S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

05/08/2018 - 05:21

*లక్ష్యసాధనకు చిత్తశుద్ధి తోడైతే అసాధ్యమూ సుసాధ్యమేనని సివిల్స్ టాపర్ అనుదీప్ నిరూపించాడని సీఎం కేసీఆర్ ప్రశంసించారు. తెలంగాణ బిడ్డడు సాధించిన ఘనతను చూసి మురిసిపోయన కేసీఆర్, అనుదీప్ కుటుంబాన్ని సోమవారం ఇంటికి ఆహ్వానించారు. విందు ఇచ్చారు. మరింత ఎత్తులకు ఎదగాలని ఆశీర్వదిస్తూ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు.

05/08/2018 - 04:29

హైదరాబాద్, మే 7: అయోడిన్ లోపంవల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతారంటూ ప్రజలను భయభ్రాంతులను గురిచేస్తున్న పెద్ద కంపెనీలు వేల కోట్లు దండుకుంటున్నాయి. ప్రతి వ్యక్తికి అయోడిన్ అవసరమని, అయోడిన్ కలిగిన ఉప్పు (అయోడైజ్డ్ సాల్ట్) మాత్రమే విక్రయించాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం.. పెద్ద కంపెనీల దోపిడీకి ‘ఆమోదముద్ర’ వేసినట్టయింది.

05/08/2018 - 05:24

విజయవాడ, మే 7: ప్రగతిశీల రాష్ట్రాలు నీరుగారిపోయేలా, సహకార సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించేలా కేంద్రం వ్యవహరిస్తోందని వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సదస్సు అభిప్రాయపడింది. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలపై కేంద్రం చూపుతున్న వివక్షకు 15వ ఆర్థిక సంఘం విధివిధానాలు అద్దం పడుతున్నాయని అసంతృప్తి వ్యక్తం చేసింది. 15వ ఆర్థిక సంఘం రూపొందించిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీవోఆర్)ను వ్యతిరేకించింది.

05/08/2018 - 05:26

హైదరాబాద్, మే 7: రైతు పాస్ పుస్తకాల ముద్రణలో 80 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. తాము చేసిన ఆరోపణలపై న్యాయ విచారణ జరిపిస్తే ఆధారాలు చూపిస్తామని సవాల్ చేశారు. సోమవారం పార్టీ నాయకుడు డాక్టర్ దాసోజు శ్రవణ్‌తో కలిసి విలేఖరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ప్రభుత్వం కుంభకోణాలకు నిలయంగా మారిందని దుయ్యబట్టారు.

05/08/2018 - 04:18

హైదరాబాద్, మే 7: అటకెక్కిన ఓటుకు నోటు కేసును ప్రభుత్వం తిరగదోడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కేసు తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కేసు పురోగతిపై సోమవారం ప్రగతి భవన్‌లో పోలీసు ఉన్నతాధికారులు, న్యాయ నిపుణులతో సీఎం కేసీఆర్ సమీక్షించారు. లభించిన కీలక ఆధారాలు, ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికపై ఆరా తీయడంతోపాటు కేసు పురోగతిని అడిగి తెలుసుకున్నారు. సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలుపైనా చర్చించారు.

05/08/2018 - 04:17

హైదరాబాద్, మే 7: తెలంగాణలో ఆన్‌లైన్‌లో ఐదురోజుల పాటు నిర్వహించిన ఎమ్సెట్ అగ్రికల్చర్, ఇంజనీరింగ్ స్ట్రీం ప్రవేశ పరీక్ష ఫలితాలను 18న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్టు సెట్ కన్వీనర్ డాక్టర్ ఎన్ యాదయ్య తెలిపారు. మే 2, 3 తేదీల్లో అగ్రికల్చర్ స్ట్రీం, మే 4, 5, 7 తేదీల్లో ఇంజనీరింగ్ స్ట్రీం పరీక్ష నిర్వహించామన్నారు.

05/08/2018 - 03:51

గుంటూరు, మే 7: ఎర్రచందనం స్మగ్లింగ్‌ను పూర్తిస్థాయిలో నిరోధించేందుకు ద్విముఖ వ్యూహాన్ని అనుసరించాలని ఆంధ్ర, తమిళనాడు అటవీ అధికారులు నిర్ణయించారు. దీంతోపాటు అటవీ సంపద పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణపై పరస్పర సహకారం అందించుకునేందుకు రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది. సోమవారం చెన్నైలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల అటవీ శాఖల అధికారులు సమావేశమయ్యారు.

05/08/2018 - 03:46

కాకినాడ, మే 7: తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ తీర ప్రాంతం ప్రధాన స్థావరంగా చమురు దొంగలు చెలరేగిపోతున్నారు. గతంలో ఈ ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా సాగిన ఆయిల్ మాఫియా దందా ఇటీవలి కాలంలో రచ్చకెక్కింది. కాకినాడ కేంద్రంగా ఏటా కోట్ల రూపాయల విలువైన ఆయిల్ చోరీ అవుతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. అయినప్పటికీ అక్రమ ఆయిల్ స్మగ్లింగ్ మాత్రం ఇక్కడ నిర్విఘ్నంగా సాగుతుండటం విశేషం.

05/08/2018 - 05:29

గుడివాడ, మే 7: పేదలకు ఇళ్ల నిర్మాణం పేరుతో లంచాలు తింటున్న చంద్రబాబును, కాంట్రాక్టర్లను వైకాపా అధికారం చేపట్టిన వెంటనే జైల్లో పెట్టిస్తానని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా సోమవారం రాత్రి కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలోని నెహ్రూచౌక్ సెంటర్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పేదల ఇళ్ల నిర్మాణంలో అవినీతి తారస్థాయికి చేరిందని ఆరోపించారు.

05/08/2018 - 03:40

విజయవాడ, మే 7: ప్రగతిశీల రాష్ట్రాలు నీరుగారిపోయేలా, సహకార సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించేలా కేంద్రం వ్యవహరిస్తోందని వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సదస్సు అభిప్రాయపడింది. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలపై కేంద్రం చూపుతున్న వివక్షకు 15వ ఆర్థిక సంఘం విధివిధానాలు అద్దం పడుతున్నాయని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 15వ ఆర్థిక సంఘం రూపొందించిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీవోఆర్)ను వ్యతిరేకించింది.

Pages