S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

07/02/2018 - 13:35

విశాఖపట్నం: ఏపీలో నిర్వహించిన టెట్ పరీక్షా ఫలితాలను సోమవారంనాడు మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో విడుదల చేశారు. మొత్తం 57.48 శాతం మంది అర్హత సాధించినట్లు వెల్లడించారు. ఈ పరీక్షకు 3,97,957 మంది దరఖాస్తుచేసుకోగా..3,70,573 మంది హాజరయ్యారని తెలిపారు. ఈ పరీక్షలో 2,13,042 మంది ఉతీర్ణత సాధించారని పేర్కొన్నారు.

07/02/2018 - 12:04

కంచికచర్ల: కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం గొట్టెముక్కల గ్రామానికి చెందిన గోగినేని నాగార్జున అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అమెరికాలో ప్రమాదవశాత్తు మృతి చెందారు. విహారయాత్రలో భాగంగా నార్త్ కరోలినా ప్రాంతంలోని ఓ జలపాతంలో ప్రమాదవశాత్తూ పడి మృతిచెందారు. ఈ విషయాన్ని నాగార్జున మిత్రులు, అతని కుటుంబ సభ్యులకు తెలియజేశారు.

07/02/2018 - 06:28

విశాఖపట్నం, జూలై 1: రాష్టస్థ్రాయి అర్హత పరీక్ష ఏపీ సెట్ పరీక్ష ప్రశాంత వాతావరణంలో ఆదివారం జరిగింది. ఆంధ్రా యూనివర్శిటీ ఆధ్వర్యంలో జరిగే అర్హత పరీక్షకు వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ జి.నాగేశ్వరరావు పరీక్షకు ఎఫ్ సెట్‌ను ఎంపిక చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆరు ప్రాంతీయ సెంటర్లలోని 67 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు.

07/02/2018 - 05:34

గుంటూరు, జూలై 1: ఉద్యోగులు కంట్రీబ్యూటరీ పెన్షన్ విధానం (సీపీఎస్) రద్దుకోసం రెండేళ్లుగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దీనిపై స్పష్టమైన ప్రకటన చేయాలని ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు డిమాండ్ చేశారు. సీపీఎస్‌ను రద్దుచేయాలని కోరుతూ ఆదివారం గుంటూరులో ఉద్యోగులు ఆత్మగౌరవ సభ నిర్వహించారు.

07/02/2018 - 02:43

హైదరాబాద్, జూలై 1: మనకు అందుబాటులో ఉండే వేపాకుల మిశ్రమం నుంచి కేన్సర్‌ను దూరం చేసే మందును హైదరాబాద్‌కు చెందిన శాస్తవ్రేత్తలు కనుగొన్నారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి (ఎన్‌ఐపిఇఆర్) శాస్రవేత్తలు ఈ ఘనతను సాధించారు.

07/02/2018 - 02:28

విజయవాడ, జూలై 1: పట్టుదలతో పోరాడి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిద్దామని హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ పిలుపిచ్చారు. సత్సంకల్పం, దీక్ష, పట్టుదల ఉంటే కేన్సర్‌ను జయించవచ్చని అన్నారు.

07/02/2018 - 02:25

ముమ్మిడివరం, జులై 1: వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 202వ రోజైన ఆదివారం తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగింది. శనివారం రాత్రి ముమ్మిడివరంలోని ఎయిమ్స్ ఇంజినీరింగ్ కళాశాలలో బసచేసిన జగన్ ఆదివారం ఉదయం 8.30 గంటలకు పాదయాత్ర ప్రారంభించారు.

07/02/2018 - 02:22

వేములవాడటౌన్, జూలై 1: శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న నవ చండీసహిత రుద్రయాగం చివరిరోజున శృంగేరి పీఠాధిపతి శ్రీ విధుశేఖర భారతి తీర్థస్వామి వారి కరకమలములచే పూర్ణాహుతి శాస్త్రోక్తంగా జరిగింది. స్వీయ పర్యవేక్షణలో పూర్ణాహుతిని పరిసమాప్తం చేయించారు. ఈ కార్యక్రమంలో వేదపండితులు, అర్చకులు పాల్గ్గొన్నారు.

07/02/2018 - 02:20

విజయవాడ, జూలై 1: రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ విద్యార్థులకూ ఈ నెల 2 నుంచి మధ్యాహ్న భోజన పథకం అమలు చేయనున్నారు. పదో తరగతి తరువాత ఇంటర్‌లో చేరే విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటాన్ని ప్రభుత్వం గమనించి మధ్యాహ్న భోజన పథకం వారికీ వర్తింపచేయాలని నిర్ణయించింది.

07/02/2018 - 02:16

తిరుపతి, జూలై 1: తన వ్యక్తిగత సింగపూర్ పర్యటన నిమిత్తం తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు ఈనెల 2 నుంచి 10వ తేదీ వరకు ప్రభుత్వానికి పెట్టుకున్న సెలవు వినతి రద్దయింది. ఈ సంఘటన టీటీడీలో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. ఈనెల 2 నుంచి 10వ తేదీ వరకు తన వ్యక్తిగత పర్యటన నిమిత్తం సెలవు మంజూరు చేయాలని జేఈఓ శ్రీనివాసరాజు సెలవుకోసం దరఖాస్తు చేసుకున్నారు.

Pages