S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

05/08/2018 - 02:53

బెంగళూరు, మే 7: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య సోమవారం ప్రధాని నరేంద్ర మోదీకి, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలకు లీగల్ నోటీసులు పంపారు. పోన్జీ పథకాన్ని నడుపుతూ ప్రజలను మోసగిస్తున్న ఒక కంపెనీకి మద్దతు ఇవ్వడమే కాకుండా దాన్ని రక్షిస్తున్నారంటూ సిద్దరామయ్యపై బీజేపీ ఆరోపణలు గుప్పించిన నేపథ్యంలో ఈ నోటీసులు జారీ చేశారు.

05/08/2018 - 05:30

మండపేట, మే 7: తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలంలో ఘాతుకం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన 30 ఏళ్ల వికలాంగురాలిపై ఒక వ్యక్తి లైంగిక దాడికి పాల్పడటంతో ఆమె గర్భవతి అయ్యింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలిలావున్నాయి... పుట్టుకతోనే మూగ, పోలియో కారణంగా రెండు కాళ్లు కోల్పోయిన ఒక యువతి చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించడంతో సోదరుని వద్ద ఉంటోంది.

05/07/2018 - 17:30

హైదరాబాద్: సివిల్ సర్వీసెస్ 2017లో ఆలిండియా మొదటి ర్యాంకు సాదించిన రాష్ర్టానికి చెందిన దురిశెట్టి అనుదీప్ ఇవాళ సీఎం కేసీఆర్‌ను ప్రగతి భవన్‌లో కలిశారు. అనుదీప్ తన తల్లిదండ్రులతో కలిసి ప్రగతి భవన్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం వాళ్లతో కలిసి భోజనం చేశారు. అనంతరం అనుదీప్, ఆయన తల్లిదండ్రులను సీఎం సత్కరించారు. యువతకు అనుదీప్ ఆదర్శంగా నిలిచారని సీఎం కొనియాడారు.

05/07/2018 - 17:26

చిత్తూరు: టీడీపీ ఎమ్మెల్సీగా గాలి సరస్వతమ్మ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. అ సందర్భంగా ఎన్నికల అధికారులు ఆమెకు ధృవీకరణ పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నేతలు ఎంపీ శివప్రసాద్, జడ్పీ చైర్మన్ గీర్వాణి, ఎమ్మెల్సీ దొరబాబు, పులివర్తి నాని, మేయర్ హేమలత తదితరులు హాజరయ్యారు.

05/07/2018 - 17:25

హైదరాబాద్‌: కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ సస్పెన్షన్ విషయంలో హైకోర్టు తీర్పు ఇచ్చి 20 రోజులు గడుస్తున్నా అమలు చేయకపోవటం దారుణమని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ నేతలు షబ్బీర్ అలీ, జీవన్ రెడ్డి, మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి, వంశీచంద్ రెడ్డి, దాసోజు శ్రావణ్‌తో కలిసి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈరోజు గవర్నర్‌ నరసింహన్‌ను రాజ్‌భవన్‌లో కలిశారు.

05/07/2018 - 17:07

హైదరాబాద్: తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు బస్‌భవన్‌ను ముట్టడించారు. టీఎంయు ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో పెద్ద సంఖ్యలో కార్మికులు తరలివచ్చారు. కార్మికుల వేతన సవరణ, ఆర్టీసీలో ఖాళీల భర్తీ, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

05/07/2018 - 14:03

అనంతపురం: ఏపీకి ప్రత్యేక హోదా కోసం ధర్మవరంలో సైకిల్ యాత్ర చేస్తుండగా టీడీపీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ వడదెబ్బతో తీవ్ర అస్వస్థకు గురై మార్గం మధ్యలో కుప్పకూలారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు ఎమ్మెల్యేను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఉదయం ఆయన పోతుకుంట నుంచి ధర్మవరం పట్టణానికి 10 కిలోమీటర్ల యాత్ర చేపట్టారు.

05/07/2018 - 13:51

గుంటూరు:ఆడబిడ్డకు రక్షణగా నిలుద్దాం అంటూ గుంటూరులో భారీ ప్రదర్శన నిర్వహించారు. వేలాదిమంది కదిలివచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన పిలుపు మేరకు ఈ భారీ ప్రదర్శన నిర్వహించారు. కలెక్టరేట్ కూడలి నుంచి హిందూ కళాశాల వరకు ఈ ప్రదర్శన నిర్వహించారు.

05/07/2018 - 13:51

చుండూరు: దాచేపల్లి ఘటనను మరువకముందే చుండూరు మండలం మోదుకూరులో ఏడేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. ఏడేళ్ల బాలికపై నాగుల్‌మీరా అనే యువకుడు అత్యాచారం చేశాడు. రెండు రోజులు క్రితం జరిగింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

05/07/2018 - 13:50

అనంతపురం: పరిటాల రవి ప్రధాన అనుచరుడు, జడ్పీటీసీ చమన్ గుండెపోటుతో మృతిచెందారు. మంత్రి పరిటాల సునీత కుమార్తె స్నేహలత వివాహ వేడుకలలో గత రెండు రోజులుగా పాల్గొన్న చమన్‌కు అకస్మాత్తుగా గుండెపోటు రావటంతో మంత్రి సునీత ఆయనను చికిత్స నిమిత్తం అనంతపురం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆయన వయసు 58 సంవత్సరాలు.

Pages