S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

07/26/2018 - 05:08

అమరావతి, జూలై 25: ‘విభజన అంశాల అమలుపై రాజ్యసభ సాక్షిగా బీజేపీ నేతలు పచ్చి అబద్ధాలు చెప్తున్నారు.. ఆర్థిక సంఘం హోదా ఇవ్వొద్దని చెప్పిందని వక్రీకరిస్తున్నారు, అహాన్ని ప్రదర్శిస్తూ మాట్లాడుతున్నారు వీటన్నింటిపై సభా హక్కుల తీర్మానం ప్రవేశపెట్టే (ప్రివిలేజ్ మోషన్) అంశాన్ని పరిశీలించండి’ అని టీడీపీ ఎంపీలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్దేశించారు.

07/26/2018 - 05:12

కాళ్ల, జూలై 25: రాజకీయాల్లో విలువలను నెలకొల్పడానికే తాను ఈ రంగంలోకి వచ్చానని, సమాజానికి సైనికుల మాదిరిగా రక్షణ కల్పించేదిగా ఉండాలనే తాను స్థాపించిన పార్టీకి ‘జనసేన’ అని పేరు పెట్టానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. సమాజంలో మార్పు తీసుకువస్తాననే భయంతోనే వైసీపీ, టీడీపీ, బీజేపీ ఇలా ఇంతమంది కలిసి తనపై నోరు పారేసుకుంటున్నారన్నారు.

07/26/2018 - 01:33

విశాఖపట్నం, జూలై 25: మూడు దశాబ్దాల విశాఖ ప్రజల కల నెరవేరబోతోంది. విశాఖ ప్రజల సెంటిమెంట్‌గా భావిస్తున్న రైల్వే జోన్ విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేయడానికి కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. ఇక జోన్ ఇచ్చే తేదీని ప్రకటించడమే తరువాయి. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో కానీ, సమావేశాలు ముగిసిన వెంటనే కానీ జోన్‌పై కేంద్రం ప్రకటన చేయబోతోంది.

07/26/2018 - 05:14

కడప, జూలై 25: కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఊమెన్ చాందీ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య తేడాను ప్రజలు క్రమం గా గుర్తిస్తున్నారని ఆయన అన్నారు.

07/26/2018 - 05:16

హైదరాబాద్, జూలై 25: తెలంగాణలో ఖాయిలా పడిన పరిశ్రమ మరొకటి పునరుద్ధరణకు సిద్ధమవుతోంది. ఖాయిలా పడిన పరిశ్రమలను పునరుద్ధరించి అక్కడి కార్మికులను ఆదుకోవాలన్న తెలంగాణ ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా బల్లార్‌పూర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (బిల్ట్) కంపెనీ ప్రతినిధులతో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, పరిశ్రమల మంత్రి కే. తారకరామారావు సమావేశమయ్యారు.

07/26/2018 - 05:22

తిరుపతి, జూలై 25: చంద్రగ్రహణం కారణంగా ఈనెల 27న తిరుమల శ్రీవారి ఆలయం మూసివేస్తారు. ఆరోజు సాయంత్రం 5 నుంచి మరుసటిరోజు తెల్లవారుజామున 4.15 గంటల వరకు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం మూసివేయనున్నారు. 28న సంప్రోక్షణ అనంతరం శనివారం ఉదయం 7 గంటలకు భక్తులను సర్వదర్శనానికి అనుమతించనున్నారు. 27న శుక్రవారం రాత్రి 11.54 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై 28న శనివారం ఉదయం 3.49 గంటలకు పూర్తవుతుంది.

07/26/2018 - 01:18

హైదరాబాద్, జూలై 25: ప్రణాళికాబద్ధం గా పట్టణీకరణ జరగాల్సిన అవసరం ఉందని, లేకపోతే కపోతే భవిష్యత్ శాపంగా మారుతుందని మున్సిపల్‌శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అభిప్రాయపడ్డారు. మున్సిపాల్టీల్లో ఎంత బాగా పని చేసినా ప్రజల నుంచి మెప్పు ఉండదని అన్నారు. మున్సిపల్‌శాఖ భిన్నమైందని, ప్రజల నుంచి ప్రధాన మంత్రి వరకు సంబంధం ఉండే ఏకైక శాఖ ఇదేనన్నారు.

07/26/2018 - 05:18

హైదరాబాద్, జూలై 25: కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటున్నది. అందులో భాగంగానే తమ పార్టీ ప్రాతినిథ్యం వహించని నియోజకవర్గాలపై దృష్టి సారిస్తున్నది. కాంగ్రేసేతర నియోజకవర్గాల రాజకీయ పరిస్థితులు ఏమిటీ?, అక్కడి ఇతర పార్టీల సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజాభిప్రాయం ఎలా ఉంది?, ఆయా నియోజకవర్గాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఎలా సాగుతున్నాయి?, పార్టీ బలం, బలహీనతలు ఏమిటీ?

07/26/2018 - 05:26

హైదరాబాద్, జూలై 25: హరితహారం నాలుగో విడత కార్యక్రమాన్ని ఆగస్టు ఒకటిన లాంఛనంగా ప్రారంభించే గజ్వేల్ పట్టణంలో లక్షా 116 మొక్కలు నాటాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. వీటికి అదనంగా అదేరోజు అటవీ భూముల్లో మరో 20 వేల మొక్కలు నాటాలని ఆదేశించారు.

07/25/2018 - 21:28

హైదరాబాద్, జూలై 25: పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం (స్టేట్ ఎలక్షన్ కమిషన్-ఎస్‌ఈసీ) ఏడాది నుండి చేసిన కృషి వృథాప్రయాసగా మిగిలింది. గ్రామ పంచాయతీ పాలక మండళ్లకు రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల చివరి వరకు ఎన్నికల ప్రహసనం పూర్తి కావలసి ఉండేది.

Pages