S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/14/2016 - 04:09

హైదరాబాద్, అక్టోబర్ 13: పులిచింతల జలాశయం నీటిని ఎత్తిపోతల ద్వారా సేద్యానికి వాడుకునేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టుకును త్వరగా పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. పులిచింతల తీరంలో నల్లగొండ జిల్లాలో ప్రతిపాదించిన చౌటపల్లి ఎత్తిపోతల (ఎల్‌ఐ స్కీం) పథకానికి 54.08 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

10/14/2016 - 04:09

హైదరాబాద్, అక్టోబర్ 13: ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించి జరిమానాలు విధించబడిన వాహనదారులకు 50 శాతం రాయితీ కల్పిస్తూ నిర్వహించిన లోక్ అదాలత్‌కు మంచి స్పందన లభించింది. దసరా సందర్భంగా ఇటీవల జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నిర్వహించిన లోక్ అదాలత్‌కు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారు భారీగా తరలివచ్చారు.

10/14/2016 - 04:08

హైదరాబాద్, అక్టోబర్ 13: రంగారెడ్డి జిల్లాలో గ్రీన్ ఫార్మసీ ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక వౌలిక సదుపాయాల సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన 341 ఎకరాల భూమిపై హైకోర్టు స్టే మంజూరు చేసింది. ఈ భూమిని రంగారెడ్డి జిల్లా మీర్‌ఖాన్‌పేటలో టిఎస్‌ఐఐసి ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది.

10/14/2016 - 04:04

మేడ్చల్, అక్టోబర్ 13: మేడ్చల్ మండలంలోని ఎల్లంపేట్ గ్రామంలో బుధవారం మధ్యాహ్నం జరిగిన ఓ బాలిక దారుణ హత్య మిస్టరీ ఇంకా తేలలేదు. స్థానిక పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేసినా ఇప్పటి దాకా వారి చేతికి ఎలాంటి ఆధారాలు లభించలేదు.

10/14/2016 - 04:04

హైదరాబాద్, అక్టోబర్ 13: ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించే క్రమంలో భాగంగా ట్రయల్ రన్‌గా ఏసి మినీ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు టిఎస్‌ఆర్టీసి చైర్మన్ సోమారపు సత్యనారాయణ వెల్లడించారు. తెలంగాణలో త్వరలో ‘వజ్ర’ పేరుతో ఏసి బస్సులు నడుపనున్నట్టు ఆయన చెప్పారు. ఈ బస్సులు హైదరాబాద్ నుంచి వరంగల్, నిజామాబాద్‌కు గుర్తించిన రూట్లలో రాకపోకలు సాగిస్తాయన్నారు. హైదరాబాద్ నుంచి వరంగల్‌కు రూ.

10/14/2016 - 03:30

వరంగల్, అక్టోబర్ 13: రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఓరుగల్లు గడ్డనుండే పతనం ప్రారంభమవుతుందని టిడిపి శాసనసభపక్షనేత, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి అన్నారు. గురువారం వరంగల్ అర్భన్ కలెక్టరేట్ ముందు నిర్వహించిన రైతు ధర్నాలో ఆయన మాట్లాడారు.

10/14/2016 - 03:28

హైదరాబాద్, అక్టోబర్ 13: రబీ పంటకు అవసరమైన సాగునీటి ప్రణాళికను పగడ్బందీగా ఖరారు చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆ శాఖ అధికారులను ఆదేశించారు. ఆన్ గోయింగ్ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చి పూర్తిచేయాలని అన్నారు. జలసౌధలో ఇరిగేషన్ అధికారులతో మంత్రి గురువారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.

10/14/2016 - 03:25

హైదరాబాద్, అక్టోబర్ 13: రైతుల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని ఆరోపిస్తూ బిజెపి రాష్ట్ర నాయకులు సచివాలయంలో సమతా బ్లాక్ వద్ద గురువారం ఆందోళన చేశారు. సమతా బ్లాక్ వద్ద బిజెపి నాయకులు ధర్నాకు దిగడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

,
10/14/2016 - 03:33

జనగామ టౌన్, అక్టోబర్ 13: పోలీసుస్టేషన్ నుంచి దూకి ఓ బిజెపి నాయకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన గురువారం రాత్రి జనగామ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం... జనగామ మండలం చౌడారం గ్రామానికి చెందిన గండి నాగరాజు కేసు నిమిత్తం సిఐ శ్రీనివాస్ ఆదేశం మేరకు పోలీసుస్టేషన్ వెళ్లాడు.

10/14/2016 - 03:20

హైదరాబాద్, అక్టోబర్ 13: ఉపవాస దీక్షతో మృతి చెందిన చిన్నారి ఆరాధన (13) వ్యవహారంపై లోకాయుక్తలో బాలల హక్కుల సంఘం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు లోకాయుక్త గురువారం ఐపిసి సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి ఈనెల 24వ, తేదీలోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని నార్త్‌జోన్ డిసిపిని ఆదేశించింది.
ఏం జరిగిందంటే..

Pages