S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/15/2016 - 08:14

భద్రాచలం, అక్టోబర్ 14: భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో స్వామివారి బంగారు ఆభరణాలు మాయమై, తిరిగి లభ్యమైన కేసులో విచారణను అధికారులు వేగవంతం చేశారు. ఈమేరకు విచారణాధికారి డిఈ రవీందర్ 13 మంది అర్చకులకు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరుకావాలని వారికి సూచించారు. శనివారం నుంచి రోజుకు ముగ్గురు అర్చకుల చొప్పున 13 మందిని విచారించనున్నారు.

10/15/2016 - 08:13

మేడ్చల్, అక్టోబర్ 14: మేడ్చల్ మండలం ఏల్లంపేట్ గ్రామంలో ఈనెల 12న అతిదారుణంగా హత్యకు గురైన చిన్నారి సాయిలక్ష్మి ప్రసన్న (7) హత్య కేసు మిస్టరీ వీడినట్లు తెలిసింది. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేసి నిర్దారణకు వచ్చినట్లు సమాచారం. రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేపిన చిన్నారి ప్రసన్న హత్యోదంతం మిస్టరీని పోలీసులు ఛేదించడంలో సఫలీకృతమైనట్లు తెలిసింది.

10/15/2016 - 07:56

హైదరాబాద్, అక్టోబర్ 14: రైతుల రుణ మాఫీ, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై పెద్ద ఎత్తున ఉద్యమించాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిర్ణయించింది. 20న మహబూబాబాద్‌లో రైతు గర్జన, 21న కళాశాలల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్ ఉద్యమాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. శుక్రవారం టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై కార్యాచరణ రూపొందించారు.

10/15/2016 - 07:55

హైదరాబాద్, అక్టోబర్ 14: కాంగ్రెస్ పార్టీ పాపిష్టి పాలన వల్లనే రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని, రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. వ్యవసాయాన్ని సర్వనాశనం చేసిన పార్టీ టిడిపి అని, రైతులపై కాల్పులు జరిపిన పార్టీ అని మండిపడ్డారు. బిజెపి నాయకులు కళ్లుండి చూడలేని కబోదుల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

10/15/2016 - 06:51

నర్సంపేట, అక్టోబర్ 14: వరంగల్ జిల్లాలో మొదటి విడత మిషన్ కాకతీయ చెరువు పనుల్లో భారీగా అవినీతి బయటపడింది. చెరువు పనులు చేపట్టకుండానే కాంట్రాక్టర్లు బిల్లులు చేయించుకున్నారన్న ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. దీంతో రాష్టస్థ్రాయి ట్రాస్క్ఫోర్స్ బృందం జిల్లాలోని పలు చెరువులు పరిశీలించింది.

10/15/2016 - 06:49

హైదరాబాద్, అక్టోబర్ 14: అమెరికాకు చెందిన పలు ప్రముఖ ఫార్మా కంపెనీలు తెలంగాణలో యూనిట్లు నెలకొల్పి కార్యకలాపాలు నిర్వహించేందుకు ఆసక్తి చూపించాయి. అమెరికా పర్యటనలో ఉన్న ఐటి, పరిశ్రమల మంత్రి కెటిఆర్ పలు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అమెరికాలోని పలు ఫార్మా కంపెనీలతో ఐటి మంత్రి కెటిఆర్ సమావేశమయ్యారు.

10/14/2016 - 04:15

హైదరాబాద్, అక్టోబర్ 13: కువైట్‌లో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపి కవిత బతుకమ్మ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ జాగృతి కువైట్ శాఖ కువైట్‌లోని అబాసియా ప్రాంతంలో నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాలతో అక్కడి తెలంగాణ వారు పండుగ వాతావరణంతో ఉత్సాహంగా గడిపారు. బతుకమ్మ పాటలు పాడుతూ బతుకమ్మలను పేర్చారు.

10/14/2016 - 04:13

హైదరాబాద్, అక్టోబర్ 13: తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణతో ప్రభుత్వ కార్యాలయాల బోర్డులు మార్పు చేయాల్సి వస్తోంది. జిల్లా కలెక్టర్, ఎస్‌పి తదితర కార్యాలయాలకు యుద్ధ ప్రాతిపదికన కొత్తబోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ, డివిజన్, మండల, గ్రామ స్థాయిలలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలపై ఉన్న బోర్డులను పూర్తిగా మార్చాల్సి వస్తోంది.

10/14/2016 - 04:11

హైదరాబాద్, అక్టోబర్ 13: ఆంధ్రప్రదేశ్ కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయానికి కొత్త వైస్ చాన్సలర్‌గా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలోని ప్లాంట్ సైనె్సస్ ప్రొఫెసర్ అత్తిపల్లి రామచంద్రారెడ్డి నియమితులయ్యారు. గుంటూరులో జన్మించిన రామచంద్రారెడ్డి నెల్లూరు జిల్లాకు చెందిన వారు.

10/14/2016 - 04:10

హైదరాబాద్, అక్టోబర్ 13: తెలంగాణ ఆర్థిక పరిస్థితి బావుందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు చెబుతున్నా, ఆయన మాటలకు, క్షేత్ర స్థాయిలో పనులకు పొంతన లేకుండా పోయిందని టిడిపి నేత రావుల చంద్రశేఖరరెడ్డి ఆరోపించారు. లక్షా 30వేల కోట్ల రూపాయలు బడ్జెట్‌లో పెట్టినా, కనీసం 15 శాతం నిధులను కూడా నేటి వరకూ ఖర్చు చేయలేదని అన్నారు. ఆర్థిక పరిస్థితి అంత బావుంటే అప్పులపై మోజు ఎందుకు పెరిగిందని అన్నారు.

Pages