S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/13/2016 - 06:09

హైదరాబాద్, అక్టోబర్ 12: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు వారసుడెవరు? అన్న అంశం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం సిఎస్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రాజీవ్ శర్మ వచ్చే నవంబర్ చివరి వరకు పదవిలో ఉంటారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం బాధ్యతలు కొత్త సారథికి అప్పగించక తప్పదు.

10/13/2016 - 06:04

హైదరాబాద్/ సంగారెడ్డి, అక్టోబర్ 12: రెండున్నరేళ్ల క్రితం ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ స్వరూపం విజయదశమి రోజున సంపూర్ణంగా మారిపోయింది. విస్తృత ప్రాతిపదికన అధికార వికేంద్రీకరణ దిశగా తెలంగాణ తొలి అడుగు వేసింది. ఒకేరోజు, ఒకే ముహూర్తానికి ఒక్క క్షణం అటూ ఇటూ కాకుండా 21 కొత్త జిల్లాలు ప్రారంభమయ్యాయి.

10/11/2016 - 06:55

కొత్త జిల్లాల ప్రారంభానికి మంత్రులు ఖరారు
4 జిల్లాల్లో సిఎం, స్పీకర్, డిప్యూటీ స్పీకర్,
మండలి చైర్మన్, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్

హైదరాబాద్, అక్టోబర్ 10: దసరా పర్వదినాన మంగళవారం నుంచి 21 కొత్త జిల్లాలను ప్రారంభించే బాధ్యతను మంత్రులకు అప్పగిస్తూ ప్రభుత్వం సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త జిల్లాలను ప్రారంభించనున్న మంత్రుల జాబితా ఇదీ.

10/11/2016 - 06:54

ములుగు, అక్టోబర్ 10: ముఖ్యమంత్రి కెసిఆర్ సోమవారం సాయంత్రం మెదక్ జిల్లా ములుగు మండలం మర్కుక్ గ్రామంలోని మహేందర్‌రెడ్డి అనే చిరకాల మిత్రుని ఇంటికి వెళ్లి అతిథి మర్యాదలు స్వీకరించారు. ఎంతో ఆతృతగా ఆప్త మిత్రుని కోసం ఎదురుచూసిన మహేందర్‌రెడ్డి, ఆయన కుటుంబసభ్యులు సిఎం రాకతో ఎదురేగి పుష్పగుచ్చాన్నిచ్చి సాదరంగా స్వాగతం పలికారు.

10/11/2016 - 06:53

వెంకటాపురం, అక్టోబర్ 10: చిన్నారి చెల్లెలిని కాపాడడం కోసం అక్క.. ఆ ఇద్దరి రక్షించుకోవాలని కన్నతల్లి పడిన ఆరాటంలో అంతా మృత్యువు వికటాట్టహాసానికి బలైన విషాద సంఘటన ఇది. పండుగ ముందు రోజు సోమవారం ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలం సూరవీడుకాలనీలో విషాదం చోటు చేసుకుంది. బట్టలు ఉతకడానికి పిల్లలతో కలిసి వెళ్లిన ఓ తల్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి బిడ్డలతో సహా మృత్యువు పాలయింది.

10/11/2016 - 06:53

మహబూబ్‌నగర్, అక్టోబర్ 10: గద్వాల నియోజకవర్గం గట్టు మండలంలో నందినె్న మండలాన్ని కొత్త మండలాల జాబితాలో లేకపోవడంతో గ్రామస్థులు అగ్రహోదగ్రులయ్యారు. సోమవారం రాత్రి నందినె్న మండలాన్ని ప్రభుత్వం ప్రకటించకపోడంతో ఆగ్రహించిన ప్రజలు రోడ్డుపైకి వచ్చి ఆందోళనకు దిగారు. గద్వాల డిపోకు చెందిన రెండు ఆర్టీసీ బస్సులకు జనం నిప్పంటించారు. దీంతో రెండు ఆర్టీసీ బస్సులు ప్రజల ఆగ్రహనికి ఆహుతయ్యాయి.

10/11/2016 - 06:52

వరంగల్(కల్చరల్), అక్టోబర్ 10: వరంగల్ మహానగరంలోని భక్తులకు కొంగుబంగారంలా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళీ దేవాలయ క్షేత్రంలో దేవీ శరన్నవరాత్రోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. సోమవారం మహా నవమిని పురస్కరించుకొని ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలను జరిపారు. ఇందులో భాగంగా ఉదయం 4 గంటలకు సుప్రభాత సేవ, నిత్యాహ్నికం, చతుస్థానార్చన ఉషఃకాలార్చనలతో నవమి పూజలను ప్రారంభించారు.

10/11/2016 - 06:51

హైదరాబాద్, అక్టోబర్ 10: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో జోనల్ వ్యవస్థను రద్దు చేసినట్టు ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ జివి.రమణారావు తెలిపారు. ఇది దీపావళి నుంచి అమల్లోకి వస్తందని, దీంతో ఆర్టీసీకి కొంత మేర వ్యయభారం తగ్గుతుందని చెప్పారు.

10/11/2016 - 06:50

హైదరాబాద్, అక్టోబర్ 10: దసరా ఉత్సవాలకు తెలంగాణలోని ఆలయాలు ముస్తాబయ్యాయి. దేవీ నవరాత్రి ఉత్సవాలను దాదాపు అన్ని ప్రధాన దేవాలయాలతో పాటు చిన్న దేవాలయాల్లో కూడా నిర్వహిస్తున్నారు. మంగళవారం దసరా (విజయదశమి) ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రంగురంగుల విద్యుత్ దీపాలు, పందిళ్ల ఏర్పాటు పూర్తయింది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలన్నింటికీ మంగళవారం సెలవు కావడంతో దేవాలయాల్లో భక్తుల రద్దీ అత్యధికంగా ఉంటుంది.

10/11/2016 - 06:30

హైదరాబాద్, అక్టోబర్ 10: భారీ వాహనాల ఉత్పత్తిలో ప్రపంచంలో మూడో స్థానంలోవున్న అశోక్ లేలాండ్ కంపెనీ తెలంగాణలో భారీ యూనిట్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. రూ.500 కోట్ల పెట్టుబడితో ప్రత్యక్షంగా వెయ్యిమందికి, పరోక్షంగా వందలాది మందికి ఉపాధి కల్పించబోయే యూనిట్ ఏర్పాటుకు అశోక్ లేలాండ్ కంపెనీ సోమవారం తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది.

Pages