S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

02/12/2016 - 06:38

ఏలూరు: ప్రభుత్వ కార్యాలయాల పనితీరుపై సంవత్సరాల తరబడి అసంతృప్తులు వ్యక్తం కావటం బహిరంగరహస్యమే. సమయానికి తెరుచుకోకపోవటం, పనివేళల్లో ఉద్యోగులు, సిబ్బంది అందుబాటులో లేకపోవటం వంటివి అందరికి అనుభవమే. ఇలాంటి సమస్యకు కేంద్ర ప్రభుత్వం అనే్వషించిన నూతన సాంకేతిక బయోమెట్రిక్ విధానం కొంతవరకు కార్యాలయాల పనితీరులో వౌలికమైన మార్పురావడానికి కారణమైందనే చెప్పాలి.

02/12/2016 - 06:37

విజయవాడ: రాష్ట్ర అభివృద్ధికి నీరు ప్రధాన ఆధారంగా భావించిన రాష్ట్ర ప్రభుత్వం జలవనరుల అభివృద్ధికి పెద్దపీట వేసిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. భూగర్భ జలాల మెరుగుదలకు ప్రాధాన్యతనిస్తూ హెచ్చుతగ్గులను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు గాను ఫిజో మీటర్లను ఏర్పాటుచేసి పర్యవేక్షించటం జరుగుతుందన్నారు.

02/11/2016 - 08:23

చీరాల, ఫిబ్రవరి 10: ప్రకాశం జిల్లా కారంచేడు పోలీస్‌స్టేషన్‌లో విచారణ పేరుతో అదుపులో ఉన్న వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా సంచలనం కలిగించింది. మృతుడిది లాకప్‌డెత్ అంటూ అతని బంధువులు ఆందోళనకు దిగారు. పోలీసులు, మృతుని బంధువులు తెలిపిన వివరాల మేరకు పొన్నూరుకు చెందిన బొమ్మన పరిపూర్ణచంద్రరావు(28) ఆటో డ్రైవర్. అతనికి సుమారు మూడేళ్ల క్రితం లక్ష్మితో వివాహమైంది.

02/11/2016 - 08:23

హైదరాబాద్, ఫిబ్రవరి 10: ఎస్‌సి, ఎస్‌టి ఉపప్రణాళికా నిధులను దారిమళ్లిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులకు సాంఘిక సంక్షేమ మంత్రి రావెల కిషోర్‌బాబు హెచ్చరించారు. 31 శాఖల ముఖ్యకార్యదర్శులు, శాఖాధిపతులతో బుధవారం ఆయన సచివాలయంలో నోడల్ ఏజెన్సీ సమావేశం నిర్వహించారు. ఉపప్రణాళిక ద్వారా లభిస్తున్న నిధులను కేవలం ఎస్‌సి, ఎస్‌టిల అభివృద్ధి కోసమే వినియోగించాలన్నారు.

02/11/2016 - 08:22

కాకినాడ, ఫిబ్రవరి 10: కాపుల సంక్షేమం కోసం తాను రాష్ట్ర ప్రభుత్వానికి పెట్టిన డిమాండ్లలో 20 శాతం మాత్రమే సాధించుకోగలిగానని మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం స్పష్టంచేశారు. మిగిలిన 80 శాతం డిమాండ్లను రానున్న ఏడు నెలల్లో సాధించుకోవల్సి ఉందన్నారు. ఏడు నెలల తరువాత తమ డిమాండ్లు నెరవేరని పక్షంలో మరోసారి రోడ్డుకెక్కాల్సి వస్తుందని హెచ్చరించారు.

02/11/2016 - 08:21

గుంటూరు, ఫిబ్రవరి 10: గుంటూరు జిల్లాలోని 18 మండలాలను వ్యవసాయ జోన్‌లుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించడంపై అన్నదాతల నుండి అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని వివిధ మండలాలను రాజధాని ప్రాంతాలుగా ప్రభుత్వం గుర్తించిన నేపథ్యంలో మరికొన్ని మండలాలను వ్యవసాయ జోన్‌లుగా ప్రకటించింది.

02/10/2016 - 07:44

కర్నూలు, ఫిబ్రవరి 9: పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్య ప్రకాశ్‌రెడ్డికి క్షమాపణ చెప్పామని ఎఐసిసి కార్యదర్శి తిరునావుక్కరసు స్పష్టం చేశారు. అనంతపురంలో రాహుల్ గాంధీ సభ సందర్భంగా జరుగకూడని సంఘటన జరిగిందని విచారం వ్యక్తం చేశారు.

02/10/2016 - 07:43

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 9: కాపు ఐక్య గర్జన సభ సందర్భంగా చోటుచేసుకున్న వివిధ సంఘటనల విషయంలో రాష్ట్రప్రభుత్వం ఎలా వ్యవహరించినప్పటికీ రైల్వే కేసులు మాత్రం ఆందోళనకారులను వెంటాడేలా ఉన్నాయి. గత నెల 31న తుని సమీపంలో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు కొంత మంది నిప్పుపెట్టిన సంగతి విదితమే.

02/10/2016 - 07:41

విజయవాడ: బిసి జాబితాలోకి ఇప్పటికే 140 కులాలు చేరటంతో ఆశించిన ప్రయోజనాలు చేకూరనందున ఇక ఏ ఒక్క కులాన్ని కూడా చేర్చినా సహించేది లేదంటూ బిసి జనసభ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ జి.గంగాధర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బిసి సంఘాలన్నింటితో సంయుక్త కార్యాచరణ కమిటీని ఏర్పాటుచేసి పోరాటాలు సాగించబోతున్నామని ఆయన వెల్లడించారు.

02/10/2016 - 07:39

రాజమహేంద్రవరం: రిజర్వేషన్ల విషయంలో కాపు సామాజిక వర్గీయులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మోసం చేస్తారని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ వ్యాఖ్యానించారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో 1996నుంచి తాము మోసపోతున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

Pages