S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

04/13/2018 - 03:41

హైదరాబాద్, ఏప్రిల్ 12: దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకరావడానికి బీజేపీ, కాంగ్రెస్ కూటములకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించిన టిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆ దిశగా కసరత్తును ముమ్మరం చేశారు.

04/13/2018 - 02:56

హైదరాబాద్, ఏప్రిల్ 12: గురుకులాలు అన్నింటికీ ఉమ్మడి పరీక్షా విధానం అమలుచేయాలని, ఉమ్మడి మెనూ, సమాన వసతులు కల్పించాల్సిన అవసరం ఉందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఎస్సీ, ఎస్టీ , బీసీ గురుకులాల పనితీరును గురువారం ఆయన ఉన్నతాధికారులతో సమీక్షించారు. తెలంగాణ గురుకులలను దేశంలోనే నెంబర్ వన్ గురుకులలుగా తీర్చిదిద్దాలని సూచించారు.

04/13/2018 - 03:33

హైదరాబాద్, ఏప్రిల్ 12: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘రైతుబంధు’ (రైతులకు ఎకరానికి నాలుగువేల రూపాయల పెట్టుబడి సాయం) పథకంతో బ్యాంకర్లు సంబురాలు చేసుకుంటున్నారు. రైతుబంధు పథకం ద్వారా రైతులకు ప్రభుత్వమే గ్రాంటుగా ఎకరానికి నాలుగువేల రూపాయలు ఇవ్వడం వల్ల తమపై ఆర్థిక భారం, వత్తిడి బాగా తగ్గుతోందన్నది బ్యాంకర్ల ఆనందానికి కారణంగా తెలుస్తోంది.

04/13/2018 - 02:40

కావలి/ అనంతపురం సిటీ, ఏప్రిల్ 12: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో నెల్లూరు జిల్లా కావలి పట్టణానికి చెందిన కె తేజవర్దన్‌రెడ్డి ఎంపీసీ విభాగంలో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు. స్థానిక శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో విద్య అభ్యసించిన తేజవర్దన్‌రెడ్డి 992 మార్కులతో మొదటి స్థానంలో నిలిచారు.

04/13/2018 - 03:20

ప్రపంచ బాడ్మింటన్ పురుషుల విభాగంలో నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించిన కిడాంబి శ్రీకాంత్. ప్రపంచ బాడ్మింటన్ సమాఖ్య (డబ్ల్యుబీఎఫ్) అధికారికంగా ర్యాంకింగ్స్ నూతన విధానాన్ని అమలు చేయక ముందు, 1980వ దశకంలో అప్పటి స్టార్ ఆటగాడు ప్రకాశ్ పదుకొనే ప్రపంచ నంబర్ వన్‌గా ఎదిగాడు. అయితే, అప్పట్లో ర్యాంకింగ్స్‌కు అధికారిక గుర్తింపు ఉండేది కాదు.

04/13/2018 - 03:21

సూళ్లూరుపేట, ఏఫ్రిల్ 12: అంతరిక్ష రంగంలో భారత్ మరో మైలురాయిని అధిగమించింది...రోదసీ పరిశోధనలో ఇస్రో మరోసారి తన సత్తాచాటింది. దేశీయ ఉపగ్రహ దిక్సూచి వ్యవస్థను సొంతంగా ఏర్పాటు చేసుకోవాలన్న కలను సాకారం దిశగా ఇస్రో మరోసారి విజయఢంకా మోగించింది. రోదసీ అధారిత సొంత దిక్సూచి వ్యవస్థను కలిగివున్న అతికొద్ది దేశాల సరసన సగర్వంగా చేరింది.

04/13/2018 - 02:28

విజయవాడ, ఏప్రిల్ 12: రాష్ట్రానికి ప్రత్యేక హోదా తదితర అంశాల్లో అన్యాయం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యుద్ధం ప్రకటించారు. మంత్రివర్గ భేటీ, దళిత తేజం కార్యక్రమాల కారణంగా సైకిల్ ర్యాలీలను ఈ నెల 21కు వాయిదా వేశారు. తాజా రాజకీయ పరిణామాలపై ఉండవల్లిలోని తన నివాసంలో అందుబాటులో ఉన్న మంత్రులు, ముఖ్య నేతలతో గురువారం చంద్రబాబు భేటీ అయ్యారు.

04/13/2018 - 03:34

హైదరాబాద్, ఏప్రిల్ 12: ప్రమాణ స్వీకారం చేసే ముందు పార్లమెంట్ మెట్లకు మొక్కి అడుగుపెట్టిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి పార్లమెంటరీ విధానాలు, సంప్రదాయాల పట్ల గౌరవం ఉంటుందని భావించారని, కానీ అవిశ్వాసంపై ఆయన వ్యవహరించిన తీరుతో ఈ నమ్మకం తలకిందులైందని జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ పేర్కొన్నారు. పార్లమెంట్ సజావుగా సాగనీయలేదంటూ ప్రధాన మంత్రి చేసిన ఉపవాస దీక్ష నమ్మశక్యంగా లేదన్నారు.

04/13/2018 - 02:24

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: సినీరంగంలో మహిళల పట్ల జరుగుతున్న లైంగిక వేధింపులపై నటి శ్రీరెడ్డి చేస్తున్న నిరసనలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ) స్పందించింది. క్యాస్టింగ్ కౌచ్‌పై శ్రీరెడ్డి చేసిన ఆరోపణలను సుమోటోగా స్వీకరించిన ఎన్‌హెచ్‌ఆర్సీ ఆ మేరకు నాలుగు వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వానికి, కేంద్ర సమాచార ప్రసార శాఖలకు నోటీసులు జారీచేసింది.

04/13/2018 - 03:23

విశాఖపట్నం, ఏప్రిల్ 12: ప్రధాని మోదీ ఒక్క రోజు నిరాహార దీక్షకు మద్దతుగా గురువారం విశాఖలో బీజేపీ చేపట్టిన రిలే నిరాహార దీక్ష ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. బీజేపీ, సీపీఐ కార్యకర్తలు బాహాబాహీకి దిగడంతో పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. స్థానిక మహిళా కళాశాలకు ఎదురుగా బీజేపీ గురువారం రిలే నిరాహార దీక్షను ప్రారంభించింది.

Pages