S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/04/2017 - 03:45

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: జీవనోపాధికోసం గల్ఫ్ దేశాలను వలస వెళ్లి, అక్కడ చిక్కుకున్నవారిని తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. ఆదివారం విహెచ్ విలేఖరులతో మాట్లాడుతూ తెలుగు మహాసభలు ఘనంగా నిర్వహిస్తామని చెబుతున్న తెలంగాణ ప్రభుత్వం, ముందు గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్నవారి సమస్యలకు పరిష్కారం చూపాలని హితవు పలికారు.

12/04/2017 - 03:19

హైదరాబాద్, డిసెంబర్ 3: డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే ధ్యేయంగా మత్తుపదార్థాల వాడకంపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఇండి యా, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్సులో హైదరాబాద్‌కు చోటు దక్కడం పట్ల ఆయన సంతో షం వ్యక్తం చేశారు. ఆదివారం నెక్లెస్ రోడ్డులో అమెరికన్-తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో 5కె డ్రగ్స్ ఫ్రీ సిటీ రన్‌ను ఆయన ప్రారంభించారు.

12/04/2017 - 03:17

హుజూరాబాద్, డిసెంబర్ 3: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ఆదివారం వెలుగులో కి వచ్చిన ఔషధ ప్రయోగం సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. పట్టణంలోని ఒక గ్యాస్ గోదాం ఏరియాలో నివాసముండే ఎర్ర దేవిప్రసాద్ (30) అనే వ్యక్తి తనపై ఔషధ ప్రయోగం జరిగిందని వెల్లడించాడు. 2006 నుండి 2009 వరకు తాను హైదరాబాద్‌లో ఉన్నానని, అదే సమయంలో తనపై పలు కంపెనీలు ఔషధ ప్రయోగం చేసాయని అతను వెల్లడించాడు.

12/04/2017 - 03:15

హైదరాబాద్, డిసెంబర్ 3: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాశీలో తెలుగు ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. విశాఖ శ్రీశారదాపీఠం తమ శాఖ భవనాన్ని ఏర్పాటు చేసింది. శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి ఈ భవనాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ భవనంలో రోజూవారీ పూజలతో పాటు అన్నదానం కూడా ప్రారంభించారు. పీఠం నిర్వహకులు, ట్రస్టీలతో పాటు కాశీ (వారణాశి) లోని దండీ స్వాములకు యతిభిక్ష ప్రారంభించారు.

12/04/2017 - 03:14

ఖైరతాబాద్, డిసెంబర్ 3: తన ఆలోచన విధానాలకు అనుగుణంగా పట్టుదలతో పుస్తకాన్ని రచించిన ప్రొఫెసర్ సివి. నర్సింహారెడ్డి రచించిన పుస్తకం నేటి తరం జర్నలిస్టులకు దిక్సూచిలా నిలుస్తోందని పలువురు వక్తలు కొనియాడారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సివి నర్సింహారెడ్డి రచించిన ‘డిక్షనరీ ఆఫ్ కమ్యూనికేషన్స్ - పబ్లిక్ రిలేషన్స్ జర్నలిజం అండ్ మీడియా స్టడీస్’ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

12/04/2017 - 03:13

హైదరాబాద్, డిసెంబర్ 3: వచ్చే వారం అసెం బ్లీ సమావేశాల్లో పంచాయతీ రాజ్ ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టేందుకు రాష్ట్రప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ బిల్లుకు న్యాయ నిపుణులు తుది మెరుగులు దిద్దుతున్నారు. చట్టంలో లోపాలకు తావులేకుండా పటిష్టంగా రూపొందిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

12/04/2017 - 03:13

హైదరాబాద్, డిసెంబర్ 3: బిజి-3 (బోల్‌గార్డ్-3/బిటి-3) పత్తివిత్తనాల వ్యవహారంలో ఉక్కుపాదం మోపాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. దాంతో అప్రమత్తమైన రాష్ట్ర వ్యవసాయ శాఖ ఈ అంశంపై ప్రత్యేక శ్రద్ద చూపిస్తోంది.

12/04/2017 - 03:12

హైదరాబాద్, డిసెంబర్ 3: తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినందుకు ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ నెల 9న ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల నుంచి కృతజ్ఞతా యాత్రను ఎన్‌ఎస్‌యుఐ నిర్వహించనున్నట్లు టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆదివారం యాత్రకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు.

12/04/2017 - 03:11

హైదరాబాద్, డిసెంబర్ 3: రైతుల రుణ మాఫీ విషయంలో వడ్డీ మాఫీ పూర్తిగా జరిగేంత వరకూ తమ పోరాటం ఆగదని టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. రుణ మాఫీ విషయంలో వడ్డీ మాఫీ చేయకపోవడంతో రైతులు అనేక కష్టనష్టాలకు గురవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం గాంధీ భవన్‌లో డిసిసి అధ్యక్షులు, ముఖ్య నాయకుల సమావేశం జరిగింది.

12/03/2017 - 05:07

హైదరాబాద్, డిసెంబర్ 2: డిసెంబర్ నెల రేషన్ సరుకుల కోసం డిడిలు కట్టేందుకు గడువు ఇవ్వాలని రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయికోటి రాజు పౌరసరఫరాల మంత్రి ఈటల రాజేందర్, కమిషనర్ సివి ఆనంద్‌ను కోరారు. తమ సమస్యలను పరిష్కరించి న్యాయం చేయడంతో పాటు డిడిలు ఇంకా కట్టని వారికి కొంత సమయం ఇవ్వాలని కోరారు. ఇందుకు మంత్రి, కమిషనర్ సానుకూలంగా స్పందించారని రాజు తెలిపారు.

Pages