S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

07/25/2018 - 05:46

విజయవాడ, జూలై 24: ప్రత్యేక హోదా..విభజన హామీల అమలుకై ప్రతిపక్ష వైకాపా ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం బంద్ పాక్షికంగానే జరిగింది. వాణిజ్య వర్గాల నుంచి పెద్దగా స్పందన లభించలేదు. ముందు జాగ్రత్త చర్యగా విద్యా సంస్థల యజమాన్యాలు ముందుగానే సెలవులు ప్రకటించాయి. ప్రధానంగా బంద్‌ను విజయవంతం చేయాలనే పట్టుదల ఆ పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఎక్కడ కన్పించలేదు.

07/25/2018 - 05:48

కర్నూలు, జూలై 24: రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ తప్పిదం లేకపోయినా ప్రజలకు అబద్ధాలు చెప్పి ఓడించారని, అయితే ఆ ప్రజలే మళ్లీ వాస్తవాలు తెలుసుకుని తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఊమెన్ చాందీ అన్నారు.

07/25/2018 - 01:33

సామర్లకోట, జూలై 24: రాష్ట్రానికి ప్రత్యేక హోదా జీవన్మరణ సమస్య అని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కుట్రలు పన్నినా ప్రత్యేక హోదా కోసం పోరాటం కొనసాగిస్తామని వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి స్పష్టంచేశారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు డిమాండుతో తమ పార్టీ ఇచ్చిన రాష్ట్ర బంద్‌కు సహకరించాల్సింది పోయి ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసులతో అణిచివేతకు పాల్పడ్డారని ఆరోపించారు.

07/25/2018 - 05:53

హైదరాబాద్, జూలై 24: పదవీకాలం ముగుస్తున్న సర్పంచ్‌ల స్థానంలో పర్సన్ ఇంచార్జులుగా అధికారులను నియమించడం తప్ప ప్రభుత్వానికి మరో మార్గం లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని అధికారుల బృందం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న సర్పంచ్‌లనే పర్సన్ ఇంచార్జీలుగా నియమించడం చట్ట ప్రకారం సాధ్యం కాదని, న్యాయస్థానాలు కూడా అంగీకరించవని వారు చెబుతున్నారు.

07/25/2018 - 05:50

హైదరాబాద్, జూలై 24: ఆదాయపన్ను సక్రమంగా చెల్లించి దేశాభివృద్థిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని గవర్నర్ నరసింహన్ పిలుపు నిచ్చారు. మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన 158వ ఇన్‌కం టాక్స్‌డే వేడుకలకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. దేశంలోని వనరులను వాడుకుంటూ వాటి ద్వారా ఆదాయం పొందుతున్న వారందరూ పన్ను చెల్లించడం తప్పని సరి అని స్పష్టం చేశారు.

07/25/2018 - 06:00

హైదరాబాద్, జూలై 24: నగర నడిబొడ్డున ఉన్న విద్యుత్ సౌధ దద్దరిల్లింది. సమస్యల పరిష్కారం కోరుతూ విద్యుత్ ఒప్పంద కార్మికులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మంగళవారం విద్యుత్ సౌధ ముట్టడి కార్యక్రమం రణరంగంగా మారింది. వందలాది మంది కార్మికులు తరలిరావడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు విశ్వప్రయత్నం చేశారు.

07/25/2018 - 01:14

హైదరాబాద్, జూలై 24: రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అమలులోకి తీసుకురానున్న రైతు బీమా పథకం పట్ల రైతన్నలు అంతగా ఆసక్తికనబర్చడం లేదు. రాష్టవ్య్రాప్తంగా 48 లక్షల మంది రైతులు రైతుబంధు చెక్కులు అందుకున్నారు. రైతులందరినీ పథకం పరిధిలోకి తీసుకువచ్చి ఆగస్టు 15న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా బీమా పత్రాలు అందజేయాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు రైతు బీమా పథకం కింద 26.38 లక్షల మంది రైతులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు.

07/24/2018 - 22:25

హైదరాబాద్, జూలై 24: పదవీకాలం ముగుస్తున్న సర్పంచ్‌ల స్థానంలో పర్సన్ ఇంచార్జులుగా అధికారులను నియమించడం తప్ప ప్రభుత్వానికి మరో మార్గం లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని అధికారుల బృందం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న సర్పంచ్‌లనే పర్సన్ ఇంచార్జీలుగా నియమించడం చట్ట ప్రకారం సాధ్యం కాదని, న్యాయస్థానాలు కూడా అంగీకరించవని వారు చెబుతున్నారు.

07/24/2018 - 22:23

హైదరాబాద్, జూలై 24: పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కాచిగూడ-కృష్టరాజాపురంల మధ్య 26 ప్రత్యేక రైళ్లను నడిపాలని దక్షణ మధ్య రైల్వే నిర్ణయించింది. 07603/07604 నెంబర్ గల ట్రైన్లు ఈ రెండు స్టేషన్ల మధ్య రాకపోకలు సాగించనున్నాయి. ఆగస్టు 5 నుంచి అక్టోబర్ 28 వరకు ప్రతి ఆదివారం కాచిగూడలో సాయంత్రం 6గంటలకు బయలు దేరి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు బెంగళూరుకు సమీపంలోని కృష్ణరాజాపురంకు చేరుకుంటోంది.

07/24/2018 - 22:22

హైదరాబాద్, జూలై 24:తక్కువ సొమ్ముతో ఎక్కవ ఆదాయంతో పాటు వినూత్న బహుమతులు పొందవచ్చునని నమ్మచెబుతూ సామాన్యులను మోసం చేస్తున్న ఇద్దరు వ్యక్తులను టాస్కుపోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలోలకి వెళితే హైదరాబాద్‌లో టపచ్ఛబుట్రా ఎరియాలో ఇద్దరు వ్యక్తులు అరామ్ ఎంటర్‌ప్రైజస్ పేరుతో లాటరీ స్కీమ్‌తో పాటు న్యూ యువర్ నీడ్స్ ఎంటర్‌ప్రైజస్‌లను ప్రారంభించారు.

Pages