S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/20/2019 - 00:58

హైదరాబాద్, డిసెంబర్ 19: ఆర్టీసీని లాభాల్లోకి తీసుకురావడానికి సంస్థతో పాటు ప్రభుత్వం అన్ని మార్గాలను అనే్వషిస్తోంది. సింగరేణి తరహలో లాభాలను సమక్చూకోవడానికి ఆర్టీసీ అధికారులు సన్నాహాలు వేగవంతం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు ఆర్టీసీ బస్సులో ప్రయాణించి మరింత మెరుగైన సౌకర్యాలను అందివ్వడానికి సలహాలు, సూచినలు ఇవ్వాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ లేఖ లు రాస్తున్నారు.

12/20/2019 - 00:56

హైదరాబాద్, డిసెంబర్ 19: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎట్టకేలకు మొట్టమొదటి లోకాయుక్త, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు అయింది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని రెండు కమిటీలు గురువారం ప్రగతిభవన్‌లో వేర్వేరుగా సమావేశమై ఎంపిక చేసింది. ఈ రెండిం టి నియామకాలకు గవర్నర్ తమిళిసై ఆ వెంటనే ఆమోదించగానే ప్రభుత్వ ప్రధా న కార్యదర్శి ఎస్‌కె జోషి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.

12/20/2019 - 00:50

ఢిల్లీలో జనవరి 26న నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రదర్శనకు రాష్ట్ర ప్రభుత్వం శకటం నమూనాను అధికారికంగా విడుదల చేసింది. వెయ్యి స్తంభాల గుడితో పాటు మేడారం జాతర, బతుకమ్మ ఉత్సవాలను ప్రతిబింబించే విధంగా శకటాన్ని రూపొందించనున్నారు.

12/19/2019 - 05:29

సూర్యాపేట, డిసెంబర్ 18 : తెలంగాణ రాష్ట్రంలో ప్రజాసంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న వినూత్న తరహా సంక్షేమ పథకాలు ప్రపంచంలో ఎక్కడా అమలు కావడం లేదని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో బుధవారం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద 313 మంది లబ్ధిదారులకు మంత్రి చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేశారు.

12/19/2019 - 05:27

వరంగల్, డిసెంబర్ 18: దేశంలోకి శరణార్ధులుగా వచ్చి దేశ పౌరసత్వం కావాలని అభ్యర్ధించే వారికి పౌరసత్వం ఇస్తే దేశ విభజన ఎలా అవుతుందని ఏబీవీపీ పూర్వ అఖిల భారత సహా సంఘటన కార్యదర్శి కేఎన్ రఘునందన్ ప్రశ్నించారు. బుధవారం ఏబీవీపీ 38వ రాష్ట్ర మహాసభలు కాకతీయ యూనివర్సిటీలో రెండవ రోజు సమావేశం డాక్టర్ ఎ.నర్సింహారెడ్డి అధ్యక్షతన జరిగింది.

12/19/2019 - 05:23

సూర్యాపేట, డిసెంబర్ 18: రాష్ట్ర ప్రజలను ఆశల పల్లకిలో ఎక్కించి రెండోసారి అధికారం చేపట్టిన సీఎం కేసీఆర్ ఏడాది పాలనలో అన్నింటా వైఫల్యం చెంది రాష్ట్ర ప్రజలను మోసం, దగా, విశ్వాస ఘాతుకాలకు గురిచేశారని టీపీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు.

12/19/2019 - 01:03

హైదరాబాద్: పురపాలక ఎన్నికల్లో మరో ముందడుగు పడింది. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల విభజన పూర్తయింది. ఈ వివరాలన్నింటినీ సంబంధిత కమిషనర్లు మున్సిపల్ డైరెక్టర్‌కు బుధవారం పంపించారు. ఈ వివరాలను ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఒకటి రెండు రోజుల్లో అందజేస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి.

12/19/2019 - 01:02

హైదరాబాద్, డిసెంబర్ 18: జీఎస్‌టీ అమలులో రాష్ట్రాల ఆందోళనలను కేంద్రం తక్షణం పరిగణనలోకి తీసుకొని పరిష్కరించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కోరారు. జీఎస్‌టీ వసూళ్లపై రాష్ట్రాలకున్న హక్కును కాలరాసి, కేంద్రం తీసుకొచ్చిన సంస్కరణలపై విశ్వాసం ఉంచి సహకరించామన్నారు. అయితే దీనివల్ల రాష్ట్రాలకు జరుగుతున్న నష్టాన్ని గుర్తించారు.

12/19/2019 - 00:55

హైదరాబాద్, డిసెంబర్ 18: తెలంగాణలో ప్రపంచస్థాయి ఏరోస్పేస్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వెల్లడించారు. ఆదిభట్లలో ప్రత్యేకంగా ఏరోస్పేస్ పార్క్ ఏర్పాటు చేయడంతో పాటు ఇక్కడ ఇప్పటికే 25 ఏరోస్పేస్ సంస్థలు హైదరాబాద్‌లోనే ఉన్నాయని గుర్తు చేశారు.

12/18/2019 - 05:19

హైదరాబాద్, డిసెంబర్ 17: దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు, డీమ్డ్ న్యాయ విశ్వవిద్యాలయాల్లో మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ, రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశానికి వచ్చే ఏడాది మే 10వ తేదీన కంబైన్డ్ లా అడ్మిషన్ టెస్టు (క్లాట్) -2020 నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెలాఖరుకు రానుంది. జనవరి 1వ తేదీ నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తారు.

Pages