S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

02/13/2016 - 00:53

హైదరాబాద్, ఫిబ్రవరి 12: తెలుగుదేశం శాసన సభాపక్షానికి చెందిన తమను తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభాపక్షంలో విలీనం చేయాలని కోరుతూ పదిమంది తెదేపా ఎమ్మెల్యేలు సంతకాలతో కూడిన లేఖను శుక్రవారం స్పీకర్‌కు పంపించారు. తెలుగుదేశం నుంచి 15మంది శాసన సభ్యులం గెలిచామని, తెలుగుదేశం శాసన సభాపక్షంగా వ్యవహరిస్తున్నట్టు స్పీకర్‌కు రాసిన లేఖలో తెలిపారు.

02/13/2016 - 00:52

హైదరాబాద్, ఫిబ్రవరి 12: ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయం భవనాల నిర్మాణానికి సంబంధించి రేటు కుదరకపోవడంతో శుక్రవారం సిఎం చంద్రబాబు వేయాల్సిన ఫౌండేషన్ స్టోన్ కార్యక్రమం వాయదాపడింది. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. రెండు మూడు రోజుల్లో టెండర్లు ఖరారు చేస్తామని మున్సిపల్ వ్యవహారాల ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు.

02/13/2016 - 00:51

ఏలూరు, ఫిబ్రవరి 12: డిపాజిటర్లను భారీగా మోసం చేశారనే అభియోగంపై సిబిసిఐడి పోలీసులు అరెస్టుచేసిన అగ్రిగోల్డ్ ఛైర్మన్ అవ్వా వెంకట రామారావు, మేనేజింగ్ డైరెక్టర్ అవ్వా వెంకట శేషు నారాయణరావుకు శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా ఇన్‌ఛార్జి న్యాయమూర్తి 14 రోజుల రిమాండు విధించారు.

02/13/2016 - 02:03

శ్రీకాకుళం, ఫిబ్రవరి 12: మిగిలిన జిల్లా కేంద్రాలతో సమానంగా శ్రీకాకుళం, మచిలీపట్నం, చిత్తూరుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటి అద్దె భత్యాన్ని (హెచ్‌ఆర్‌ఎ) పెంచుతున్నట్టు సిఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ మూడు ప్రాంతాల్లో ప్రస్తుతం 14.5 శాతమున్న హెచ్‌ఆర్‌ఎను 20శాతం చేయనున్నట్టు ప్రకటించారు. అలాగే మహిళా ఉద్యోగులకు చైల్డ్‌కేర్ సెలవును 60 రోజుల ముందునుంచే ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు.

02/13/2016 - 00:47

విశాఖపట్నం, ఫిబ్రవరి 12: భారత్- అమెరికా మధ్య పరస్పర సహకారం కొనసాగుతుందని భారత్‌లో అమెరికా రాయబారి రిచర్డ్ ఆర్ వర్మ అన్నారు. విశాఖ స్మార్ట్ సిటీ మాస్టర్ ప్లాన్ తయారీతోపాటు, అవసరమైన నిధుల సమీకరణకు ఆంధ్రప్రదేశ్, యునైటెడ్ స్టేట్ ట్రేడ్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (యుఎస్‌టిడిఏ) మధ్య శుక్రవారం విశాఖలో ఒప్పందాలు కుదిరాయి.

02/12/2016 - 06:54

హైదరాబాద్, ఫిబ్రవరి 11: విశాల ప్రజా ప్రయోజనాలను ఆశించే పిటిషన్లను మాత్రమే ప్రజా వ్యాజ్యాలుగా స్వీకరించాలనే ఉద్దేశంతో కొత్త నిబంధనలను ఖరారు చేసినట్లు హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. పిల్స్‌పై రూపొందించిన కొత్త మార్గదర్శకాలపై స్టే ఇవ్వాలని కోరుతూ కె శ్రావణ్‌కుమార్ దాఖలుచేసిన పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది.

02/12/2016 - 06:53

హైదరాబాద్, ఫిబ్రవరి 11: పలు ఆర్ధిక నేరాలను ఎదుర్కొంటున్న ఈనాడు గ్రూపు సంస్ధల అధినేత సిహెచ్ రామోజీరావుకు పద్మవిభూషణ్ అవార్డుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఫార్సు చేయడం, కేంద్రం ఈ అవార్డును ప్రకటించడంపై విచారణ జరిపించాలని కాంగ్రెస్ మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీని కోరారు. ఈ మేరకు తాను ఒక వినతిపత్రాన్ని పంపానని ఆయన చెప్పారు.

02/12/2016 - 06:52

హైదరాబాద్ : ఏపి ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించిన కాపు రిజర్వేషన్ ఆందోళన-దాని పర్యవసానాలు, ప్రభుత్వం తరఫున ఇప్పటికే తీసుకున్న చర్యలతో పాటు భవిష్యత్తులో ఏం చేయాలన్నదానిపై చర్చించేందుకు ఈ నెల 15 న ప్రత్యేకంగా క్యాబినెట్ సమావేశం ఏర్పాటవుతోంది. మంత్రివర్గ సమావేశాన్ని ప్రత్యేక సమావేశం అనకపోయినప్పటికీ, చర్చంతా కాపు రిజర్వేషన్‌పైనే ఉంటుందని విశ్వసనీయ సమాచారం వల్ల తెలిసింది.

02/12/2016 - 06:42

విజయవాడ: మాఘమాసం పురస్కరించుకుని ప్రకాశం బ్యారేజీ సమీపంలోని శ్రీ విజయేశ్వరస్వామివారి ఆలయ ప్రాంగణంలో సామూహిక సూర్య, సహస్రనామ పారాయణ, అరుణ పారాయణ, అరుణ హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు రథసప్తమి రోజైన ఈ నెల 14 నుంచి మార్చి 7వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్టు కార్యక్రమ నిర్వాహకులు పండిత పసుమర్తి కామేశ్వరశర్మ తెలిపారు.

02/12/2016 - 06:40

శ్రీకాకుళం: ఏపి ఎన్జీవోల రాష్ట్ర మహా సభలు శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభం కానున్నాయి. ఎచ్చెర్లలోని శ్రీశివానీ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో రెండు రోజుల పాటు జరిగే ఈ మహాసభలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించనున్నారు. మహా సభలకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి 2001 ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హాజరుకానున్నారు.

Pages