S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

08/11/2018 - 01:49

తిరుపతి, ఆగస్టు 10: తిరుమలలో శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల సంఖ్య శుక్రవారం గణనీయంగా తగ్గింది. సర్వసాధారణంగా శుక్ర, శని, ఆదివారాల్లో శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది.

08/11/2018 - 01:05

విజయవాడ, ఆగస్టు 10: రాష్ట్రంలో తిరుమల తర్వాత అతిపెద్ద ఆలయంగా ప్రాశస్త్యం పొందిన విజయవాడ దుర్గగుడి సన్నిధిలో జరుగుతున్న అపచారాలతో ప్రభుత్వం అప్రతిష్ఠను మూటగట్టుకుంటున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబునాయుడు స్వయంగా రంగంలోకి దిగారు. ముందుగా అన్ని విభాగాల్లోను ప్రక్షాళన చేసేందుకు నడుంకట్టారు. దుర్గమ్మకు ఓ భక్తురాలు సమర్పించిన విలువైన చీర చోరీకి గురికావడం...

08/11/2018 - 01:01

హైదరాబాద్, ఆగస్టు 10: కూలిపోయే దశలో ఉన్న స్కూళ్లను పట్టించుకోవాలని, ఇప్పటికే పాడుబడిన స్కూళ్ల స్థానే కొత్త భవనాలు నిర్మించాలని కేంద్రం 36 రాష్ట్రాలను ఆదేశించింది. ఇందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో 0.24 శాతం పాఠశాలలు పాడుబడ్డాయని, మరో 6.86 శాతం తరగతి గదులకు సంపూర్ణ మరమ్మతులు అవసరమని పేర్కొంది.

08/11/2018 - 01:01

విజయవాడ (బెంజిసర్కిల్), ఆగస్టు 10: లాలూచీ ఆలోచనలు లేకుండా... తెర వెనుక రాజకీయాలు చేయకుండా... రాష్ట్ర సమస్యలపై ఉద్యమిస్తుంటే తనను, తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని చంద్రబాబునాయుడు రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్య వాదులకు బహిరంగ లేఖ రాసారు.

08/11/2018 - 00:40

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్ జనరల్‌గా సీనియర్ న్యాయవాది బండ శివానంద ప్రసాద్ నియమితులయ్యారు. ఇందు కు సంబంధించిన ఫైల్‌పై సీఎం కే. చంద్రశేఖర రావు శుక్రవారం ఉదయం సంతకం చేశారు. అనంతరం న్యాయశాఖ కార్యదర్శి వి నిరంజన్‌రావు శివానంద ప్రసాద్ నియామకానికి సంబంధించి జీవో 422ను విడుదల చేశారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి కొత్త ఏజీ కృతజ్ఞతలు చెప్పగా, సీఎం ఆయనను అభినందించారు.

08/11/2018 - 00:32

హైదరాబాద్, ఆగస్టు 10: ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటన, విద్యార్థులతో భేటీ కార్యక్రమం రద్దయ్యింది. రాహుల్ పర్యటనకు వర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ససేమిరా అన్నారు. కాంగ్రెస్‌కు అనుబంధ విభాగమైన విద్యార్థి సంఘం చేసిన విజ్ఞప్తిని వర్సిటీ జాయింట్ డైరెక్టర్ తోసిపుచ్చారు. దీంతో పలు విద్యార్థి సంఘాల నేతలు కోర్టును ఆశ్రయించే ఆలోచన చేస్తున్నారు.

08/11/2018 - 00:29

హైదరాబాద్, ఆగస్టు 10: పంద్రాగస్టు నుంచి ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక రైతు బీమా పథకాన్ని పకడ్బందిగా అమలు చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ప్రపంచంలోనే అతి పెద్ద జీవిత బీమా పథకంగా ప్రారంభం కానున్న రైతు బీమా పథకం తెలంగాణ రైతు కుటుంబాలకు ప్రభుత్వం అందించే ఒక భరోసా అని సీఎం అన్నారు.

08/11/2018 - 01:10

తిరుపతి, ఆగస్టు 10: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహోసంప్రోక్షణకు శనివారం నుంచి శ్రీకారం చుట్టనున్నారు. ఆరు రోజులపాటు నిర్వహించనున్న ఈ మహా కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఆలయంలో నిర్వహించే అన్ని రకాల ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. ఈ ఆరు రోజుల పాటు సమయాన్ని బట్టి రోజుకొక విధంగా పరిమిత సంఖ్యలో భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించనున్నారు.

08/11/2018 - 00:39

విశాఖపట్నం: నవ్యాంధ్రకు రానున్న ఐటీ కంపెనీలన్నీ విశాఖ వైపు చూస్తున్నాయని, రాష్ట్రానికి వచ్చే ప్రాజెక్టుల్లో 60 శాతం విశాఖలోనే ఏర్పాటు కానున్నాయని పంచాయతీరాజ్, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. రెండు రోజుల విశాఖ పర్యటనలో భాగంగా శుక్రవారం నాడిక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐటీ పరిశ్రమకు విశాఖ చిరునామాగా ఎదుగుతోందన్నారు.

08/11/2018 - 00:37

నరసాపురం: రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే సామాన్యుడి ప్రభుత్వం ఏర్పడినట్టేనని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. యువతకు దిశానిర్దేశం చేయడానికి, ఆడపడుచులకు అండగా నిలబడటానికి, కులమత భేదం లేకుండా ప్రజలందరికీ సమన్యాయం చేయడానికి జనసేన పాటుపడుతుందన్నారు. ప్రజా పోరాట యాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

Pages