S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/18/2016 - 06:07

అసెంబ్లీ హాజరుకు లైన్ క్లియర్
ఎమ్మెల్యే ప్రవర్తనకు ఇది కితాబుకాదు
స్పీకర్‌కూ వ్యతిరేకం కాదు
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
ఇరకాటంలో పడిన ప్రభుత్వం
పార్టీ పెద్దలతో బాబు భేటీ
హైకోర్టు ఫుల్‌బెంచ్‌కు వెళ్లాలని నిర్ణయం
నేడు సభకు హాజరుకానున్న రోజా
ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు జగన్ వ్యూహం

03/17/2016 - 08:11

హైదరాబాద్, మార్చి 16 : ఆంధ్రప్రదేశ్‌లో విద్యుదుత్పత్తికి న్యూక్లియర్ రియాక్టర్‌ను ఏర్పాటు చేసేందుకు అనువైన మరొక స్థలం కోసం వెతుకుతున్నామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

03/17/2016 - 04:57

హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో నిరసనగా వాకౌట్ కూడా చేయలేని విచిత్ర పరిస్థితి ప్రధాన ప్రతిపక్షమైన వైకాపాకు ఎదురైంది. వాకౌట్ చేసేందుకు కూడా అవకాశం ఇవ్వకపోవడంతో ప్రతిపక్షం తీవ్ర ఆందోళనకు దిగింది. ఎపి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తర కార్యక్రమ సమయంలో ఈ వివాదం తలెత్తింది.

03/16/2016 - 07:32

హైదరాబాద్: ప్రయాణీకుల భద్రతను పరిరక్షించడానికి, రైల్వే సేవల సామర్ధ్యాన్ని పెంచడానికి నిశిత పర్యవేక్షణ అవసరమని దక్షిణ మధ్య రైల్వే జనరల్ రవీందర్‌గుప్తా అన్నారు. రైల్ నిలయంలో మంగళవారం జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ఆయన ప్రసంగించారు. సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు, నాందేడ్ డివిజన్ల డిఆర్‌ఎంలు వీడియో కానె్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

03/16/2016 - 07:30

విశాఖపట్నం: ఇంటర్నెట్ సదుపాయాలకల్పనలో మరో విప్లవాత్మక అడుగు పడబోతోంది. నామమాత్రపు రుసుముతో కేబుల్, టెలిఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్లు అందించే ఫైబర్‌నెట్‌ను ప్రయోగాత్మకంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో అమలు చేసే ప్రక్రియను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విశాఖలో గురువారం ప్రారంభించనున్నారు. ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చే క్రమంలో 10 ఎంబిపిఎస్ వేగంతో కేవలం రూ.150కే ఇంటర్నెట్ సదుపాయం కల్పించనున్నారు.

03/16/2016 - 07:29

విశాఖపట్నం: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సాగరమాల ప్రాజెక్టు కింద వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు విశాఖ పోర్టు ట్రస్టు దృష్టి సారించింది. సాగరమాల కింద ఓడరేవుల నిర్మాణం, అభివృద్ధి, నౌకాయానం, సరకు రవాణా, నౌకానిర్మాణం వంటివి చేపట్టేందుకు కేంద్రం ప్రతిపాదించింది.

03/16/2016 - 07:20

హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో 1956 నుంచి విభజన జరిగేంతవరకు తెలంగాణలో ఆదాయం ఎక్కువగా ఉండగా, ఆంధ్రలో ఎక్కువ వ్యయం చేశారని సామాజిక ఆర్థిక సర్వే 2016లో పేర్కొన్నారు. సాధారణంగా నష్టాల్లో ఉన్న కంపెనీలు కాయకల్ప చికిత్స తరువాత లాభాల బాట పడుతుంటాయి. ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్న ఇలాంటి కంపెనీలను స్టాక్ మార్కెట్ పరిభాషలో టర్న్‌డ్ అరౌండ్ కంపెనీలు అంటారు.

03/16/2016 - 07:18

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభలో స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించిన వైకాపా వ్యూహాన్ని అధిగమించేందుకు ఏకంగా శాసనసభ నియమావళినే రద్దు చేసిన ఘనత టిడిపి సర్కార్ దక్కించుకుంది. స్పీకర్ కోడెల శివప్రసాదరావును పదవి నుండి తప్పించాలంటూ వైకాపా ఎమ్మెల్యేలు ఎనిమిదిమంది శాసనసభ కార్యదర్శికి నోటీసు ఇచ్చారు. రాజ్యాంగంలోని 179 ఆర్టికల్, క్లాజ్ (సి) కి అనుగుణంగా నోటీసు జారీ ఇచ్చారు.

03/16/2016 - 05:26

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై ప్రతిపక్ష పార్టీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ చేపట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. మంగళవారం శాసనసభలో సుమారు రెండు గంటలపాటు జరిగిన చర్చ అనంతరం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చేసిన సూచన మేరకు సభాపతి స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ ఓటింగ్ నిర్వహించారు. ఈ ఓటింగ్‌లో అవిశ్వాసానికి అనుకూలంగా 57, వ్యతిరేకంగా 97 ఓట్లు వచ్చాయి.

03/16/2016 - 05:23

విజయవాడ: ఎక్కడో హైదరాబాద్.. మరెక్కడో అమలాపురం.. నాలుగు రోజులపాటు ఆటలు, ఆపై విహారయాత్రలో ఆనందంగా గడిపి ఇంటిముఖం పట్టిన 35 మంది వైద్య విద్యార్థుల్లో నలుగురు విజయవాడ సమీపంలో సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవటం, మరో 9 మంది తీవ్రంగా గాయపడిన దుర్ఘటన ఇటు ఆంధ్ర, అటు తెలంగాణ రాష్ట్రాల్లో విషాద ఛాయలు నింపింది.

Pages