S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

05/10/2018 - 11:47

విశాఖపట్నం:ఆంధ్రప్రదేశ్‌ పాలీసెట్‌-2018 ఫలితాలను గురువారం విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఫలితాల్లో బాలికలదే పైచేయి అని తెలిపారు. మొత్తం 1,29,412 మంది విద్యార్థులు పరీక్షకు హజరయ్యారు. మొత్తంగా 80.19 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు మంత్రి వెల్లడించారు. బాలికలు 84.61శాతం, బాలురు 78.16 శాతం ఉత్తీర్ణత సాధించారు.

05/10/2018 - 04:37

హైదరాబాద్, మే 9: ఇంజనీరింగ్‌లో నేరుగా సెకండియర్ యుజీ కోర్సులో చేరేందుకు బుధవారం నాడు నిర్వహించిన ఇసెట్ ప్రశాంతంగా ముగిసిందని కన్వీనర్ డాక్టర్ ఎ గోవర్ధన్ చెప్పారు. తెలంగాణలో 26,442 మంది రిజిస్టర్ చేసుకోగా, 25,761 మంది ఆంధ్రాలో 1215 మందికి 112 మంది పరీక్ష రాశారని చెప్పారు. రెండు రాష్ట్రాలు కలిపి 27,657 మందికి 26,883 మంది హాజరయ్యారని అన్నారు. ఫలితాలను 15వ తేదీన ప్రకటించే వీలుందని చెప్పారు.

05/10/2018 - 05:16

హైదరాబాద్, మే 9: భారత ప్రధాని పదవి 2024 వరకూ ఖాళీ లేదని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీతో గెలిచి అధికారంలోకి వస్తుందని కేంద్ర మాజీ మంత్రి షానవాజ్ హుస్సేన్ పేర్కొన్నా రు. బుధవారం నాడు ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పగటి కలలు కంటున్నారని, ప్రధాని పదవి 2024 వరకూ ఖాళీ లేదని పేర్కొన్నారు.

05/10/2018 - 05:33

హైదరాబాద్/చార్మినార్, మే 9: ప్రభుత్వం ఇటీవల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిష న్ ద్వారా జరిపిన గురుకుల టీచర్స్ పోస్టుల రిక్రూట్‌మెంట్‌లో అక్రమాలు జరిగాయని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అ ధ్యక్షుడు ఆర్.కృష్ణ య్య ఆరోపించా రు. ముఖ్యంగా రిజర్వేషన్ల అమలు జరిగిన తీరుపై విచారణ జరిపించాలని ఆయన డిమాం డ్ చేశారు. బు ధవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన నిరుద్యోగ అభ్యర్థుల సమావేశానికి ఆయన హాజరయ్యారు.

05/10/2018 - 04:33

వరంగల్, మే 9: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నేరస్థులకు అండగా నిలిచి దేశాన్ని సర్వ నాశనం చేస్తున్నాడని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు. బుధవారం వరంగల్‌లో తెలంగాణ సాయుధ పోరాటయోధులు అప్పన్న-కమలమ్మల కాంస్య విగ్రహాన్ని అవిష్కరించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రధాని మోదీ దేశాన్ని అసాంఘిక శక్తులకు, మాఫియాలకు అడ్డాగా మార్చారని దుయ్యబట్టారని అన్నారు.

05/10/2018 - 04:32

హైదరాబాద్, మే 9: అక్రమ ఆయుధాల కేసులో మద్దెలచెర్వు సూరి హత్య కేసులో నిందితుడు భాను కిరణ్ సహా నలుగురికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ నాంపల్లి ఐదో ఎసీఎంఎం కోర్టు ఏడాది జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ బుధవారం తీర్పు చెప్పింది. 2009లో నమోదైన ఈ కేసు వివరాలను సీఐడీ అదనపు డైరక్టర్ జనరల్ గోవింద్ సింగ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

05/10/2018 - 04:31

హైదరాబాద్, మే 9: తాము రైతులకు బంధువులని, రైతులకు రాబంధువులుగా సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ నాయకులు తయ్యారయ్యారని టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి, ప్రధాన కార్యద ర్శి డా. శ్రవణ్ దాసోజు విమర్శించారు. వ్యవసాయం, రైతులకు సంబంధించిన అంశాలలో తమకు, టీఆర్‌ఎస్‌కు పోలికలే లేవని ఆయన బుధవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ అన్నారు.

05/10/2018 - 04:30

హైదరాబాద్, మే 9: ఒకే ఒక దరఖాస్తుతో తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలో ఏ బ్రాంచిలోనైనా సీటు పొందే అవకాశాన్ని డిగ్రీ ఆన్‌లైన్ అడ్మిషన్ల ప్రక్రియ ద్వారా కల్పించినట్టు ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు ప్రొ. ఆర్ లింబాద్రి తెలిపారు. బుధవారం నాడు ఆయన ఆంధ్రభూమితో మాట్లాడుతూ ‘దోస్త్’ నిర్వహణ తీరుతెన్నులను వివరించారు.

05/10/2018 - 05:13

హైదరాబాద్, మే 9: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రసిద్ధ కాళేశ్వరం దేవస్థానం చైర్మన్‌గా బొమ్మరి వెంకటేశంను ప్రభుత్వం నియమించింది. తనను కాళేశ్వరం దేవాలయ చైర్మన్‌గా నియమించడం పట్ల బొమ్మరి వెంకటేశం బుధవారం ప్రగతి భవన్‌కు వచ్చి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వెంకటేశాన్ని శాలువ కప్పి సిఎం సన్మానించారు. వెంకటేశం సిఎం కేసీఆర్‌కు బాల్యమిత్రుడు.

05/10/2018 - 05:15

హైదరాబాద్, మే 9: తెలంగాణ సీఎం కే. చంద్రశేఖరరావు నేతృత్వంలో చేపట్టిన రైతుబంధు పథకం ప్రారంభోత్సవం చారిత్రక ఘట్టంగా నిలిచిపోతుందని వ్యవసాయ, ఆర్థిక రంగ నిపుణులు పేర్కొంటున్నారు. పథకాన్ని గురువారం ఉదయం 11 గంటలకు కేసీఆర్ స్వయంగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని ధర్మరాజుపల్లి (ఇందిరానగర్) లో ప్రారంభిస్తున్నారు. గ్రామంలోని కొంత మంది రైతులకు ఎకరాకు నాలుగు వేల రూపాయల చెక్కులను అందిస్తారు.

Pages