S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/16/2016 - 08:21

హైదరాబాద్, అక్టోబర్ 15: కరీంనగర్ పట్టణాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. గుజరాత్‌లోని సబర్మతి ప్రాజెక్టును ఆదర్శంగా తీసుకుని కరీంనగర్‌లోని లోయర్ మానేర్ డ్యాంను (ఎల్‌ఎండి) అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. సబర్మతి ప్రాజెక్టును ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి బృందం పరిశీలించింది.

10/16/2016 - 07:57

హైదరాబాద్, అక్టోబర్ 15: షికాగో యూనివర్శిటీలో సెంటర్ ఫర్ ఇండియన్ స్టడీస్‌ను ఏర్పాటు చేయబోతున్నట్టు ఆ యూనివర్శిటీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ డేవిడ్ కానిస్, డిపార్టుమెంట్ ఆఫ్ మాథమెటిక్స్ చైర్మన్ రోహన్ అటలీ పేర్కొన్నారు. శనివారం వారు హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్శిటీని సందర్శించి వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఎస్ రామచంద్రంతో చర్చించారు.

10/16/2016 - 06:29

హైదరాబాద్, అక్టోబర్ 15: ప్రపంచంలోని వివిధ దేశాల స్టార్టప్‌లతో హైదరాబాద్ స్టార్టప్‌లను అనుసంధానించేందుకు సిలికాన్ వ్యాలీలో ఐటి మంత్రి కె తారక రామారావు టి-బ్రిడ్జి ప్రారంభించారు. ప్రపంచంలో పది అత్యున్నత స్టార్టప్ నగరాల్లో హైదరాబాద్ ఒకటిగా నిలుస్తుందన్న నమ్మకం ఉందంటూనే, అందుకు తగిన విధంగా కృషి చేస్తున్నట్టు కెటిఆర్ వ్యాఖ్యానించారు. ఉబర్, టై సిలికాన్‌తో కలిసి శనివారం టి-బ్రిడ్జి ఏర్పాటు చేశారు.

10/16/2016 - 06:28

హైదరాబాద్, అక్టోబర్ 15: కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రాలు అనతికాలంలోనే అభివృద్ధి కేంద్రాలుగా మారతాయని, అవి అస్తవ్యస్తంగా పెరగకుండా ప్రణాళికాబద్ధంగా ఉండేలా కార్యాచరణ రూపొందించాలని సిఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో శనివారం కొత్త జిల్లాల పాలనా వ్యవస్థపై సమీక్ష జరిపారు. సిఎస్ రాజీవ్ శర్మతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

10/16/2016 - 06:28

హైదరాబాద్, అక్టోబర్ 15: హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ఓ యువకుడు శనివారం మధ్యాహ్నం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేటను మెదక్ జిల్లాలో కలపాలంటూ ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. స్థానికులు మంటలార్పి చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. 90శాతం ఒళ్లుకాలిన యువకుడు చికిత్స పొందుతూ మృతి శనివారం సాయంత్రం మృతి చెందాడు.

10/15/2016 - 08:23

హైదరాబాద్, అక్టోబర్ 14: తెలంగాణ రాష్ట్ర సమితి, రాష్ట్ర ప్రభుత్వం మజ్లిస్ చేతిలో కీలు బొమ్మగా మారాయని బిజెపి శాసనసభాపక్షం నాయకుడు జి. కిషన్ రెడ్డి విమర్శించారు. వికారాబాద్‌ను అనంతగిరి జిల్లాగా, హైదరాబాద్‌ను భాగ్యనగరంగా ఎందుకు మార్చడం లేదని ఆయన శుక్రవారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కె.

10/15/2016 - 08:22

హైదరాబాద్, అక్టోబర్ 14: తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలల్లో ఫీజుల నియంత్రణపై సుప్రీంకోర్టు తీర్పును ఇటు ప్రభుత్వాలు, అటు పాఠశాలల యాజమాన్యాలు గాలికొదిలేశాయి. తమదైన శైలిలో లక్షల్లో ఫీజులు దండుకుంటున్నాయి. వార్షిక పరీక్షల సీజన్ దగ్గర పడటంతో బకాయిలు చెల్లించాల్సిందేనని ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు హుకుం జారీ చేశాయి.

10/15/2016 - 08:17

మహబూబ్‌నగర్, అక్టోబర్ 14: రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజన, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసినప్పటికిని పాలమూరులో మాత్రం ఆందోళనలు అగడం లేదు. నోటిఫికేషన్ గడువు ముగిసిందని ప్రభుత్వం చెబుతున్నప్పటికిని జనం మాత్రం తమ ఆకాంక్షలను పరిగణలోకి తీసుకోవాలంటూ నోటిపికేషన్ ముగిసిందని చెప్పడం కుదరదంటూ ప్రజలు రోడ్లపైకి వచ్చి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.

10/15/2016 - 08:15

తొగుట, అక్టోబర్ 14: బహుళ పంటలు పండే భూముల్లో ప్రాజెక్టులు నిర్మించవద్దనేది చట్టాల్లో ఉన్నా ప్రభుత్వం ఆ భూముల్లోనే ప్రాజెక్టు నిర్మించాలని సంకల్పించడం సరికాదని, ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే పశ్చిమ బెంగాల్‌లోని సింగూరు ఫలితాలే మల్లన్నసాగర్‌లో రావడం ఖాయమని టిజెఏసి చైర్మన్ కోదండరాం అన్నారు.

10/15/2016 - 08:15

చండూర్, అక్టోబర్ 14: నల్లగొండ జిల్లా పరిధిలోని గట్టుప్పల్ గ్రామాన్ని ముసాయిదాలో ప్రతిపాదించి తుది నోటిఫికేషన్‌లో తొలగించడంతో మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. దీంతో గట్టుప్పల్ గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలంటూ గ్రామస్థులు చేపట్టిన ఆందోళన శుక్రవారం మరింత ఉద్రిక్తతకు దారితీసింది.

Pages