి ఐదు భారీ విమానాలకు సరిపడే విధంగా ఏఫ్రాన్ నిర్మిస్తున్నారు. అదే విధంగా రాష్ట్రంలోనే ప్రత్యేక కార్గోకు భారీ ఏర్పాట్లు చేపట్టారు. కాంట్రాక్టు గడువు కంటే ముందే పనులు పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

10/22/2017 - 01:47

విశాఖపట్నం, అక్టోబర్ 21: రౌడీషీటర్ గేదెల రాజును హత్య చేయించింది తానేనని ఆర్టీసీ విజిలెన్స్ డిఎస్పీ రవిబాబు పోలీసుల ఇంటరాగేషన్‌లో ఒప్పుకున్నాడు. గేదెల రాజు హత్య జరిగిన తరువాత సుమారు 12 రోజుల పాటు అజ్ఞాతంలో ఉన్న రవిబాబు శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో చోడవరం పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన సంగతి తెలిసిందే. అతనిని న్యూ పోర్టు పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి విచారిస్తున్న సంగతి కూడా తెలిసిందే.

10/22/2017 - 03:27

విజయవాడ (క్రైం), అక్టోబర్ 21: సమాజంలో అసాంఘిక శక్తులను నిలువరించేందుకు నిరంతరం కృషి చేస్తున్న పోలీసులకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి చినరాజప్ప పిలుపునిచ్చారు. సమాజంలో పోలీసులు కూడా ఒక భాగమేనని, దేశ రక్షణ, భద్రత కోసం విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరుల త్యాగాలు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ప్రభుత్వం పోలీసు సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు.

10/22/2017 - 01:42

హైదరాబాద్, అక్టోబర్ 21: తెలంగాణ ఉపాధ్యాయ నిరుద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ నియామక పరీక్ష (టిఆర్‌టి) ప్రకటను తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ శనివారం విడుదల చేసింది. టిఆర్‌టి ద్వారా మొత్తం 8792 ఖాళీలను భర్తీ చేస్తారు. ఇందుకోసం టిఎస్‌పిఎస్‌సి ఐదు కేటగిరి పోస్టులకు ఐదు నోటిఫికేషన్లు జారీ చేసింది. టిఆర్‌టి పరీక్షకు దాదాపు ఐదు లక్షలమంది హాజరుకావొచ్చని అంచనా.

10/22/2017 - 01:40

విజయవాడ, అక్టోబర్ 21: విద్యార్థుల ఆత్మహత్యలకు నిలయాలుగా మారుతున్న కార్పొరేట్ విద్యా సంస్థలపై సిట్టింగ్ జడ్జిచే న్యాయ విచారణ జరిపించాలనే డిమాండ్‌పై రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాల ఆందోళనలు శనివారం ప్రారంభమయ్యాయి. అఖిల భారత విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు విజయవాడ ధర్నా చౌక్‌లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు నిరసన చేపట్టారు.

Pages