S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

02/15/2016 - 00:10

విశాఖపట్నం, ఫిబ్రవరి 14: ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో ఆదివారం వేర్వేరుచోట్ల సంభవించిన రోడ్డు ప్రమాదాల్లో పదిమంది మరణించారు. విశాఖ జిల్లా యలమంచిలి వద్ద అంబులెన్స్ ఒకటి వంతెనపైనుంచి కాల్వలో పడిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు మరణించారు. ఒడిశాలోని బాలేశ్వర్ ప్రాంతానికి చెందిన నిరంజన్‌గిరి (70) చికిత్స పొందుతూ హైదరాబాద్‌లో మృతిచెందాడు.

02/15/2016 - 00:09

హైదరాబాద్, ఫిబ్రవరి 14 : ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయానికి ఒకటి రెండురోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేసే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 10 వ తేదీన శంకుస్థాపన చేయాలని ముహూర్తంగా నిర్ణయించినప్పటికీ, భవనాల నిర్మాణానికి సంబంధించి నిర్మాణ సంస్థలతో ఆర్థిక ఒప్పందం కుదరకపోవడంతో శంకుస్థాపన కార్యక్రమం వాయిదా పడ్డది.

02/14/2016 - 08:13

తిరుపతి: దేశంలోని 40 కోట్లమంది అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్టు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. శనివారం స్థానిక రాష్ట్ర కార్మిక బీమా వైద్యశాలను నూతనంగా నిర్మిస్తున్న భవనాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కార్మికులకు సామాజిక భద్రత కల్పించడానికి స్మార్ట్‌కార్డులు పంపిణీ చేస్తామన్నారు.

02/14/2016 - 06:50

* జెఎన్‌యు పరిణామాలతో బట్టబయలు
* ఆంధ్రభూమి సంపాదకులు ఎంవిఆర్ శాస్ర్తీ

02/14/2016 - 03:01

విజయవాడ: కాపులను బీసీ జాబితాలో చేర్చినంతమాత్రాన ప్రస్తుతం బీసీలకు అమలవుతున్న విద్య, ఉద్యోగ, రాజకీయ, ఆర్ధికపరమైన రిజర్వేషన్ల కోటాలో ఏమాత్రం అన్యాయం జరగదని, ఈ విషయంలో అనవసర భయాందోళన వద్దని సిఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఈ విషయాలు తెలిసినా కొందరు బీసీ నేతలు కావాలనే ఆయా వర్గాలను తప్పుదోవ పట్టిస్తూ రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

02/14/2016 - 02:56

హైదరాబాద్: మేకిన్ ఇండియా వారోత్సవ సదస్సు భారత దేశ ఉత్పాదన రంగానికి ఉత్ప్రేరకమమని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. సదస్సు ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు వేదికగా ఉపయోగపడుతుందని అన్నారు.

02/14/2016 - 02:49

హైదరాబాద్: మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఆంధ్ర అవతరించిందని, వచ్చే వేసవిలో కొరత పరిస్థితి తలెత్తదని సిఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు, వ్యవసాయానికి కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేసే స్థితికి చేరామన్నారు. శుక్రవారం విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సమీక్ష వివరాలను ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ వెల్లడించారు.

02/14/2016 - 02:46

హైదరాబాద్: ఓటుకు నోటు కేసు మళ్లీ కదిలింది. కేసులో నాల్గవ నిందితుగా ఉన్న జెరూసలేం మత్తయ్య వారంలోగా ఏసిబి కార్యాలయానికి వచ్చి వాంగ్మూలమివ్వాలంటూ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ శనివారం నోటీసులు జారీ చేశారు. వీలైనంత త్వరలో అనుబంధ చార్జిషీటు దాఖలు చేసి కోర్టు ద్వారా అనుమానితులకు సమన్లు చేసే దిశగా ఏసిబి న్యాయ ప్రక్రియ చేపట్టనుంది.

02/14/2016 - 02:44

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం పన్ను రాబడిపై పెట్టుకున్న అంచనాల లెక్కలు గాడి తప్పుతున్నాయి. 2015-16 ఆర్ధిక సంవత్సరంలో ఆశించిన ఆదాయం కంటే 12 వేల కోట్ల ఆదాయం తగ్గుతోంది. ఈ ఏడాది పన్నుల రూపేణా 44,423 కోట్ల ఆదాయం వస్తుందని రాష్ట్ర ఆర్ధిక శాఖ పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం మార్చి 31తో ముగుస్తుంది. పన్ను వసూలు 40,029 కోట్ల రూపాయలు వస్తుందని తేలింది.

02/13/2016 - 03:34

హైదరాబాద్/ముషీరాబాద్, ఫిబ్రవరి 12: తిరుమల తిరుపతి దేవస్థానం,తిరుపతి హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు శుక్రవారంతో ముగిసాయి. చివరిరోజు కార్యక్రమంలో భాగంగా ‘పుష్పయాగా‘న్ని వైభవంగా నిర్వహించారు. చివరిరోజు కావటంతో శ్రీవారిని దర్శించుకోవటానికి భక్తులు శుక్రవారం ఉదయం నుంచే బారులు తీరారు.

Pages