S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

07/06/2018 - 04:43

న్యూఢిల్లీ, జూలై 5: అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభిస్తామని విశ్వహిందూ పరిషత్ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ ప్రకటించారు. రామ మందిర నిర్మాణానికి న్యాయ, రాజ్యాంగ పరమైన అవరోధాలు తొలగిపోతాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు కూడా అయోధ్య రామజన్మభూమి కేసును రోజూవారీ విచారించే విధంగా చర్యలు తీసుకుంటుందనే ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు.

07/06/2018 - 05:31

విజయవాడ, జూలై 5: రాష్ట్రంలో అదనంగా మరో 5 లక్షల గృహాలను మంజూరు చేసి, పేదవాళ్లకు ఇళ్లు కట్టిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. 2022 సంవత్సరానికి ముందే పేదవాడి సొంత ఇంటి కలను సాకారం చేస్తామని స్పష్టంచేశారు. కుటుంబ పెద్దగా ఆడబిడ్డలకు పసుపుకుంకుమ కానుక కింద ఈ ఇళ్లను ఇస్తున్నట్లు తెలిపారు.

07/06/2018 - 05:35

విజయవాడ, జూలై 5: కేంద్రం సహకరించినా, సహకరించకపోయినా, అభివృద్ధి మాత్రం ఆగదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ‘ప్రజలు కట్టే పన్నులతో కేంద్రం బతుకుతోంది. రాష్ట్రంపై పెత్తనం మాత్రం చేస్తారని, కానీ ఆదుకునేందుకు ముందుకురారు’అంటూ సీఎం నిప్పులు చెరిగారు. విజయవాడలో 3 లక్షల గృహ ప్రవేశాల మహోత్సవంలో బుధవారం సీఎం మాట్లాడుతూ కేంద్రం తీరును ఎండగట్టారు.

07/06/2018 - 05:33

విశాఖపట్నం, జూలై 5: ‘గత ఎన్నికల్లో మీకు మద్దతు ఇచ్చి, మీ పక్కన ఉన్నప్పుడు నా కులం కనిపించలేదా? మీతో విభేదించి, పార్టీ పెడితే దానికి కులాన్ని అంటకడతారా?’ అంటూ సీఎం చంద్రబాబుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగారు. విశాఖ నగరంలో వివిధ వర్గాలకు చెందిన వారు గురువారం జనసేన పార్టీలో చేరారు.

07/06/2018 - 02:41

రాజమహేంద్రవరం, జూలై 5: లోక్‌సభలో తలుపులు మూసేసి ఏపీకి అన్యాయం చేశారని లోక్‌సభలో ప్రధాని మోదీ చేసిన ప్రసంగంపై చర్చకు అనుమతించాలని కోరుతూ పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో తెలుగుదేశం ఎంపీలు నోటీసు ఇవ్వాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ సూచించారు. ఇందుకు వీలుగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి, టీడీపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు.

07/06/2018 - 02:39

కర్నూలు, జూలై 5: రాష్ట్రానికి న్యాయం చేయడంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుతో అసంతృప్తితో ఉన్న ప్రజలను తిరిగి తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ పెద్దలు వ్యూహాత్మక రీతిలో ముందుకెళుతున్నారు. రాష్ట్రంలో పార్టీ తిరిగి అధికారంలోకి రావడం 2024లోనే సాధ్యమని అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగానే ‘ఆపరేషన్ 2024’ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

07/06/2018 - 05:41

హైదరాబాద్, జూలై 5: సుమారు ఎనిమిది దశాబ్దాలు హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు విశిష్ట సేవలు అందించిన అద్భుత నిర్మాణం సెంట్రల్ బస్ స్టేషన్ చరిత్ర ఇకపై కనుమరుగు కానుంది. సీబీఎస్‌గా అందరికీ చిరపరచితమైన ఈ అద్భుత నిర్మాణం గౌలిగూడ బస్ స్టేషన్ భారీ షెడ్డు గురువారం తెల్లవారు జామున కుప్పకూలింది.

07/06/2018 - 02:20

హైదరాబాద్, జూలై 5: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజనలో పెండింగ్ అంశాలపై విభజన కమిటీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇరు రాష్ట్రాల మధ్య ఉపాధ్యాయుల బదిలీలకు మార్గదర్శకాలను కమిటీ ఖరారు చేసింది. స్థానికతతో ప్రమేయం లేకుండా బదిలీలు కోరుకునే ఉపాధ్యాయులు, అధ్యాపకులకు కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

07/06/2018 - 02:19

కేంద్రానికి నోటీసులు...

07/06/2018 - 05:43

మహబూబ్‌నగర్, జూలై 5: తనను అంతమొందించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కుట్రలు చేస్తున్నారని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి తీవ్రంగా ఆరోపించారు.

Pages