S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/25/2017 - 04:42

హైదరాబాద్, డిసెంబర్ 24: మెట్రో రైలు ఛార్జీలు పేద, మధ్య తరగతి ప్రయాణికులకు అందుబాటులో లేవని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ కె. లక్ష్మణ్ విమర్శించారు. ఆదివారం డాక్టర్ లక్ష్మణ్ తమ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి తార్నాక రైల్వే స్టేషన్ నుంచి అమీర్‌పేట స్టేషన్ వరకు మెట్రో రైలులో ప్రయాణించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ మెట్రో రైలు ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు.

12/25/2017 - 04:41

హైదరాబాద్, డిసెంబర్ 24: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో మణిశంకర్ అయ్యర్‌ను సస్పెండ్ చేసిన కాంగ్రెస్ రేవంత్‌రెడ్డిని ఎందుకు చేయడం లేదని టిఆర్‌ఎస్ ప్రశ్నించింది. టిఆర్‌ఎస్‌పైనా ముఖ్యమంత్రి కుటుంబంపైనా రేవంత్‌రెడ్డి చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, ఆలా వెంకటేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు.

12/25/2017 - 04:40

హైదరాబాద్, డిసెంబర్ 24: అంతర్జాతీయ రూట్‌కాలింగ్స్‌కు పాల్పడుతోన్న ముఠాగుట్టు రట్టయింది. హైదరాబాద్ పాతబస్తీలో రూట్‌కాలింగ్స్ ద్వారా విదేశాలకు తక్కువ ధరకే చాలా సేపు మాట్లాడించే ముఠాను సౌత్‌జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఏడుగురు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకోవడంతోపాటు వారి వద్ద నుంచి రూ. 4.80లక్షల నగదు, 6 ల్యాప్‌టాప్‌లు, 9 సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నారు.

12/25/2017 - 04:20

ఖైరతాబాద్/హైదరాబాద్, డిసెంబర్ 24: చంచల్‌గుడా జైలులో ఉన్న ఎంఆర్‌పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగను ఈ నెల 26వ తేదీలోగా విడుదల చేయకపోతే 27న తెలంగాణ బంద్ నిర్వహించాలని అఖిలపక్ష నేతలు నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న అప్రజాస్వామిక విధానాలపై సమిష్టిగా పోరాడుదామని రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు నిర్ణయించారు.

12/25/2017 - 04:18

హైదరాబాద్, డిసెంబర్ 24: తమ కూతురికి మంత్రి హరీశ్‌రావు పునర్జన్మను ప్రసాదించారని ఒక నిరుపేద కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. మంత్రి హరీశ్‌రావు అందించిన ఆర్థిక సహాయంతో చిన్నారి గుండెకు వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించారు. కోలుకున్న చిన్నారిని వెంటబెట్టుకొని ఆదివారం మినిస్టర్స్ క్వార్టర్స్‌కు వచ్చి మంత్రికి ఆ కుటుంబం కృతజ్ఞతలు తెలియచేసింది. మెదక్ జిల్లా తుఫ్రాన్‌కు చెందిన చంద్రం నిరుపేద.

12/25/2017 - 04:16

గోదావరిఖని, డిసెంబర్ 24: నవ మాసాలు మోసి కని పెంచిన తల్లిని గెంటేశాడో కొడుకు... చివరి మజిలీలో ఆదరించాల్సిన తనయుడు తనను కన్నపేగును పెంట కుప్పలపాలు చేశాడు... పర్యవసానంగా రెండు రోజులు చలిలో రోడ్డు పక్కన దుర్భర జీవితాన్ని గడిపిందా వృద్ధురాలు. జన్మనిచ్చిన తల్లికి పిడికెడు మెతుకులు పెట్టడం ఆ కొడుక్కి భారమైంద(టా)..!

12/25/2017 - 04:14

భువనగిరి, డిసెంబర్ 24: వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి సమీపంలో లారీని కారు ఢీకొన్న రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో సహాయక చర్యలు చేపడుతున్న హైవే అథారిటీ హెల్పర్ ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో మృతి చెందాడు. శనివారం రాత్రి చోటుచేసుకున్న ఈ సంఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం...

12/25/2017 - 04:12

సిద్దిపేట, డిసెంబర్ 24 : తెలంగాణ సర్కార్ చేసే ప్రతి పనిని కాంగ్రెస్ పార్టీ నేతలు అడ్డుకునే యత్నం చేస్తున్నారని, తాము చేయలేదని, ఇంకెవరూ చేయవద్దనే ధోరణిలా వారు వ్యవహరిస్తున్నారని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలకు మేలు చేసే ఉద్దేశం లేదన్నారు.

12/25/2017 - 01:28

హైదరాబాద్, డిసెంబర్ 24: కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగరంలో పోలీసులు పలు ఆంక్షలు విధించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు నగర పోలీస్ కమిషనర్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. పబ్‌లు, క్లబ్‌లు, బార్లు, ఈవెంట్ నిర్వాహకులు ముందస్తు అనుమతి తీసుకోవాలని, సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని సీపీ సూచించారు.

12/25/2017 - 01:28

హైదరాబాద్, డిసెంబర్ 24: ‘నీకు మేమున్నాం తోడుగా..’ అంటూ 108 అంబులెన్స్ ఉద్యోగులు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న తమ సహ ఉద్యోగికి భరోసా ఇచ్చి బాసటగా నిలిచారు. మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్‌లో 108 అంబులెన్స్ పైలట్ విజయ్ ప్రసాద్ ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురై స్పృహ కోల్పోవడంతో ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలంగాణ 108 ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ పల్లె ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Pages