S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/03/2017 - 05:06

నస్రుల్లాబాద్, డిసెంబర్ 2: ప్రము ఖ నృత్య దర్శకుడు ధర్మరాజు (90) శనివారం కామారెడ్డి జిల్లా నస్రుల్లా బాద్ మండలం అంకోల్ గ్రామంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన గత 40 ఏళ్లుగా సినీ పరి శ్రమలో విశిష్టమైన సేవ లందిస్తు న్నా రు. కొంతకాలం నుండి ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించి శనివారం ఆయన స్వర్గస్థులయ్యారని కుటుంబ సభ్యు లు తెలిపారు.

12/03/2017 - 05:06

సిరిసిల్ల, నవంబర్ 2: మిడ్ మానేరు ముంపు నిర్వాసితుడు ఒకరు పరిహారం కోసం అధికారుల చుట్టూ తిరిగి తిరిగి వేసారి అవి అందకుండానే మనస్తాపంతో గుండెపోటుకు గురై హఠాన్మరణం చెందాడు. కుటుంబ సభ్యు ల కథనం ప్రకారం... సిరిసి ల్ల రాజన్న జిల్లా తంగళ్ళపల్లి మండలం చీర్లవంచ గ్రామానికి చెందిన అవదూత బక్కయ్య (60)కు చెందిన ఇల్లు మధ్య మానేరులో ముంపు నకు గురవుతుండగా, 2008లో అవార్డు పాసై పరిహారం కోసం తిరుగుతున్నాడు.

12/03/2017 - 04:47

హైదరాబాద్, డిసెంబర్ 2: మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా హైదరాబాద్‌లో శనివారం ‘మిలాద్-ఏ-నబీ’ ర్యాలీ ప్రశాంతంగా జరిగింది. పాతబస్తీలో సున్నీ, సూఫీ ముస్లింల ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో లక్షలాది మంది ముస్లింలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన దాదాపు 35 స్వాగత వేదికల వద్ద సున్నీ, సూఫీ ముస్లిం ప్రముఖులు ప్రసంగించారు.

12/03/2017 - 04:44

హైదరాబాద్, డిసెంబర్ 2: భద్రాచలం వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ఈ నెల 19 నుండి 2017 జనవరి ఎనిమిది వరకు నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను దేవాదాయ మంత్రి అల్లోళ్ల ఇంద్రకరణ్‌రెడ్డి, రోడ్లుభవనాల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో శనివారం ఆవిష్కరించారు. డిసెంబర్ 28 న గోదావరి నదిలో తెప్పోత్సవం జరుగుతుంది. డిసెంబర్ 29 న ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది.

12/03/2017 - 04:43

హైదరాబాద్, డిసెంబర్ 2: హైదరాబాద్ మెట్రో నగరంలో మహిళల పట్ల మగాళ్లలో రోజురోజుకూ క్రూరత్వం పెరిగిపోతోంది. కట్టుకున్న భర్తలతోపాటు కుటుంబీకుల్లో సహితం క్రూరత్వం పెచ్చుమీరిపోతోంది. మహిళలను పలు హింసలకు గురిచేస్తున్న మగాళ్లపై సెక్షన్ 498ఏ ప్రయోగించినా ఫలితం లేకుండాపోతోంది.

12/03/2017 - 03:42

హైదరాబాద్, డిసెంబర్ 2: ఈ నెల 14 నుంచి మూడు రోజుల పాటు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలను నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.ప్రసాద్, ఆర్.వెంకట్రాములు తెలిపారు. రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపు 1000 మంది కూలీ సంఘం నేతలు ఈ సమావేశంలో పాల్గొంటున్నారని వెల్లడించారు. శనివారం నాడిక్కడ వారు మహాసభల గోడపత్రికను ఆవిష్కరించారు.

12/03/2017 - 03:41

హైదరాబాద్, డిసెంబర్ 3: ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏర్పాటై నూరేళ్లు గడిచిన సందర్భంగా వంద కలాలు, గళాలతో సాహిత్య వేదిక ఏర్పాటవుతోంది. ఆర్ట్స్‌కాలేజీ రూమ్‌నెంబర్ 57 లో ఈ నెల 5న ఉదయం 10 గంటలకు ఏర్పాటు చేస్తున్నామని ఓయూ సాహిత్య వేదిక ప్రకటించింది.

12/03/2017 - 03:41

హైదరాబాద్, డిసెంబర్ 2: అడ్వాన్స్‌డ్ జియో ఫిజికల్ రీసెర్చ్‌పై ఈ నెల 3 నుంచి 7వ తేదీ వరకు స్ధానిక సిఎస్‌ఐఆర్-ఎన్‌జిఆర్‌ఐలో జాతీయ స్థాయి సదస్సును నిర్వహిస్తున్నట్లు ఎన్‌జిఆర్‌ఐ తెలిపింది. భూకంపాల అధ్యయన శాస్త్రం (సిస్మోలజీ)కి సంబంధించి జియోఫిజిక్స్‌లో ఇటీవల వచ్చిన అడ్వాన్స్‌డ్ రీసెర్చ్‌పై 54వ సదస్సును నిర్వహిస్తున్నట్లు ఎన్‌జిఆర్‌ఐ తెలిపింది.

12/03/2017 - 03:40

హైదరాబాద్, డిసెంబర్ 2: గత 34 రోజులుగా చేస్తున్న సమ్మెను సెర్ఫ్ ఉద్యోగులు శనివారం విరమించారు. ఎంపి కె.కవిత ఆధ్వర్యంలో సెర్ప్ ఉద్యోగులు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో చర్చలు జరిపారు. ఇప్పటికే మంత్రి సెర్ప్ ఉద్యోగులతో రెండు దఫాలుగా చర్చలు నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా ప్రతిష్టంభన నెలకొన్న ఐదు డిమాండ్లపై మంత్రితో చర్చించారు.

12/03/2017 - 03:40

హైదరాబాద్, డిసెంబర్ 2: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం రాష్టస్థ్రాయి ఉత్సవాలను ఆదివారం రవీంద్రభారతిలో నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటల నుండి ప్రత్యేక కార్యక్రమాలు రాష్ట్రప్రభుత్వం నేతృత్వంలో ఏర్పాటవుతున్నాయి. పులువురు మంత్రులు, అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, దివ్యాంగులు ఇతరులు పెద్ద ఎత్తున హాజరవుతున్నారు.

Pages