S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/19/2016 - 02:24

అంతా అనుకున్నట్టే జరిగింది. వైసిపి ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్‌ను హైకోర్టు నిలిపివేసినా..ఆమెకు శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశించే అవకాశం దక్కలేదు. ఉదయం మొదలుకుని సాయంత్రం పొద్దుపోయే వరకూ రోజా వ్యవహారం రాజకీయ ఉత్కంఠను రేకెత్తించింది. కోర్టు ఉత్తర్వుతో సభలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన రోజాను చీఫ్ మార్షల్ గణేశ్ అడ్డుకున్నారు.

03/19/2016 - 02:13

హైదరాబాద్, మార్చి 18: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ సమావేశాల వేళ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం బెడిసికొడుతోంది. వేసిన ప్రతి అడుగూ పార్టీ ప్రతిష్ఠను, సభ్యుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తోంది. ఈ సమావేశాల్లో అధికార పార్టీపై విరుచుకుపడదామని అనుకున్న వైకాపా ప్రతిసారీ దెబ్బతింది. మరోవైపువైకాపా వ్యూహాలను ఎక్కడికక్కడ ఎదుర్కొంటూ అధికార పార్టీ బయటపడుతూ వచ్చింది.

03/18/2016 - 08:47

ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలు
హుషారెత్తించిన బ్రిటన్ పైలట్లు
ఏరోబొటిక్ కొత్త ప్రదర్శన
బేగంపేట విమానాశ్రయానికి సందర్శకుల తాకిడి
ఎమిరేట్స్ విమానాన్ని పరిశీలించిన డిజిపి

03/18/2016 - 08:41

విశాఖపట్నం, మార్చి 17: విశాఖ సాగర తీరంలో ప్రసిద్ధ పర్యాటక ప్రాంతంగా పేరొందిన కైలాసగిరి కొండపైకి వెళ్లేందుకు కేబుల్ కార్ వ్యవస్థను (రోప్ వే) మళ్లీ అందుబాటులోకి తెచ్చారు. కాగా, ఈ ఏడాది జనవరి నెలాఖరులో కేబుల్‌కార్ వైర్లు తెగిపడటంతో ఆరుగురు గాయాలపాలయ్యారు. దీంతో కేబుల్‌కార్ వ్యవస్థ మూతపడింది. పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండటంతో ఇటీవల వుడా అధికారులు కేబుల్ కార్ వ్యవస్థను పునరుద్ధరించారు.

03/18/2016 - 08:39

ఖమ్మం, మార్చి 17: మిర్చి బస్తాలతో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ పొటెత్తింది. ఈ ఏడాది మొదటి నుంచి మిర్చి ధర అధికంగా ఉంటుందని ఆశించారు. అదే స్థాయిలో ధర ఉండటంతో రైతులు మార్కెట్‌కు మిర్చిని వారం రోజులుగా తరలిస్తున్నారు. క్వింటాలు ధర 11వేల నుంచి 12,300వరకు ఉండటంతో రైతులు తాము పండించిన పంటను మార్కెట్‌కు తరలించటంతో మార్కెట్ మిర్చి బస్తాలతో నిండిపోయింది.

03/18/2016 - 08:39

అపస్మారక స్థితిలో తల్లి
చత్తీస్‌గఢ్‌లో దారుణం

03/18/2016 - 08:29

హైదరాబాద్, మార్చి 17: దేశంలోనే తొలిసారిగా సేఫ్టీ, సెక్యూరిటీపై సదస్సుకు హైదరాబాద్ వేదిక అయ్యింది. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సును డిజిపి అనురాగ్‌శర్మ గురువారం ప్రారంభించారు. సైబరాబాద్ పోలీసు విభాగం, హైటెక్స్ కనె్వన్షన్ సెంటర్లు ఈ సదస్సు నిర్వహణకు సహకారం అందిస్తున్నాయి.

03/18/2016 - 08:26

పెన్‌గంగా, తుమ్మిడిహెట్టిలకు లైన్‌క్లియర్
కాళేశ్వరం ముంపుపైనే మహారాష్ట్ర పట్టు
19న హైదరాబాద్‌లో అంతర్రాష్ట్ర జలమండలి బోర్డు తొలి భేటీ

03/18/2016 - 08:26

కేంద్ర మంత్రి హన్సరాజ్ గంగారాం
రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరిస్తాం

03/18/2016 - 08:25

హైదరాబాద్, మార్చి 17: వెనుకబడిన జిల్లాల్లో రైతులను ఆదుకునేందుకు కల్వకుర్తి ఎత్తిపోతల సాగునీటి పథకాన్ని సుమారు 3.65 లక్షల ఎకరాలకు నీరు అందించేందుకు రూ. 1295 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తోందని మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. తెలంగాణ శాసన మండలిలో గురువారం సభ్యుడు పాతూరి సుధాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్పారు.

Pages