S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

08/10/2018 - 00:50

హైదరాబాద్, ఆగస్టు 9: ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడ్డ రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగిస్తున్న టీఆర్‌ఎస్‌ను బహిష్కరించేందుకు క్విట్ టీఆర్‌ఎస్ పేరుతో కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేయాలని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపు నిచ్చారు. గురువారం గాంధీ భవన్‌లో సేవాదళ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవాదళ్ క్రాంతి దివాస్ కార్యక్రమానికి ఉత్తమ్ ముఖ్య అతిధిగా హాజరై జెండాను ఆవిష్కరించారు.

08/10/2018 - 00:47

హైదరాబాద్, ఆగస్టు 9: గ్రామాలను పచ్చదనంగా, పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా పంచాయతీలను తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. మూస పద్ధతిలో కాకుండా వినూత్నంగా ఆలోచించి వ్యూహం ఖరారు చేయాలన్నారు. వచ్చే మూడు నెలల్లో గ్రామ పంచాయతీల సమగ్రాభివృద్ధికి ఏమేమి చేయాలో కార్యాచరణను రూపొందించాలని సీఏం ఆదేశించారు.

08/10/2018 - 02:18

హైదరాబాద్: రాష్ట్ర వెనకబడిన తరగతుల సంక్షేమానికి 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఖరారు చేసిన ప్రణాళికకు దాదాపు రూ.6 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి తెలిపారు. సచివాలయంలో గురువారం బీసీ సంక్షేమశాఖ ఉన్నతాధికారులతో జోషి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జోషి మాట్లాడుతూ, బీసీ విద్యార్థుల మెయింటనెన్స్ ఫీజుకు రూ.487 కోట్లు, బీసీ, ఈబీసీ ట్యూషన్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు

08/10/2018 - 00:57

హైదరాబాద్: ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటన ఖరారయింది. జాతీయ అధ్యక్షుడి హోదాలో మొదటిసారిగా రాహుల్ నగరానికి వస్తుండటంతో పీసీసీ విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. 13న ఢిల్లీ నుంచి బీదర్‌కు అక్కడి నుంచి మధ్యాహ్నం 2 గంటలకు రాహుల్ శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. క్లాసిక్ గార్డెన్‌కు 3:30కు చేరుకొని 4:30 వరకు మహిళా సంఘాలతో భేటీ అవుతారు.

08/10/2018 - 04:40

రౌతులపూడి: తాము అధికారంలోకి వస్తే పార్టీలతో ప్రమేయం లేకుండా అన్ని వర్గాలకూ ప్రభుత్వ ఫలాలు అందేలా చేస్తామని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగిస్తున్న ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గురువారం రౌతులపూడి మండలంలో కొనసాగింది. మండలంలోని పారుపాక డీజే పురం జంక్షన్ నుంచి ఉదయం 8.35 గంటలకు పాదయాత్ర ప్రారంభించిన ఒక గంట మాత్రమే కొనసాగించారు.

08/10/2018 - 04:38

విశాఖపట్నం: వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తామని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. గురువారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడిన ఆయన నాలుగేళ్లుగా ఏపీకి బీజేపీ అన్యాయం చేస్తూనే వచ్చిందన్నారు. ఆంధ్ర ప్రజలను నమ్మించి మోసం చేసినందుకు డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో ప్రతిపక్ష అభ్యర్థికి ఓటు వేశామని చెప్పారు.

08/10/2018 - 00:32

విజయవాడ, ఆగస్టు 9: అటవీ హక్కుల చట్టాన్ని యుపీఏ ప్రభుత్వమే తీసుకువచ్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే గిరిజనులకు 12.12 లక్షల ఎకరాలు పంపిణీ చేశామని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి ఊమెన్ చాందీ పేర్కొన్నారు. గురువారం ఉదయం ఏఐసీసీ పిలుపు మేరకు విజయవాడ లెనిన్ సెంటర్‌లో కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో 76వ క్విట్ ఇండియా ఉద్యమం దినోత్సవ సందర్భంగా 76 మీటర్ల జాతీయ జెండా ప్రదర్శన జరిగింది.

08/10/2018 - 00:17

పాడేరు, ఆగస్టు 9: విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలను చేపట్టే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. విశాఖ జిల్లా పాడేరులో గురువారం నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన బాక్సైట్ అంశాన్ని తన ప్రసంగంలో ప్రముఖంగా ప్రస్తావించి ఆదివాసీల్లో నెలకొన్న అపోహలు, భయాలను తొలగించారు.

08/09/2018 - 17:58

పాడేరు: గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపే బాధ్యత ప్రభుత్వానిదేనని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖ జిల్లా పాడేరులో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిప్రగతి వెబ్‌సైట్‌, జీసీసీ ఉత్పత్తులను చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నక్కా ఆనంద్‌బాబు, అయ్యన్నపాత్రుడు, విశాఖ జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

08/09/2018 - 13:34

హైదరాబాద్‌: సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్‌ శ్రేణులంతా సిద్ధంగా ఉండాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాహుల్‌గాంధీ పర్యటనను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఉత్తమ్‌ ఆరోపించారు.

Pages