S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

08/11/2018 - 00:01

విజయవాడ, ఆగస్టు 10: ప్రాణం ఉన్నంత వరకూ ముస్లింలకు అండగా ఉంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ముస్లింలకు మంత్రి పదవి ఇచ్చే అంశంపై కసరత్తు చేస్తున్నానని, విజయవాడ, కడపల్లో హజ్ హౌస్‌లను నిర్మిస్తున్నామన్నారు. ముస్లింల అభ్యున్నతికి 1100 కోట్ల రూపాయలు బడ్జెట్‌లో కేటాయించామని తెలిపారు.

08/11/2018 - 01:44

బీబీనగర్, ఆగస్ట్ 10: తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న టీఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు కుటుంభానికి పరిమితమయ్యాయని భారతీయ జనతాపార్టీకి టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు ప్రత్యామ్నాయం కాదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా రంగాపురం గ్రామంలోగల ప్రతిపాదిత ఎయిమ్స్ స్థలాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్ రావుతో కలిసి పరిశీలించారు.

08/11/2018 - 01:45

నల్లగొండ, ఆగస్టు 10: రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని బీజేపీ శాసన సభ పక్ష నేత, నల్లగొండ పార్లమెంట్ పార్టీ ఇంచార్జి జీ కిషన్‌రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్‌కు బీజేపీ ఎంత దూరమో టిఆర్‌ఎస్‌కు కూడా అంతే దూరంగా ఉంటామన్నారు.

08/10/2018 - 16:47

అమరావతి: ముస్లిం మైనార్టీల ఉన్నత చదువులకు ప్రభుత్వం సాయం చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తొలి విడతిగా హాజ్ యాత్రకు వెళుతున్న ముస్లింలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వక్ఫ్‌బోర్డు ఆస్తులను కాపాడే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు.

08/10/2018 - 16:46

విజయవాడ: దుర్గగుడి ఈఓ పద్మపై బదిలీ వేటు పడింది. గుడిలో భక్తులు సమర్పించిన చీర మాయమైన ఘటనలో ఆమెపై ఈ బదిలీ వేటు పడింది. నూతన ఇఓగా ఐఆర్‌ఎస్ అధికారిణి కోటేశ్వరమ్మ బాధ్యతలు చేపట్టారు.

08/10/2018 - 12:31

విజయవాడ: విజయవాడలో నిన్నటి నుంచి ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై నీరు నిలిచిపోవటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నేడు, రేపు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ వర్షాలకు రైతులు హార్షం వ్యక్తంచేస్తున్నారు.

08/10/2018 - 02:55

హైదరాబాద్: ఎన్ని కష్టాలు ఎదురైనా, కుటుంబ సభ్యుల ఒత్తిడిని కూడా అధిగమించి చదువును కొనసాగించాలని విద్యార్థులకు రాష్ట్ర ప్రథమ మహిళ, లేడీ గవర్నర్ విమలా నరసింహాన్ సూచించారు. గురువారం రాజ్‌భవన్‌లో లేడీ గవర్నర్, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విద్యార్థులకు హెల్త్ అండ్ హైజీన్ కిట్లను పంపిణీ చేశారు.

08/10/2018 - 02:46

హైదరాబాద్, ఆగస్టు 9: తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కోలో ఖాళీగా ఉన్న 106 జూనియర్ పర్స్‌నల్ ఆఫీసర్లు ఉద్యోగాలను భర్తీ చేయడానికి సంబంధిత విద్యుత్ సంస్థ గురువారం నోటిపికేషన్ ప్రకటించింది. నిరుద్యోగులు తమ బయోడేటాతో ఈనెల 11వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. బిసీ, ఎస్టీ,ఎస్సీ వర్గాలకు వయస్సులో 10 సంవత్సరాలు మినహాయింపును పాటిస్తుందని వెల్లడించింది.

08/10/2018 - 01:09

సంగారెడ్డి, ఆగస్టు 9: ఎండా కాలాన్ని తలపించే విధంగా వానా కాలం గడచిపోతుండటంతో పంటలన్ని ఎండిపోయి కరువు మేఘాలు కమ్ముకొస్తున్నాయి. తొలకరిలో కురిసిన కాస్తన్ని వర్షాలకు ఉప్పొంగిన రైతులు ఖరీఫ్ పనులను సకాలంలో ప్రారంభించారు. ఆరుతడి పంటలు, చిరుధాన్యాలను సాగు చేసిన రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. మొలచిన మొలకలన్ని కల్ల ముందే ఎండిపోతుండటంతో అన్నదాతలు నిస్సహాయులుగా చూస్తున్నారు.

08/10/2018 - 04:41

విజయవాడ: తెలుగు రుచులను మరింత ప్రాచుర్యంలోకి తీసుకువచ్చే క్రమంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ పలు కార్యక్రమాలను చేపడుతోందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా తెలిపారు. వంటలపోటీలు, ఆహార పండుగలు, ప్రత్యేక రికార్డుల నమోదు ఇలా ఎన్నో అంశాల్లో పర్యాటక శాఖ తనదైన శైలిలో నిరంతరం కార్యక్రమాలు చేపడుతోందన్నారు.

Pages