S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

05/10/2018 - 05:18

హైదరాబాద్, మే 9: స్థానిక కంపెనీలతో కలిసి హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కేంద్రాన్ని నెలకొల్పడానికి చైనాకు చెందిన బివైడి ఆటో ఇండస్ట్రీ కంపెనీ ముందుకొచ్చింది. హైదరాబాద్‌ను కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించనున్నట్టు ఈ సందర్భంగా సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు.

05/10/2018 - 05:20

హైదరాబాద్, మే 9: కాంగ్రెస్‌ను మించిన గలీజు పార్టీ దేశంలోనే లేదని ఐటీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌లో కుంభకోణాలు, లంబకోణాలు లేని నాయకుడు ఒక్కరూ లేరని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కమీషన్లు, కాంట్రాక్టులకే పరిమితమైన నాయకులు ఆ పార్టీలో ఉన్నారన్నారన్నారు.

05/10/2018 - 05:37

జిల్లా కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు

05/10/2018 - 05:23

* కలెక్టర్లతో సమన్వయం కావాలి * దర్యాప్తు సమర్థత పెంచుకోవాలి

05/10/2018 - 02:56

భీమవరం, మే 9: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నగరాలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలను చెత్త సేకరణ కోసం పాకెట్ల వారీ విభజన చేస్తున్నారు. ఈ విధానం ద్వారా ప్రతీ ఇంటికీ చెత్త సేకరణ జరిగిందా లేదా అన్న చాలా స్పష్టంగా తెలుస్తోంది. అంతేకాదు సేకరించిన చెత్తను కూడా తూకం వేస్తారు. తద్వారా ఇంటింటికీ చెత్త సేకరణ ఏ విధంగా జరిగిందో నిర్ధారణ అవుతోంది.

05/10/2018 - 02:54

ఆంధ్రభూమి బ్యూరో

05/10/2018 - 05:28

మెదక్ రూరల్, మే 9: రైతుబంధు పథకంలో ఎకరాకు 4 వేల రూపాయల చెక్కుతోపాటు పట్టాదారు పుస్తకాలు అందజేయడానికి ఒకరోజు ముందు రైతన్నలకు ప్రభుత్వం మరో తీపి కబురు ప్రకటించింది. 800 కోట్ల రూపాయల భూమి శిస్తు బకాయిల మాఫీని ప్రకటించింది. అలాగే, ఇకనుండి భూమి శిస్తు వసూలు చేయమని, నీటి వనరుల నిర్వహణ ప్రభుత్వమే చేపడుతుందని మెదక్ సభలో సీఎం కేసీఆర్ ప్రకటించారు.

05/10/2018 - 02:50

కర్నూలు, మే 9: ముఖ్యమంత్రి చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. గురువారం కర్నూలులో పర్యటించనున్న సీఎం మేధావుల సదస్సులో పాల్గొని ప్రత్యేక హోదా అంశంపై వారితో చర్చించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్చంద సంస్థలు, విద్యార్థులు ఈ సదస్సులో పాల్గొననున్నారు. సుమారు మూడు గంటల పాటు కొనసాగే ఈ సదస్సులో చంద్రబాబు ఏం చెప్పనున్నారన్న అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

05/10/2018 - 05:32

హైదరాబాద్, మే 9: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రానున్న సార్వత్రిక ఎన్నికలకు అస్త్ర శస్త్రాలతో సన్నద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా ఆంధ్ర పర్యటనకు రంగం సిద్ధమైంది. తొలుత పాదయాత్రకు మొగ్గుచూపినా, తక్కువ సమయంలో ఎక్కువ ప్రాంతాలు పర్యటించాలంటే బస్సు యాత్ర ఉత్తమమని నిర్ణయించి, అత్యాధునిక సౌకర్యాలతో కూడిన టెక్నాలజీ ఆధారిత బస్సును పవన్ సిద్ధం చేసుకున్నారు.

05/09/2018 - 17:44

హైదరాబాద్: తమ సమస్యల పరిష్కారానికి టీజేఎంయూ సమ్మె నోటీసు ఇచ్చింది. కార్మికుల వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు.

Pages