S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

02/13/2020 - 06:58

విశాఖపట్నం, ఫిబ్రవరి 12: కంప్యూటర్ సొసై టీ ఆఫ్ ఇండియా (సీఎస్‌ఐ) ఆధ్వర్యంలో రెండు రోజుల ఎపిక్-2020 సదస్సు నిర్వహించనున్నట్టు చైర్మన్ కేసీ దాస్ తెలిపారు. విశాఖలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 20,21 తేదీల్లో విశాఖ గేట్‌వే హోటల్‌లో ఈ సదస్సు జరుగుతుందన్నారు.

02/11/2020 - 23:12

పుట్టపర్తి, ఫిబ్రవరి 11: మానవాళికి భగవాన్ సత్యసాయిబాబా అందించిన సేవలు అద్భుతమని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్. ధోనీ అభివర్ణించారు. మంగళవారం పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో భగవాన్ సత్యసాయిబాబా మహాసమాధిని ధోనీ దర్శించుకున్నారు. బెంగళూరు నుంచి విమానంలో వచ్చిన ధోనీ ప్రశాంతినిలయం సాయికుల్వంత్ సభా మందిరానికి చేరుకున్నారు.

02/11/2020 - 22:55

తిరుపతి, ఫిబ్రవరి 11: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని శ్రీలంక ప్రధానమంత్రి మహీంద రాజపక్సే మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. ఆయనతో పాటు ఆయన కుమారుడు యోషిత రాజపక్సే, ఆ దేశ మంత్రి ఆర్ముగన్ తొండమాన్ స్వామివారిని దర్శించుకున్నారు.

02/11/2020 - 05:34

తిరుపతి: శ్రీలంక ప్రధాని మహింద్ర రాజపక్సే శ్రీవారి దర్శనార్థం సోమవారం రాత్రి 7.35 గంటలకు తిరుమలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పద్మావతి అతిథి భవనం వద్ద రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఈఓ ఏకే సింఘాల్, అదనపు ఈఓ ధర్మారెడ్డిలు ఆయనకు స్వాగతం పలికి వసతి ఏర్పాట్లుచేశారు.

02/11/2020 - 05:21

హైదరాబాద్, ఫిబ్రవరి 10: తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషన్‌లో కొత్తగా ఐదుగురు కమిషనర్లను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జీవో 23 జారీ చేశారు.

02/11/2020 - 05:12

ఆదిలాబాద్, ఫిబ్రవరి 10: ఎన్నో ఏళ్ళుగా ఆదిలాబాద్ జిల్లావాసులు ఎదురుచూస్తున్న ఆదిలాబాద్ నుండి బెంగళూర్‌కు ప్రత్యేక రైలు సౌకర్యం త్వరలో అందుబాటులోకి రానుందని పార్లమెంట్ సభ్యుడు సోయం బాపురావు తెలిపారు.

02/11/2020 - 00:57

హైదరాబాద్, ఫిబ్రవరి 10: ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వం విద్యుత్ కొనుగోలుకు కుదుర్చుకున్న ఒప్పందాలపై సమీక్ష చేయడానికి (పీపీఎలపై) ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి సుముఖత వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని మండలి చైర్మన్ సీవీ నాగార్జునరెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం హైకోర్టులో పీపీఏలపై వ్యాజ్యం నడుస్తోందన్నారు.

02/10/2020 - 06:29

తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం రాత్రి పౌర్ణమి గరుడ సేవ వైభవంగా నిర్వహించారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు తనకు ఎంతో ప్రీతిపాత్రమైన గరుడునిపై ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులకు దివ్యదర్శనమిచ్చారు.

02/10/2020 - 06:27

మచిలీపట్నం/ కోడూరు, ఫిబ్రవరి 9: మాఘ పూర్ణిమ పర్వదినాన్ని పురస్కరించుకుని కృష్ణా జిల్లాలోని సాగర సంగమ క్షేత్రాలు భక్తులతో పోటెత్తాయి. ఉప్పొంగి ప్రవహించే కృష్ణమ్మ సముద్రుడిలో కలిసే అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న కోడూరు మండలం హంసలదీవి వద్ద సాగర సంగమంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలకు అత్యంత చేరువలో మచిలీపట్నానికి సమీపంలోని మంగినపూడి సముద్ర తీరం భక్తజన సంద్రంగా మారాయి.

02/10/2020 - 01:10

తిరుపతి, ఫిబ్రవరి 9: తిరుమల శేషాచలం అడవుల్లోని పుణ్యతీర్థాల్లో ఒకటైన శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి ఆదివారం వేడుకగా జరిగింది. ప్రతియేటా మాఘమాసంలో పౌర్ణమినాడు శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీరామకృష్ణ మహర్షి తపోబలంతో ఈ పుణ్యతీర్థాన్ని సృష్టించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది.

Pages