S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/18/2018 - 03:43

హైదరాబాద్/వనస్థలిపురం, జనవరి 17: అతివేగంతో అదుపుతప్పిన ఇసుక లారీ రెండు ద్విచక్రవాహనాలపైనా, ఆగి ఉన్న రెండు ఆటోలను ఢీకొట్టి ముందుకు దూసుపోయింది. ఈ సంఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా ముగ్గురు వ్యక్తులు తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి సుష్మాచౌరస్తా సిగ్నల్ వద్ద చోటు చేసుకుంది.

01/18/2018 - 03:43

హైదరాబాద్, జనవరి 17: హైదరాబాద్ శివార్లలో ఆదిబొట్ల ప్రాంతంలో కొంతమంది భూ యజమానులకు సంబంధించిన భూములు టిఎస్‌ఐఐసి పేరు మీద ఉన్న రెవెన్యూ రికార్డుల్లో ఉందని, ఈ రికార్డుల్లో నుంచి టిఎస్‌ఐఐసి పేరును తొలగించాలని హైకోర్టు రెవెన్యూ అధికారులను ఆదేశించింది.

01/18/2018 - 03:36

హైదరాబాద్, జనవరి 17: రైతుల ఆదాయాన్ని 2022 సంవత్సరం వరకు రెట్టింపు చేయవచ్చని వ్యవసాయ రంగ నిపుణులు పేర్కొన్నారు. డాక్టర్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసిఆర్ హెచ్‌ఆర్‌డి) లో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సిజిజి) బుధవారం ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌లో పలువురు నిపుణులు, అధికారులు మాట్లాడారు.

01/18/2018 - 03:34

ధర్మపురి, జనవరి 17: కోటిలింగా ల గోదావరిలో జలవిహారానికి వినియోగిస్త్తున్న ‘‘శాతకర్ణి’’ బోటు నిలి చి పోయింది. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ కృషితో, టూరిజం చైర్మన్ పేర్వారం రాములు సహకారంతో మంజూరై, ఈనెల 6న రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, చీఫ్‌విప్ ఈశ్వర్ చేతుల మీదు గా ప్రారంభమైంది. ‘‘శాతకర్ణి’’, 25సీట్లతో ‘‘పులోమావి’’ రెండు బోట్లు ప్రారంభమయ్యాయి.

01/18/2018 - 03:32

హైదరాబాద్, జనవరి 17: కార్పొరేట్ విద్యావ్యవస్థకు కొమ్ముకాసేందుకే విద్యా హక్కు చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలుచేయడం లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ ఆరోపించారు.

01/18/2018 - 03:32

హైదరాబాద్, జనవరి 17: తెలంగాణ వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నేరస్తుల జాబితా తయా రు చేసేందుకు ‘సకల నేరస్తుల సమగ్ర సర్వే’ను పోలీస్ శాఖ ఈ నెల 18 నుంచి చేపట్టనుంది. తెలంగాణ రాష్ట్రాన్ని నేరస్తుల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు పోలీసు శాఖ అడుగు ముందుకేసింది. ఈ మేరకు డిజిపి ఎం.మహేందర్ రెడ్డి బుధవారం అన్ని జిల్లాల ఎస్సీలు, కమిషనరేట్లకు ఆదేశాలు జారీ చేశా రు.

01/18/2018 - 03:31

హైదరాబాద్, జనవరి 17: ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా క్షమాభిక్ష ద్వారా ఖైదీలను విడుదల చేసేందుకు ఇంకా మార్గదర్శకాలు విడుదల కాలేదు. ఇంకా వారం రోజులే వ్యవధి ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఉలుకు పలుకూ లేదు. దాదాపు 1235 మంది వరకు ఐదేళ్లకు పైబడి శిక్ష అనుభవిస్తున్న జీవిత ఖైదీలు ఉన్నట్లు జైళ్ల శాఖ ఇప్పటికే అంచనా వేసింది. తెలంగాణ హోంశాఖ అధికారికంగా మార్గదర్శకాల జివోను జారీ చేయలేదు.

01/18/2018 - 03:31

హైదరాబాద్, జనవరి 17: హైదరాబాద్ నగర శివారులోని శామీర్‌పేట వద్ద ఉన్న లియోనియో రిసార్ట్స్ చైర్మన్ చక్రవర్తి రాజును సిబిఐ అధికారులు అరెస్టు చేశారు. పలు బ్యాంకుల్లో రూ.650 కోట్ల వరకు రుణాలు తీసుకుని తిరిగి చెల్లించలేదనే ఆరోపణలతో ఇప్పటికే బెంగుళూరు సిబిఐ అధికారులు కేసు నమోదు చేశారు. చక్రవర్తి రాజుతో పాటు పలువురు బ్యాంకు మేనేజర్లను ఈ కేసులో సిబిఐ నిందితులుగా చేర్చింది.

01/18/2018 - 03:30

హైదరాబాద్, జనవరి 17: ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వంపై నిరసన తెలిపేందుకు ఈ నెల 22న ‘్ఛలో కలెక్టరేట్’ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని తెలంగాణ సామాజిక, ప్రజా సంఘాల ఐక్య వేదిక పిలుపునిచ్చింది.

01/18/2018 - 03:30

హైదరాబాద్, జనవరి 17: ఎంఆర్‌పిఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగపై రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా, అప్రజాస్వామికంగా అరెస్టు చేసి కేసులు నమోదు చేసి జైలుకు పంపించిందని గుజరాత్ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాని విమర్శించారు. బుధవారం ఎమ్మెల్యే జిగ్నేష్ చంచల్‌గుడా జైలుకు వెళ్ళి మంద కృష్ణ మాదిగను కలిసి పరామర్శించారు.

Pages