S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/03/2017 - 03:16

హైదరాబాద్, ఫిబ్రవరి 2: తెలంగాణ రాష్ట్రంలో విత్తనాభివృద్ధికి సహకరిస్తామని జర్మనీ ప్రతినిధులు హామీ ఇచ్చారు. ‘ఇండోజర్మన్ కోఆపరేషన్ ఆన్ సీడ్ సెక్టార్ డెవలప్‌మెంట్’ లో భాగంగా జర్మన్‌కు చెందిన అధికారిక బృందం గురువారం హైదరాబాద్ వచ్చింది. ఈ బృందంతో వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అధికారులు చర్చలు జరిపారు.

02/03/2017 - 03:10

హైదరాబాద్, ఫిబ్రవరి 2: ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన ఏక్ భారత్ శ్రేష్ట భారత్ పిలుపును పురస్కరించుకుని అహమ్మదాబాద్‌కు చెందిన ఐదుగురు మిత్రుల బృందం దేశంలో 29 రాష్ట్రాలను పర్యటించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఒన్ ఇండియా పేరిట యాత్ర నిర్వహిస్తున్న ఈ బృందం గురువారం హైదరాబాద్‌కు చేరుకుంది.

02/03/2017 - 03:08

విజయవాడ, ఫిబ్రవరి 2: పార్టీ సంస్థాగత ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేతలతో టిడిపి జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెలగపూడి సచివాలయంలో గురువారం సమావేశమయ్యారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు రమణ, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, తదితరులతో చర్చించారు.

02/02/2017 - 08:40

జూన్ 2న శంకుస్థాపన
మార్చి 4న కొత్త
మాస్టర్ ప్లాన్‌కు నోటిఫికేషన్
సచివాలయంలో సమీక్ష

02/02/2017 - 08:15

హైదరాబాద్, ఫిబ్రవరి 1: జయశంకర్ భూపాల్‌పల్లి జిల్లా మేడారంలో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం పరిపాలనాపరమైన అనుమతి ఇచ్చింది. ఇందుకోసం మొత్తం మూడు కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ గిరిజన సంక్షేమ ముఖ్యకార్యదర్శి సోమేష్ కుమార్ పేరుతో బుధవారం ఉత్తర్వులు జారీ అయాయి. ఈ విషయంలో గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

02/02/2017 - 08:15

హైదరాబాద్, ఫిబ్రవరి 1: ఉస్మానియా ఆసుపత్రిలో వైద్యపరికరాలు బాగానే పనిచేస్తున్నాయని, వైద్యులు బాగానే పనిచేస్తున్నారని రాష్టవ్రైద్యమంత్రి సి. లక్ష్మారెడ్డి తెలిపారు. ఉస్మానియా దవాఖానలోని న్యూరోసర్జరీ వార్డులో ఆక్సిజన్ సరిగా అందని కారణంగా నలుగురు చనిపోయారంటూ మీడియాలో జరిగిన ప్రచారానికి స్పందించిన మంత్రి ఈ అంశంపై విచారణకు ఆదేశించారు.

02/02/2017 - 08:14

బాసర, ఫిబ్రవరి 1: వసంత పంచమిని పురస్కరించుకుని సరస్వతి నామస్మరణతో నిర్మల్ జిల్లా పరిధిలోని బాసర క్షేత్రం మార్మోగిపోయంది. అమ్మవారి జన్మదినం మూల నక్షత్రాన్ని పురస్కరించుకుని బుధవారం సరస్వతిదేవిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. బుధవారం బాసర సరస్వతిదేవి అమ్మవార్లకు తెల్లవారుఝామున అభిషేక, అర్చన పూజలు నిర్వహించి ఐదు గంటలకు అక్షరస్వీకార పూజలు ప్రారంభించారు.

02/01/2017 - 04:40

మహబూబాబాద్, జనవరి 31: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ భగీరథ పనులను గడువులోగా పూర్తిచేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. మంగళవారం ముఖ్యమంత్రి మహ బూబాబాద్ జిల్లా మరిపెడ మండలం అబ్బాయిపాలెం శివారు ఎదుళ్లగుట్ట వద్ద జరుగుతున్న మిషన్ భగీరథ పనులను పరిశీలించారు.

02/01/2017 - 04:37

పాన్‌గల్, జనవరి 31: రాష్ట్రంలో ప్రఖ్యాతిగాంచిన పాన్‌గల్ ఈదమ్మ జాతర షిడే ఉత్సవాలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ జాతరకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలతో పాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మ వారిని దర్శించుకున్నారు.

02/01/2017 - 04:35

భద్రాచలం, జనవరి 31: వాగ్గేయకారుల్లో దిగ్గజం, రామభక్తతేజుడు శ్రీరామదాసు 384వ జయంతి ఉత్సవాలు మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పరమ భక్తాగ్రేసరుడు భక్తరామదాసుకు భక్తులు జేజేలు పలికారు. ముందుగా నగర సంకీర్తన చేశారు. రామదాసు చిత్రపటంతో శ్రీ రామదివ్యక్షేత్రంలోని రాజవీధుల్లో ఆయన కీర్తనలను ఆలపిస్తూ శోభాయాత్ర చేశారు.

Pages