S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

04/10/2018 - 14:07

వరంగల్‌ రూరల్‌ : ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌ నగరంలో జరుగుతున్న కామన్‌వెల్త్‌ క్రీడల్లో షటిల్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి నెలకుర్తి సిక్కిరెడ్డి స్వర్ణం సాధించారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఫైనల్‌ మ్యాచ్‌లో మలేషియాకు చెందిన వివాన్‌ షూ, మీ కూన్‌ చౌతో ఇండియా తరఫున సిక్కిరెడ్డి, అశ్విని పొన్నప్ప తలపడ్డారు. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో 21–18, 21–19 తేడాతో మలేషియా టీమ్‌పై గెలిచారు.

04/10/2018 - 13:59

నల్లగొండ : మిర్యాలగూడ మండలంలోని ఆలగడప వద్ద డీసీఎం వాహనంలో అక్రమంగా తరలిస్తున్న గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ గుట్కా విలువ రూ. 75 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. డీసీఎంను సీజ్ చేశారు. గుట్కాను తరలిస్తున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

04/10/2018 - 13:49

నిజామాబాద్ : నిజామాబాద్‌లోని గిరిరాజ్ డిగ్రీ కళాశాల మైదానంలో యోగా శిబిరాన్ని రాందేవ్ బాబా ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన మీడియాతో సమావేశంలో రాందేవ్ బాబా, ఎంపీ కవిత, హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. జిల్లాలో రైతుల కోసం పసుపు బోర్డును ఏర్పాటు చేయాల్సిందేనని యోగా గురువు బాబా రాందేవ్ పేర్కొన్నారు. పసుపు బోర్డు కోసం ఢిల్లీలో ఆందోళన చేస్తే తాను పాల్గొంటానని ఆయన స్పష్టం చేశారు.

04/10/2018 - 13:17

వరంగల్ అర్బన్ : ఎంసెట్, నీట్ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలోని రెసిడెన్షియల్ స్కూల్స్, మోడల్ స్కూల్స్‌లో చదివే విద్యార్థులకు ఉచితంగా క్లాసులు చెప్పిస్తున్నామని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. హసన్‌పర్తి రెసిడెన్షియల్ కాలేజీలో ఎంసెట్, నీట్ పరీక్షల కేంద్రాలను డిప్యూటీ సీఎం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ..

04/10/2018 - 13:04

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ వైకాపా జాతీయరహదారులను దిగ్బంధం చేసింది. కడప, చెన్నై రహదారిలో వాహనాల రాకపోకలను ఆ పార్టీ నేతలు అడ్డుకున్నారు. కార్యక్రమంలో రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డితో పాటు పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరోవైపు కృష్ణా జిల్లా జాతీయ రహదారుల దిగ్బంధనానికి సిద్ధమవుతున్న పార్టీ నేతలను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు.

04/10/2018 - 12:56

మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరిలో వైకాపా అధినేత జగన్ పాదయాత్ర కొనసాగుతోంది. మంగళవారం ఉదయం మంగళగిరిలో ప్రారంభమైన ఈ పాదయాత్ర తెనాలి ఫ్లైఒవర్ సెంటర్, పాత బస్టాండ్, అంబేద్కర్ సెంటర్ వరకు కొనసాగింది. ఈ పాదయాత్ర సందర్భంగా జగన్ చేనేత కార్మికులతో సమావేశంకానున్నారు.

04/10/2018 - 12:54

అమరావతి: ఏపీ రాజధాని అమరావతిలో ఆనందనగరాల సదస్సు ప్రారంభమైంది. మూడు రోజులపాటు జరుగనున్న ఈ సదస్సు చెన్నై-కోల్‌కత్తా జాతీయ రహదారి పక్కనే ఉన్న సీజే కనె్వన్షన్ హాల్‌లో ఏర్పాటుచేశారు. సదస్సును ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఆధ్యాత్నిక గురువు సద్గురు జగ్గీవాసుదేవ్ జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ, దేవినేని ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

04/10/2018 - 04:49

కర్నూలు: దేశంలో దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం చూపుతున్న వివక్ష ప్రత్యేక దక్షిణ భారతదేశ ఉద్యమానికి దారి తీసేలా ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు.

04/10/2018 - 02:49

నిజామాబాద్, ఏప్రిల్ 9: భారతదేశాన్ని 2050వ సంవత్సరం నాటికి అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుతూ అత్యంత శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దాలన్నదే తమ సంకల్పమని, ఈ కార్యంలో పతంజలి సంస్థ క్రియాశీలక పాత్ర పోషిస్తుందని ప్రముఖ యోగా గురువు రాందేవ్‌బాబా పేర్కొన్నారు.

04/10/2018 - 02:47

అమలాపురం, ఏప్రిల్ 9: ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్టులో జరుగుతున్న కామనె్వల్త్ గేమ్స్‌లో షటిల్ బ్యాడ్మింటన్‌లో భారత్ బంగారు పతకం సాధించడంతో తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో సోమవారం సంబరాలు మిన్నంటాయి. షటిల్ బ్యాడ్మింటన్ డబుల్స్, మిక్సిడ్ డబుల్స్ జట్లలో అమలాపురానికి చెందిన రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ సభ్యుడుగా ఉండటమే కాకుండా రెండు మ్యాచ్‌ల్లో తన క్రీడా నెపుణ్యాన్ని ప్రదర్శించడమే ఇందుకు కారణం.

Pages