S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/20/2016 - 03:01

హైదరాబాద్: వ్యక్తిగతంగా, సమాజపరంగా, హక్కులపరంగా అన్యాయం జరిగినప్పుడు చివరగా ప్రజలు న్యాయస్థానాలను ఆశ్రయిస్తారని, వారి విశ్వాసాన్ని వమ్ము చేయకుండా న్యాయం జరిగేలా చూసే గురుతర బాధ్యత న్యాయ వ్యవస్థపై ఉందని సిఎం కె చంద్రశేఖర్‌రావు సూచించారు. హైదరాబాద్‌లో రెండు రోజులపాటు జరగునున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల న్యాయాధికారుల సదస్సు శనివారం స్థానిక మారియట్ హోటల్లో ప్రారంభమైంది.

03/20/2016 - 03:01

హైదరాబాద్, మార్చి 19: ఆంధ్రప్రదేశ్ శాసనసభ వరుసగా రెండోరోజు శనివారం కూడా రోజా అంశంపై అట్టుడికిపోయింది. సభ ప్రారంభంనుండి వైకాపా ఎమ్మెల్యేలు ‘ఉయ్ వాంట్ జస్టిస్’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరుగుతుండగానే వైకాపా సభ్యులు పోడియం వద్దకు చేరుకుని నినాదాలు చేయడంతో సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది.

03/20/2016 - 02:59

హైదరాబాద్: రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆస్తుల పంపకాల కేసులో సుప్రీంకోర్టులో విజయం సాధించిన ఆంధ్రకు బంగారుపంట పండింది. వివిధ కామన్ ఎంట్రన్స్ టెస్టులు నిర్వహించిన వర్శిటీల్లో మిగులు నిధులు ఉన్నత విద్యామండలిలో ఫిక్స్‌డ్ డిపాజిట్లు రూపంలో ఉన్నాయి. తాజాగా సుప్రీం కోర్టు తీర్పుతో కేవలం విద్యాశాఖ అనుబంధ సంస్థల నుంచే దాదాపు నాలుగు వేల కోట్లు ఆంధ్రకు దక్కే అవకాశం కనిపిస్తోంది.

03/20/2016 - 02:48

హైదరాబాద్, మార్చి 19: న్యాయాధికారుల సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంగ్లంలో ప్రసంగిస్తే, తెలంగాణ సిఎం కెసిఆర్ తెలుగులో మాట్లాడటం విశేషం. తన సహచర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంగ్లంలో ప్రసంగించడంతో తాను తెలుగులో మాట్లాడుతానంటూ కెసిఆర్ ప్రసంగాన్ని ప్రారంభించారు.

03/19/2016 - 06:52

హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రజా సమస్యలపై గళం విప్పాలని చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అధ్యక్షత శుక్రవారం సమావేశమైన టిజెఎసి కోర్ కమిటీ నిర్ణయించింది. హైదరాబాద్‌లో సెక్షన్ 8 అమలు చేయాలని ఆంధ్ర అసెంబ్లీలో చంద్రబాబు చేయించిన తీర్మానం హాస్యాస్పదంగా ఉందని కోదండరామ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

03/19/2016 - 06:22

హైదరాబాద్: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అసెంబ్లీలో అన్‌పార్లమెంటరీ పదాలు వాడినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మరో ముగ్గురు మంత్రులకు వ్యతిరేకంగా వైకాపా సభాహక్కుల ఉల్లంఘన కింద నోటీసులను శాసనసభ కమిటీకి అందచేసింది. మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కె అచ్చెంనాయుడు, కామినేని శ్రీనివాస్‌పై ఈ నోటీసులను అందచేశారు.

03/19/2016 - 06:21

ఆంధ్రభూమి బ్యూరో

03/19/2016 - 06:19

హైదరాబాద్: ప్రజాసమస్యలను చర్చించే వేదికైన శాసనసభలో అధికార, విపక్షాలు వాటిని పక్కన పెట్టి, పంతాలు, పట్టింపులకు పోతున్నాయి. విపక్షాన్ని రెచ్చగొట్టి, వారిని తప్పుదోవపట్టించి తమ లోపాలు బహిర్గతం కాకుండా చూసుకోవాలని అధికార పక్షం ప్రయత్నిస్తున్నట్టు ప్రస్తుతం జరుగుతున్న శాససనభ సమావేశాలు చూస్తే అర్థం అవుతోంది. అవిశ్వాస తీర్మానాలతో సభా సమయం రెండు రోజులు వృథా అయింది.

03/19/2016 - 06:18

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి సస్పెండయిన వైకాపా ఎమ్మెల్యే రోజా అంశం వివాదాస్పదమవుతోంది. ఈ అంశంలో పాలక ప్రతిపక్షాలు పంతాలు పట్టింపులకు పోతున్న నేపథ్యంలో సమస్య మరింత జటిలమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. దీనిపై సోమవారం అసెంబ్లీలో చర్చించాలని నిర్ణయించడంతో ఏం జరగనున్నదోనన్న ఉత్కంఠ నెలకొంది.

03/19/2016 - 02:46

హైదరాబాద్: కిడ్నాపర్ల చేతిలో కిరాతకంగా హత్యకు గురైన విద్యార్థి అభయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు సాయి అరెస్టయ్యాడు. రాజమండ్రి టాస్క్ఫోర్స్ పోలీసులు నిందితుడు సాయిని అదుపులో తీసుకొని విచారిస్తున్నట్టు డిసిపి వెంకటేశ్వరరావు తెలిపారు. బుధవారం సాయంత్రం కిడ్నాప్‌కు గురైన విద్యార్థి మృతదేహాన్ని పోలీసులు సికిందరాబాద్‌లోని అల్ఫా హోటల్ ఎదురుగా ఓ అట్టపెట్టెలో కనుగొన్న సంగతి తెలిసిందే.

Pages