S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

07/06/2018 - 02:13

హైదరాబాద్, జూలై 5: జీడిమెట్లలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ములుగులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కంద్రాల్లో పూలతోటల పెంపక, కాయగూరల మొక్కల పెంపకాల్లో చేపడుతున్న కొత్త మెళకువలను రైతులకు అందించేందుకు ఉద్యాన శాఖ సిబ్బంది శ్రద్ధగా పనిచేయాలని వ్యవసాయ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి కోరారు.

07/06/2018 - 05:46

హైదరాబాద్, జూలై 5: అక్కడ మొక్కలు పెంచడానికి మట్టి అవసరం లేదు. నేల చదరంగా ఉండాల్సిన అవస్యకత అంతకంటే లేదు. గోడలపైన కూడా మొక్కలు పెరుగుతాయి. అసాధ్యం అనిపించే ఈ అద్భుతాలన్నీ హైదరాబాద్‌లోని జీడిమెట్లలో ఉద్యాన శాఖ ఏర్పాటు చేసిన ‘సెంటర్ ఫర్ ఎక్సలెన్స్’లో మనకు సాక్షాత్కరిస్తాయి. కళ్ల ముందు సరికొత్త లోకాన్ని ఆవిష్కరిస్తాయి.

07/05/2018 - 16:24

విజయవాడ: నగరంలోని పాయకాపురం శివారులో ఓ యువతిపై నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నగరంలోని ఓ పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్న యువతిని ఆమె సహచర విద్యార్థి ఒకడు పార్టీకి అని పిలిచి కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి తాగించాడు. స్పృహ తప్పిన ఆమెను శివారు ప్రాంతానికి తీసుకువెళ్లాడు. అనంతరం స్నేహితులను పిలిపించాడు. నలుగురు యువకులు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

07/05/2018 - 16:22

హైదరాబాద్: నగరంలోని గౌలిగూడలోని సిటీ బస్‌స్టేషన్ కుప్పకూలింది. నిజాం నవాబుల కాలంలో నిర్మితమైన ఈ బస్‌స్టేషన్ శిథిలావస్థకు చేరింది. దీంతో ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా బస్ట్‌స్టేషన్‌ను ఖాళీ చేయించారు. దాదాపు 80వేల మంది ప్రయాణీకులకు సేవలు అందించే ఈ బస్‌స్టేషన్ పూర్తిగా శిథిలావస్థకు చేరటంతో పడగొట్టి పునర్నిర్మాణం చేయాలని భావించి బస్సులను, సిబ్బందిని తరలించారు. ఈ ఉదయం బస్‌స్టేషన్ కుప్పకూలింది.

07/05/2018 - 13:00

అమరావతి: ఏపీలో గురువారంనాడు మూడు లక్షల మంది లబ్దిదారులు ఒకేసారి శాస్త్రోక్తంగా గృహాప్రవేశాలు చేశారు. విజయవాడలోని మున్సిపల్ మైదానంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సామూహిక గృహప్రవేశాలను శాస్త్రోక్తంగా ప్రారంభించారు. వివిధ జిల్లాల్లో నిర్మించిన గృహాలను మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభించారు.

07/05/2018 - 13:25

నెల్లూరు: కావలిలో పర్యటనకు వచ్చిన బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు చేదు అనుభవం ఎదురైంది. కావలిలో నిర్వహించిన ర్యాలీలో ఆయనను లక్ష్యంగా చేసుకుని ఓ వ్యక్తి చెప్పు విసిరాడు. దీంతో ఆగ్రహించిన బీజేపీ కార్యకర్తలు ఆ వ్యక్తికి దేహశుద్ధి చేసి పోలీసు స్టేషన్‌లో అప్పగించారు. ఆ వ్యక్తి ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన గొర్రిపాటి మహేశ్‌గా గుర్తించారు.

07/05/2018 - 12:56

నంద్యాల: కాపురానికి రావద్దు అన్నారని నంద్యాల మండలం పాండురంగాపురం గ్రామానికి చెందిన ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలు ఇలా ఉన్నాయి. పాండురంగాపురం గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి అనే సాధారణ రైతుకు చందన అనే కుమార్తె ఉన్నది. ఎమ్మెస్సీ చదివిన చందనను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న గుంటూరు జిల్లా సంగం జాగర్లమూడి గ్రామానికి చెందిన ఉమామహేశ్వరెడ్డికి ఇచ్చి వివాహం చేశారు.

07/05/2018 - 05:17

రామచంద్రపురం, జూలై 4: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర బుధవారం తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో ఉల్లాసంగా సాగింది. కాజులూరు మండలం కుయ్యేరు నుంచి బుధవారం ఉదయం ప్రారంభమైన పాదయాత్ర కె గంగవరం మండలం బాలాంత్రం, ఎర్రపోతవరం మీదుగా రామచంద్రపురం మండలం ద్రాక్షారామ గ్రామానికి చేరుకుంది.

07/05/2018 - 04:24

విజయవాడ, జూలై 4: రాష్ట్రాన్ని వణికిస్తున్న డెంగీ వ్యాధిని తరిమికొట్టేందుకు కొత్త పద్ధతిని అమలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. వోల్బేషియా అనే బ్యాక్టీరియాను ఈడిస్ ఎజిప్టీ దోమలో ప్రవేశపెట్టడం ద్వారా డెంగీ, తదితర దోమ కారక వ్యాధులను నియంత్రించనున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన పరిశోధనా ఫలితాలను వినియోగంలోకి తీసుకురానున్నారు.

07/05/2018 - 04:23

హైదరాబాద్, జూలై 4: పథకం ప్రకారం హిందూ గ్రంథాలను, దేవీ దేవతలను అవమానపరుస్తూ, హిందువుల మనోభావాలను దెబ్బతీసే కార్యక్రమాలను రూపొందించి కొన్ని చానళ్లు ప్రసారం చేస్తున్నాయని విశ్వహిందూ పరిషత్ నేతలు డీజీపీ మహేందర్‌రెడ్డికి ఒక వినతి పత్రం అందజేశారు.

Pages