S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

07/04/2018 - 02:32

హైదరాబాద్, జూలై 3: ప్రాధమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా (ఎస్‌జీటీ) పనిచేయాలంటే రెండేళ్ల డిఈడీ కోర్సు పూర్తి చేసి ఉండాలని, స్కూల్ అసిస్టెంట్లుగా పనిచేయాలంటే బిఈడీ పూర్తి చేసి ఉండాలనే నిబంధనలతో వేలాది మంది ఉపాధ్యాయ రిక్రూట్‌మెంట్‌లో పాల్గొన లేకపోతున్నారు.

07/04/2018 - 02:16

తిరుపతి, జూలై 3: చంద్ర గ్రహణం సందర్భంగా ఈనెల 27వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయం 12గంటలపాటు మూతపడనుంది. ఈ సందర్భంగా ఆరోజు పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. 27వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 28వ తేదీ ఉదయం 4.15 గంటల వరకు శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తారు. 28వ తేదీ ఉదయం 4.15 గంటలకు ముందు ఆలయాన్ని శుద్ధి చేసి స్వామివారిని సుప్రభాతం నిర్వహిస్తారు.

07/04/2018 - 02:13

హైదరాబాద్, జూలై 3: గోదావరిపై నిర్మించే కొత్త ప్రాజెక్టుల సమగ్ర నివేదికలను (డిపిఆర్) సమర్పించడానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అంగీకరించాయి. గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జిఆర్‌ఎంబి) చైర్మన్ హెచ్‌కె సాహు అధ్యక్షతన మంగళవారం జలసౌధలో సమావేశమైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇరు రాష్ట్రాలకు చెందిన నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శులు హాజరైన ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకుంది.

07/04/2018 - 05:58

హైదరాబాద్, తిరుపతి, జూలై 3: శ్రీవారి నగలపై జరుగుతున్న వివాదంపై సీబీఐ చేత విచారణ జరిపించాలని గుంటూరుకి చెందిన అనిల్‌కుమార్ అనే భక్తుడు వేసిన ప్రజావాజ్యాన్ని హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈక్రమంలో మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని టీటీడీకి ఆదేశాలు జారీ చేసినట్లు ప్రచారం సాగు తోంది.

07/04/2018 - 05:52

ఏలూరు, జూలై 3: చరిత్రలో ఎంతోమంది పుట్టి అయారంగాల్లో తమ ప్రతిభను చాటుకుని వెళ్లిపోతారని, అయితే కొంతమందే యుగపురుషులుగా మిగిలిపోతారని, అలాంటివారిలో అగ్రగణ్యులుగా ప్రఖ్యాత నటుడు ఎస్వీ రంగారావు నిలుస్తారని, తెలుగుజాతి ఉన్నంతవరకు వారి గుండెల్లో నిలిచిపోతారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

07/04/2018 - 02:06

సామర్లకోట, జూలై 3: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట-కాకినాడ రోడ్డులో సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను టిప్పర్ లారీ ఢీకొన్న ఈ దుర్ఘటనలో మూడేళ్ల బాలుడు సహా ఆరుగురు దుర్మరణం చెందారు. తీవ్రంగా గాయపడ్డ మరో ఎనిమిది మంది కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

07/04/2018 - 05:54

విశాఖపట్నం, జూలై 3: విశాఖ రైల్వే జోన్‌ను రాజకీయంగానే సాధించడానికి టీడీపీ అడుగులు వేస్తోంది. కడప ఉక్కు ఫ్యాక్టరీ సాధన కోసం పది రోజులపాటు సీఎం రమేష్ దీక్ష చేయగా కేంద్రం ఇసుమంతైనా స్పందించలేదు. దీంతో ముఖ్యమంత్రి రంగంలోకి దిగి, ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై కేంద్రం రెండు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని, లేకుంటే, తామే ఫ్యాక్టరీ నిర్మాణ బాధ్యత తీసుకుంటామని చెప్పారు.

07/03/2018 - 17:45

అనకాపల్లి: మాజీ ఎమ్మెల్యే దాడి వీరభద్రరావు ఇంటికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెళ్లారు. ఆయన ఇచ్చిన విందులో పాల్గొన్నారు. అనంతరం తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా పవన్‌ను దాడి వీరభద్రరావు శాలువతో సన్మానించారు.

07/03/2018 - 17:03

కడప: నగరంలో ఓ యువతి కిడ్నాప్ అయిందనే ఉదంతం కలకలం రేపుతుంది. కిడ్నాప్ గురైన యువతి నిర్మల నర్శింగ్ కళాశాలలో ఫార్మసీ చదువుతుంది. తనను ఎవరో కిడ్నాప్ చేశారని ఆమె తన సోదరికి మెస్సెజ్ పెట్టింది. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో పోలీసులు బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు.

07/03/2018 - 13:51

ఏలూరు: ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారనాడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శతజయంతి సభల్లో పాల్గొని ఉత్సవాలను ప్రారంభించారు. తెలుగు ప్రజలు గర్వంగా చెప్పుకునే నటుల్లో ఎస్వీఆర్ ఒకరని అన్నారు. మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పేరుగడించారని అన్నారు.

Pages