S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

07/04/2018 - 18:01

తెర్లాం విజయనగరం: మండలంలోని వెలగవలస గ్రామంలో రైతులు ఉద్యానవన పంటలు వేసేందుకు గోతులు తవ్వతుండగా.. తాటిచెట్ల వద్ద ఉన్న ఎనిమిది అడుగుల కొండచిలువ కనిపించింది. రైతులు వెంటనే కర్రలతో కొండ చిలువను కొట్టి చంపేశారు.

07/04/2018 - 14:03

వరంగల్: వరంగల్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో పదిమంది మృతిచెందినట్లు, పలువురు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. కోటిలింగాల వద్ద ఉన్న బాణాసంచా కేంద్రంలో ఈ ప్రమాదం సంభవించినట్లు, అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఒక్కసారిగా భారీ శబ్దాలతో మంటలు చెలరేగటంతో స్థానికలు భయాందోళనచెందారు.

07/04/2018 - 13:10

విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల అమలాపురంలో వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 17 సెంమీ వర్షపాతం నమోదైంది. ఇదిలా ఉండగా నైరుతి రుతుపవన ప్రభావంతో బుధవారం రాయలసీమ అంతటా ఈదురుగాలులు, ఉరుములతో వర్షాలు కురవచ్చని, 6,7 తేదీల్లో కోస్తాంధ్ర జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.

07/04/2018 - 13:08

విశాఖపట్నం: విశాఖ రైల్వేజోన్ సాధన కోసం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరశన దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ వచ్చేవరకు తమ పోరాటం ఆగదని ఈ సందర్భంగా మంత్రి అయ్యన్నపాత్రుడు తెలిపారు. రైల్వేజోన్ కోసం అన్ని పార్టీలు ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు. మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా పాల్గొన్నారు.

07/04/2018 - 02:55

విజయవాడ, జూలై 3: తెలుగుజాతి గర్వించదిగిన మహోన్నత వ్యక్తి, కర్నాటక సంగీతానికి ఖ్యాతి తెచ్చిన మంగళంపల్లి బాల మురళీకృష్ణ పేరిట ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాతీయ అవార్డుకు తొలి ఏడాది ప్రముఖ వయోలిన్ విద్వాంసులు అన్నవరపు రామస్వామి ఎంపికయ్యారు.

07/04/2018 - 05:36

హైదరాబాద్, జూలై 3: కాలానుగుణంగా సేద్యంలో మార్పులు చోటు చేసుకోవాలని, వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చేందుకు అనేక వ్యూహాలను అనుసరించాల్సి ఉందని ఉప రాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. సెంట్రల్ రీసెర్చి ఇనిస్టిట్యూట్ ఫర్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్ (క్రిడా)లో శాస్తవ్రేత్తలు, వ్యవసాయ నిపుణులను ఉద్ధేశించి ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు మాట్లాడారు.

07/04/2018 - 05:35

హైదరాబాద్, జూలై 3: చదువుల తల్లి సరస్వతి... లక్ష్మీగా మారిందని రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు యూనివర్శిటీ 14వ స్నాతకోత్సవంలో పాల్గొన్న గవర్నర్ తెలుగు భాషలో ప్రసంగించారు. విద్యాసంస్థలు సేవకు బదులు వ్యాపారం చేస్తున్నాయని, డబ్బు అనేది ఒక స్థాయి వరకేనని, అది ఎక్కువైతే బీపీ, షుగర్ వస్తుందని అన్నారు. సామాజిక లక్ష్యంగా పనిచేయడం అలవాటు చేసుకోవాలని అన్నారు.

07/04/2018 - 05:39

హైదరాబాద్, జూలై 3: సమ్మె విరమిస్తున్నట్టు రేషన్ డీలర్లు ప్రకటించారు. మంగళవారం సాయంత్రం రేషన్ డీలర్లతో పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్ జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. తమ ప్రధాన డిమాండ్లను తీర్చడానికి ప్రభుత్వం అంగీకరించడంతో సమ్మె విరమిస్తున్నామని రేషన్ డీలర్ల రాష్ట్ర సంఘం అధ్యక్షుడు నాయికోటి రాజు ప్రకటించారు.

07/04/2018 - 02:35

హైదరాబాద్, జూలై 3: ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవల తెలంగాణకు ప్రత్యేకంగా నియమించిన ముగ్గురు ఎఐసిసి కార్యదర్శులు ఈ నెల 8 నుంచి పూర్తి స్థాయిలో రంగంలోకి దిగుతున్నారు. తెలంగాణ మొత్తం వారు కలియతిరుగుతూ పార్టీ పరిస్థితిని అధ్యయనం చేస్తూ, పార్టీ శ్రేణులను ఉత్సాహపరచనున్నారు.

07/04/2018 - 05:43

హైదరాబాద్, జూలై 3: హైదరాబాద్‌లో జినోమ్ వ్యాలీ అభివృద్ధికి సమీకృత మాస్టర్ ప్లాన్ సిద్ధమైంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి, సింగపూర్‌కు చెందిన సుర్బాన జురాంగ్‌కు మధ్య మంగళవారం ఒప్పందం కుదిరింది.

Pages