S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/14/2016 - 03:18

కరీంనగర్, అక్టోబర్ 13: కొత్త జిల్లాల ఏర్పాటు ద్వారా ప్రజలకు ఏం చేయబోతున్నారో శే్వతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొత్త జిల్లాలకు తెలంగాణ మహనీయుల పేర్లు పెడతామని చెప్పి ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.

10/14/2016 - 03:16

బాల్కొండ, అక్టోబర్ 13: రాష్ట్రంలోని భారీ ప్రాజెక్టుల్లో ఒకటైన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుండి వరదనీటి విడదల కొనసాగుతోంది. రిజర్వాయర్ ఎగువ ప్రాంతమైన గోదావరి బేసిన్‌లో కురిసిన వర్షాలతో పాటు మహా ప్రాజెక్టుల మిగులు జలాలు తోడు కావడంతో రిజర్వాయర్‌లోకి 60 వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోందని ప్రాజెక్టు ఎఇ మహేందర్ తెలిపారు.

10/14/2016 - 03:14

వెల్దుర్తి, అక్టోబర్ 13: లారీ బైక్‌ను ఢీకొన్న సంఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఈ సంఘటన మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని బొమ్మారం రైల్వే గేట్ సమీపంలో గల 44వ జాతీయ రహదారిపై గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. తూప్రాన్ డిఎస్‌పి వెంకటేశ్వర్లు, తూప్రాన్ సిఐ రమెశ్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం... వెల్దుర్తి మండలంలోని మానెపల్లి గ్రామానికి చెందిన భార్యాభర్తలు దాసరి గౌరమ్మ (32), దాసరి పోచయ్య (38).

10/14/2016 - 03:13

హైదరాబాద్, అక్టోబర్ 13: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కొత్త జిల్లాల ఏర్పాటును తాము స్వాగతిస్తున్నా పోస్టింగ్‌లలో మాత్రం తెలంగాణ ఎన్‌జిఓలకు అన్యాయం జరిగిందని తెలంగాణ ఎన్‌జిఓ యూనియన్ ఇంటర్మీడియట్ కమిషనరేట్ యూనిట్ అధ్యక్షుడు వి కృష్ణ స్వామి, కార్యదర్శి ఎన్ జె ఫ్రాన్సిస్‌లు పేర్కొన్నారు.

10/14/2016 - 03:13

హైదరాబాద్, అక్టోబర్ 13: తెలంగాణ ఆర్థిక స్థితి బాగుంటే రైతులకు రుణమాఫీ కింద బకాయిలను ఎందుకు చెల్లించలేకపోతున్నారని, ఉద్యోగులకు పిఆర్‌సి బకాయిలను ఎందుకు ఇవ్వలేకపోతున్నారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్రప్రభుత్వాన్ని నిలదీసింది.

10/13/2016 - 07:13

మేడ్చల్, అక్టోబర్ 12: ముక్కుపచ్చలారని ఏడేళ్ల చిన్నారిని దుండుగులు గొంతు, ఎడమ చేతి మణికట్టు నరాలను కోసి అతి దారుణంగా హతమార్చిన సంఘటన మేడ్చల్ మండలంలోని ఎల్లంపేట్‌లో చోటు చేసుకుంది. పండుగ రోజు జరిగిన ఈ దారుణ ఘటనతో గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.

10/13/2016 - 07:13

ఆదిలాబాద్/నల్లగొండ/కరీంనగర్/వరంగల్, అక్టోబర్ 12: కొత్త జిల్లాల్లో దసరా రోజు నుండి పరిపాలన ఆరంభమవ్వగా తొలి రోజు నూతన కలెక్టరేట్‌ల ప్రారంభోత్సవాల సందర్భంగా నిర్వహించిన సభల్లో లబ్ధిదారులకు సంక్షేమ పథకాల మంజూరుతో పాలనకు శ్రీకారం చుట్టారు. దసరా పండుగ రోజున కొత్త జిల్లాలలో పదవీ బాధ్యతలు చేపట్టిన కలెక్టర్లు తమ పని విధానం ఎలా ఉంటుందో అధికారులకు, సిబ్బందికి స్పష్టం చేసారు.

10/13/2016 - 07:07

సిద్దిపేటను ఆరంభించిన సిఎం కెసిఆర్

మెదక్‌కు అసెంబ్లీ డిప్యూటి స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి అంకురార్పణ

10/13/2016 - 06:23

హైదరాబాద్, అక్టోబర్ 12: నగరంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ బుధవారం బంజారా నృత్యం, చిందు-యక్షగానం, ఒగ్గుకథలు, పులివేషాలు, బతుకమ్మ ఆటపాటలతో మార్మోగింది. తెలంగాణ రకరకాల వంటలతో ఘుమఘుమలాడింది. కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి అధ్వర్యంలో అలయ్-బలయ్ కార్యక్రమం జోరుగా, హుషారుగా జరిగింది. రాజకీయాలకు అతీతంగా బిజెపి, టిఆర్‌ఎస్, కాంగ్రెస్, టిడిపి నాయకులు హాజరయ్యారు.

10/13/2016 - 06:11

హైదరాబాద్, అక్టోబర్ 12: తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్‌పిలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. జిల్లాల పునర్వ్యవస్థీరకణ మంగళవారం జరగడంతో ఆయా జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశనం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ నేతృత్వంలో ఈ సమావేశం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.

Pages