S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

07/03/2018 - 02:05

హైదరాబాద్, జూలై 2: తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా 11 మంది ఐఏఎస్ అధికారులను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. 2017 ఐఏఎస్ బ్యాచ్ అధికారులకు ఈ పోస్టింగ్స్ ఇచ్చారు. అవిశ్యంత్ పండాను సిద్ధిపేట అసిస్టెంట్ కలెక్టర్‌గా, ఐలా త్రిపాఠిని భద్రాద్రి అసిస్టెంట్ కలెక్టర్‌గా, మనుచౌదరిని వరంగల్ రూరల్ అసిస్టెంట్ కలెక్టర్‌గా నియమించారు.

07/03/2018 - 02:04

హైదరాబాద్, జూలై 2: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 73వ రాజ్యాంగ సవరణ గండిపడే ప్రమాదం కనిపిస్తున్నది. ఆ సవరణ ప్రకారం ప్రతి ఐదేళ్లకు ఒకసారి పంచాయతీ ఎన్నికలు తప్పనిసరిగా జరిగి తీరాలి. అయితే, ప్రస్తుతం హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నందువల్ల, సకాలంలో ఎన్నికల ప్రక్రియ పూర్తయే దాఖలాలు కనిపించడం లేదు.

07/03/2018 - 05:59

సిరిసిల్ల, జూలై 2: పాడి పంటలు బాగుంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని నమ్మి ద్విముఖ వ్యూహంతో ముందుకు సాగుతున్న ప్రభుత్వం తమదని రాష్ట్ర ఐటీ, పురపాలక పట్టణాభవృద్ధి శాఖ మంత్రి కే.తారకరామారావు అన్నారు. ముఖ్యమంత్రి దూర దృష్టితో చేపట్టిన పథకాలతో తెలంగాణ నవ హరిత, నీలి, శే్వత, గులాబీ విప్లవాలకు కేంద్ర బిందువుగా మారనుందని తెలిపారు.

07/03/2018 - 05:57

విజయవాడ, జూలై 2: పోలీసులతో సమానంగా స్ఫూర్తిమంతంగా, క్రమశిక్షణగా సేవలు అందించటంలో హోంగార్డులు ఏమాత్రం తీసిపోరని, ప్రజలకు సేవలు అందించటంలో వీరి పాత్ర నిరుపమానమైనదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కితాబిచ్చారు. సోమవారం జరిగిన హోంగార్డుల ఆత్మీయ అభినందన సభలో ముఖ్యమంత్రి వారికి వరాలు ప్రకటించారు. హోంగార్డుల ఉత్సాహం చూస్తుంటే వారికి చాలా చేయాలనే ఉందని, కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించటం లేదన్నారు.

07/03/2018 - 06:01

భీమవరం, జూలై 2: కేబుల్, నెట్ ఆపరేటర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆయా ఆపరేటర్లు తమ తమ కేబుల్స్‌ను కట్టుకోవడానికి ఇప్పటివరకు విద్యుత్ స్తంభాలను ఉచితంగా ఉపయోగించుకుంటున్నారు. అయితే ఇకపై ఆయా స్తంభాలకు నెలకు కొంత మొత్తాన్ని ఆయా విద్యుత్ సంస్థలకు ఆపరేటర్లు చెల్లించాల్సివుంటుంది. పట్టణాల్లో ఒక్కో స్తంభానికి రూ.50, గ్రామాల్లో రూ.35 వంతున చెల్లించాలి.

07/03/2018 - 06:08

శృంగవరపుకోట, కొత్తవలస, జూలై 2: ఏపీ అభివృద్ధికి ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థ అవసరమని, అది జనసేనతోనే సాధ్య పడుతుందని ఆపార్టీ అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. సోమవారం విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో జరిగిన ప్రజాపోరాట యాత్రలో మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయిన తరువాత ప్రత్యేహోదాకు పోరాడదామని ముఖ్యమంత్రికి చెప్పినా వినలేదన్నారు. టీడీపీ నాయకులు ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టారని ఆయన మండిపడ్డారు.

07/03/2018 - 01:39

హైదరాబాద్, జూలై 2: హైదరాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా టిబిఎన్ రాధాకృష్ణన్ నియమితులయ్యారు. ప్రస్తుతం రాధాకృష్ణన్ చత్తీస్‌గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు. ఆయన జూలై 16లోగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. హైదరాబాద్ హైకోర్టు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సేవలు అందిస్తోంది. జస్టిస్ రాధాకృష్ణన్ కేరళలోని తిరువనంతపురంలో జన్మించారు.

07/03/2018 - 06:11

విశాఖపట్నం, జూలై 2: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) 2018 ఫలితాలను మానవ వనరులు శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సోమవారం విడుదల చేశారు. టెట్ 2018లో 2,13,042 మంది (57.48శాతం) మంది అర్హత సాధించారు. టెట్ 2018కి 3,97,957 మంది దరఖాస్తు చేసుకోగా, 3,70,573 మంది (93.11 శాతం) హాజరయ్యారన్నారు. అంతకు ముందు 2017లో నిర్వహించిన టెట్‌లో ఉత్తీర్ణత శాతం కేవలం 46.85 శాతం మాత్రమేనన్నారు.

07/02/2018 - 17:15

హైదరాబాద్:తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీల పక్రియ నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రభుత్వం బదిలీల షెడ్యూల్‌ను ప్రకటించిన తరువాత వివిధ అంశాలపై ఉపాధ్యాయులు హైకోర్టును ఆశ్రయించారు. పాత జిల్లాల డీఈఓలకు బదిలీ ఉత్తర్వులను జారీ చేసే అధికారం ఇవ్వటాన్ని హైకోర్టు తప్పపట్టింది. ధర్మాసనం తీర్పుతో బదిలీలకు మార్గం సుగమమైంది.

07/02/2018 - 13:36

అనంతపురం: పెద్ద నోట్ల రద్దుతో ఆర్థికవ్యవస్థ చిన్నాభిన్నం అయిందని సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన జిల్లాలో పర్యటించారు. ఈసందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..మోదీ పరిపాలనుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తామని వెల్లడించారు.

Pages