S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/28/2017 - 00:33

హైదరాబాద్, డిసెంబర్ 27: ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉస్మానియా యూనివర్శిటీలో జరగాల్సిన 105వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ మణిపూర్‌కు తరలింది. మణిపూర్ సెంట్రల్ యూనివర్శిటీలో ఈ సదస్సు జరగనుంది. మార్చి 18 నుండి 22వ తేదీ వరకూ సైన్స్ కాంగ్రెస్ అక్కడ జరుగుతుంది. దాంతో ఉస్మానియా యూనివర్శిటీలో బోధన సిబ్బంది, విద్యార్థులు విద్యాంశాలపై దృష్టిసారించాలని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్ రామచంద్రం హితవు పలికారు.

12/28/2017 - 00:32

హైదరాబాద్, డిసెంబర్ 27: సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులు ముఖ్యమంత్రి కెసిఆర్ ఆశయాలకు అనుగుణంగా దేశంలోని ప్రతిష్ఠాత్మకమైన ఐఐటిలు, ఎన్‌ఐటిల్లో సీట్లు సాధించి గర్వకారణంగా నిలిచారని రాష్ట్ర సంక్షేమ మంత్రి జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు. వివిధ సంస్థల్లో సీట్లు పొందిన విద్యార్థులకు బుధవారం ఆయన సచివాలయంలో ల్యాప్‌టాప్‌లు అందించారు.

12/28/2017 - 00:32

హైదరాబాద్, డిసెంబర్ 27: రవాణా శాఖ ప్రస్తుత వార్షిక ఆదాయం లక్ష్యం రూ.3401 కోట్లు కాగా ఇప్పటివరకు రూ.2436 కోట్లు ఆర్జించినట్లు ఆ శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి చెప్పారు. నిర్ణీత లక్ష్యం సాధించేందుకు కృషి చేయాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు.

12/28/2017 - 00:31

సూర్యాపేట, డిసెంబర్ 27: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం టీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసే విధానాలను అవలంబిస్తోందని, త్వరలోనే కాంగ్రెస్ ఆధ్వర్యంలో సర్పంచ్‌లతో కలిసి సదస్సులు నిర్వహించి సీఎం కేసీఆర్ ఇంటిని ముట్టడిస్తామని పీసీసీ అధ్యక్షుడు నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

12/28/2017 - 00:30

హైదరాబాద్, డిసెంబర్ 27: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి మరో ఆరు నెలల్లో నాలుగేళ్లు పూర్తవుతుంది. కాని 9, 10 షెడ్యూల్స్‌లో ఆస్తులు, అప్పుల విభజన పూర్తి కాలేదు. 2018లోనైనా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అవగాహనకు వస్తే తప్ప ఈ రెండు షెడ్యూల్స్‌లోని సంస్థల విభజన ఒక కొలిక్కి వచ్చేటట్లు కనపడడం లేదు. ఈ రెండు షెడ్యూల్స్‌లోని భవనాలు, పరికరాలు, స్థిర, చరాస్తుల విలువ మదింపు పూర్తయింది.

12/28/2017 - 00:30

హైదరాబాద్, డిసెంబర్ 27: దేశంలోని జాతీయ వాణిజ్య బ్యాంకు చైర్మన్లుగా, వివిధ రాష్ట్రాలకు గవర్నర్లుగా బిసి వర్గాలకు చెందిన వారిని నియమించాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ప్రధానిని కోరుతూ లేఖ రాశారు. స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు గడచినా బిసిలకు అన్యాయం జరుగుతోందన్నారు. దేశ జనాభాలో బిసిలు 56 శాతం ఉన్నారన్నారు.

12/28/2017 - 00:29

హైదరాబాద్, డిసెంబర్ 27: తెలంగాణ రాష్ట్రంలో ఒక మెగావాట్ కంటే ఎక్కువ విద్యుత్‌ను వినియోగించే పరిశ్రమలు ఓపెన్ యాక్సిస్ ద్వారా విద్యుత్‌ను వాడితే కిలోవాట్‌కు 52 పైసలు సర్‌చార్జీని విధిస్తూ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఆదేశాలు జారీ చేసింది. ఈ చార్జీలు వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకు అమలులో ఉంటాయి.

12/28/2017 - 00:28

హైదరాబాద్, డిసెంబర్ 27: శీతాకాల విడిది కోసం నాలుగు రోజులుగా ఇక్కడ బస చేసిన రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ బుధవారం తిరిగి వెళ్లిపోయారు. హకీంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో రాష్టప్రతి విజయవాడకు బయలుదేరి వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి ఢిల్లీకి వెళ్తారు.

12/27/2017 - 23:48

హైదరాబాద్, డిసెంబర్ 27: వచ్చే జనవరిలో దావోస్‌లో జరుగునున్న ప్రపంచ వాణిజ్య సదస్సుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కె తారకరామారావుకు ఆహ్వానం అందింది. జనవరి 17, 18ల్లో దావోస్‌లో సదస్సు జరుగనుంది. కేంద్ర మంత్రులు, సీఎంలనే ఆహ్వానించే సంప్రదాయం ఉన్నా, మంత్రిని ఆహ్వానించడం అరుదుని నిర్వహకులు పేర్కొన్నారు.

12/27/2017 - 23:06

సంగారెడ్డి, డిసెంబర్ 27: ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన మల్లన్నసాగర్ రిజర్వాయర్ భూ సేకరణ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి అధికారులు ఇంకా మల్లగుల్లాలు పడుతూనే ఉన్నారు. 51 టీఎంసీల నీటి సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించడానికి అధికారులు ప్రణాళికలు రూపొందించిన విషయం విదితమే.

Pages