S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

05/09/2018 - 17:16

హైదరాబాద్: హైదరాబాద్‌ను కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ఎలక్ట్రిక్ వాహనాలను పెంచుతామని సీఎం కేసీఆర్ అన్నారు. జీహెచ్‌సిఎంసీ, ఆర్టీసీలో ఎలక్ట్రిక్ వాహనాలను పెంచుతామని అన్నారు. చైనాకు చెందిన ఎలక్ట్రికల్ సంస్థ బీవైడీ ఆటో ఇండస్ట్రీ ప్రతినిధులు సీఎం కేసీఆర్‌ను కలుసుకున్నారు. హైదరాబాద్‌లో ఎలక్ట్రికల్ బ్యాటరీతో నడిచే వాహనాల సంస్థను ఏర్పాటుచేస్తామని చెప్పారు.

05/09/2018 - 14:06

కరీంనగర్‌: తెలంగాణలో 50 లక్షల 34 వేల మంది రైతులకు పంట పెట్టుబడి సాయం అందజేస్తున్నట్లు మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ పథకం అమలుకోసం బడ్జెట్‌లో రూ.12 వేల కోట్లు కేటాయించామన్నారు. ఇలాంటి పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని అన్నారు. లక్షమంది రైతులతో రేపు హుజూరాబాద్‌లో సభ నిర్వహించనున్నట్లు మంత్రి ఈటెల తెలిపారు.

05/09/2018 - 13:45

అనంతపురం: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ బుధవారం ఉదయం ధర్మవరంలో పర్యటించారు. ఆయన చేనేత కార్మికులతో ముఖాముఖి నిర్వహించారు. చేనేత కార్మికుల కోసం రూ. 1000 కోట్లు కేటాయించాలని ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు.

05/09/2018 - 04:24

హైదరాబాద్, మే 8: తెలంగాణలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే ‘దోస్త్’ కౌనె్సలింగ్ నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి, ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణ, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ విడుదల చేశారు. ఈ సందర్భంగా కౌనె్సలింగ్ షెడ్యూలు, అందుకు చేపట్టిన సాంకేతిక ఏర్పాట్లను వివరించారు.

05/09/2018 - 02:41

* 11న మంత్రివర్గ ఉప సంఘం నివేదిక 12న అధికారులతో కేసీఆర్ భేటీ

05/09/2018 - 04:11

* రైతు బంధు పథకానికి కౌంట్‌డౌన్ మరో 24 గంటల్లో చెక్కుల పంపిణీ
* హైదరాబాద్ మినహా 30 జిల్లాల్లో పండుగ ప్రజాప్రతినిధులందరికీ ఆహ్వానం

05/09/2018 - 02:35

హైదరాబాద్, మే 8: గుండ్లపోచంపల్లి పార్క్‌లో వస్త్ర పరిశ్రమలు తప్ప ఇతర వాటికి అనుమతులు రద్దు చేయాల్సిందిగా చేనేత మంత్రి కె తారకరామారావు ఆదేశించారు. బేగంపేట క్యాంపు కార్యాలయంలో మంగళవారం గుండ్లపోచంపల్లి, పాశమైలారం పార్క్‌లపై సంబంధిత శాఖ కార్యదర్శి జయేష్ రంజన్, టీఎస్‌ఐఐసి అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.

05/09/2018 - 04:20

* రాష్ట్రాన్ని నెంబర్-1గా తీర్చిదిద్దాలి కాలానుగుణంగా విజన్ మారాలి
* ప్రజలకు మరింత చేరువ కావాలి జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి నిర్దేశం ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు

05/09/2018 - 04:22

గుడివాడ, మే 8: చేతివృత్తులపై ఆధారపడి జీవించే నారుూబ్రాహ్మణులకు అండగా ఉంటామని ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా మంగళవారం కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ మండలం కల్వపూడి అగ్రహారంలో నారుూబ్రాహ్మణ సంఘీయులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు.

05/09/2018 - 04:13

రాజమహేంద్రవరం, మే 8: ఓఎన్జీసీ కేజీ బేసిన్ అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తీర్చిదిద్దిన కృష్ణా జిల్లాలోని నాగాయలంక క్షేత్రం చమురు, సహజవాయువు నిక్షేపాల వెలికితీతకు సిద్ధమైంది. మరో పది రోజుల్లో అపారమైన, చమురు, సహజవాయువు నిక్షేపాలు కలిగిన ఈ క్షేత్రం నుంచి ఉత్పత్తి ప్రారంభం కానుంది. ఈ క్షేత్రంలో మొత్తం నాలుగు బావులు ఉండగా అందులో పాత బావిని సరికొత్తగా ఆధునిక సాంకేతికతో ఉత్పత్తికి సిద్ధం చేశారు.

Pages