S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

07/25/2018 - 21:27

హైదరాబాద్, జూలై 25: రాఫెల్ ఫ్రెంచ్ యుద్ధ విమానాలను ఖరీదు చేయడంలో భారీ కుంభకోణం జరిగిందని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ ఆర్‌సి కుంతియా, టీ.పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. యుద్ధ విమానాల పరికరాల ధరలు తెలపడం వల్ల దేశ భద్రతకు ఎటువంటి ముప్పు ఉండదని వారు బుధవారం విలేఖరుల సమావేశంలో అన్నారు.

07/25/2018 - 21:26

హైదరాబాద్, జూలై 25: రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలు నిర్వహించలేమంటూ యాజమాన్యాలు చేతులెత్తేస్తున్నాయి. ఇంత కాలం అడ్మిషన్లను చూపించి కాలం గడిపిన కాలేజీల యాజమాన్యాలు ఈసారి అది కూడా దక్కక పోవడంతో లబోదిబోమంటున్నాయి. ఈ ఏడాది ఐదు కాలేజీల్లో కనీసం ఒక్కరు కూడా చేరలేదు. దాంతో కాలేజీ నిర్వహణ తమ వల్ల కాదని, ఉన్న విద్యార్థులను వేరే కాలేజీల్లో సర్దుబాటు చేయాలని వారు కోరుతున్నారు.

07/25/2018 - 14:10

హైదరాబాద్: తెలంగాణ పురపాలక శాఖ వార్షిక ప్రణాళికను మంత్రి కేటీఆర్‌ విడుదల చేశారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. పురపాలక శాఖకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఈ శాఖలో 15 మంది ఐఏఎస్‌ అధికారులు ఉన్నారని తెలిపారు.

07/25/2018 - 13:04

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై శాకంబరీ ఉత్సవాలు జరుగుతున్నాయి. కనకదుర్గ అమ్మవారిని, ఆలయాన్ని కూరగాయలతో అలంకరించారు. ఈ ఉత్సవాల సందర్భంగా 40 టన్నుల వరకు కూరగాయలు రావచ్చని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. వివిధ రకాల కూరగాయలతో అలంకరించిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు.

07/25/2018 - 12:54

హైదరాబాద్: సచివాలయం ముట్టడికి విద్యార్థులు యత్నించారు. ఎస్సీ,ఎస్టీ, బీసీ విద్యార్థులకు వసతి గృహాలు నిర్మించాలని కోరుతూ తెలంగాణ సోషలిస్టు స్టూడెంట్సు అసోసియేషన్ ఈ ఆందోళనకు పిలుపునిచ్చింది. విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పించి స్కాలర్‌షిప్‌లు, ఫీజురియంబర్స్‌మెంట్ సౌకర్యం కల్పించాలని విదార్థి సంఘ నాయకులు డిమాండ్ చేశారు.

07/25/2018 - 12:51

కర్నూలు: శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 860 అడుగులుగా కొనసాగుతుంది. ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 2,30,392 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది.

07/25/2018 - 02:10

విశాఖ (జగదాంబ), జూలై 24: ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో విశాఖలోని కేజీహెచ్ ఆసుపత్రిలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న కొఠారి ఈశ్వరావు ఇంట్లో మంగళవారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. దీనికి సంబంధించి విశాఖ ఏసీబీ డీఎస్పీ రామకృష్ణప్రసాద్ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.

07/25/2018 - 02:03

రాజమహేంద్రవరం, జూలై 24: గోదావరి నదిలో వరద ప్రవాహ ఉద్ధృతి క్రమేపీ తగ్గుముఖం పడుతోంది. మంగళవారం ఉదయం ధవళేశ్వరం సర్ ఆర్ధర్ కాటన్ బ్యారేజి నుంచి 3 లక్షల 52 వేల క్యూసెక్కుల వరద జలాలను సముద్రంలోకి విడిచిపెడితే, సాయంత్రానికి 3 లక్షల 20 వేల 46 క్యూసెక్కులకు తగ్గింది. వరద ఉద్ధృతి తగ్గుతుండటంతో బ్యారేజి గేట్లను క్రమేణా కిందికి దించుతున్నారు.

07/25/2018 - 02:02

అనంతపురం, జూలై 24: ఒకటి కాదు... రెండు కాదు.. ఏకంగా రూ. 20 కోట్లు.. కళ్లు బైర్లుకమ్మేలా, మైండ్ బ్లాక్ అయ్యే రీతిలో అక్రమాస్తులు కూడబెట్టిన రవాణాశాఖ కానిస్టేబుల్ నల్లపురెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డిని ఏసీబీ అధికారులు మంగళవారం అరెస్టు చేశారు.

07/25/2018 - 05:44

అమరావతి, జూలై 24: కేంద్రంలో మెజారిటీ ఉందని రాష్టమ్రంటే బీజేపీకి ఇంత లెక్కలేనితనం పనికి రాదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల మనోభావాలతో ఆడుకోవటం తగదని పేర్కొన్న ఆయన విభజనకు ముందు..తరువాత ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేస్తారా..అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Pages