S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/05/2016 - 11:57

నల్గొండ: ఓ మానసికరోగి దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో మంగళవారం ఉదయం బీభత్సం సృష్టించాడు. ఆస్పత్రి వార్డులో ఫర్నిచర్, ఇతర సామగ్రిని ధ్వంసం చేశాడు. దీంతో చుట్టుపక్కలవారు జోక్యం చేసుకుని మానసికరోగిని బంధించడంతో పరిస్థితి సద్దుమణిగింది.

07/05/2016 - 07:20

హైదరాబాద్, జూలై 4: న్యాయాధికారుల ఆందోళన విరమింపజేసేందుకు గవర్నర్ చేసిన ప్రయత్నం ఫలించలేదు. న్యాయమైన తమ డిమాండ్లు ఆమోదించేంత వరకూ ఆందోళన కొనసాగుతుందని న్యాయవాదులు తేల్చి చెప్పారు. ఆందోళన విరమించాలని, న్యాయమైన కోర్కెలకు పరిష్కారం లభిస్తుందని గవర్నర్ నరసింహాన్ న్యాయవాదులకు సూచించారు. దేశంలో తొలిసారిగా తెలంగాణలో న్యాయాధికారులు ఆందోళనకు దిగారు.

07/05/2016 - 07:11

హైదరాబాద్, జూలై 4 : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ఆసుపత్రులు, కార్పోరేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తూ యాజమాన్యాలు చేస్తున్న ఆందోళన విరమించారు. ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు, సంఘాల ప్రతినిధులతో రాష్ట్ర వైద్య మంత్రి సి. లక్ష్మారెడ్డి సోమవారం సాయంత్రం జరిపిన చర్చలు ఫలించాయి.

07/05/2016 - 07:09

హైదరాబాద్, జూలై 4: కొత్తరాష్ట్రం అయినా తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకెళ్తోందని, ప్రపంచంలోని అనేక దేశాలు పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణను ఎంపిక చేసుకుంటున్నారని ఐటి, పరిశ్రమల మంత్రి కె తారక రామారావు అన్నారు. హైదరాబాద్ పార్క్ హయత్‌లో సోమవారం ఫిక్కీ జాతీయ కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశంలో రాష్ట్రం సాధించిన పారిశ్రామిక ప్రగతిని కెటిఆర్ వివరించారు.

07/05/2016 - 07:06

హైదరాబాద్, జూలై 4: హరితహారం క్రతువును 8న సిఎం కెసిఆర్ నల్లగొండ జిల్లాలో ప్రారంభించనున్నారు. అదేరోజు అన్ని జిల్లాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే రహదారిపై నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద సిఎం మొక్కలు నాటి కార్యక్రమం ప్రారంభిస్తారని సిఎంవో వెల్లడించింది.

07/05/2016 - 05:50

హైదరాబాద్, జూలై 4: మల్లన్నసాగర్ నిర్వాసిత గ్రామం వేములగట్టులో మంగళవారం తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటి (టిజాక్) అధ్యర్యంలో ‘మల్లన్నసాగర్ ప్రాజెక్టు-ప్రతిపాదన-చర్చ’ అనే అంశంపై ఈ సదస్సునస ఏర్పాటు చేసింది.

07/05/2016 - 05:49

తొగుట, జూలై 4: బంగారు తెలంగాణలో మల్లన్నసాగర్ భూనిర్వాసితులను భాగస్వామ్యం చేయకుండా అభివృద్ధి పేరుతో గ్రామాలను ధ్వంసం చేయడం సరికాదని, ప్రజలను ఆగమాగం చేసి పెద్ద ప్రాజెక్టులు నిర్మించడం ఎందుకని ప్రొఫెసర్ హరగోపాల్ ప్రశ్నించారు.

07/05/2016 - 05:48

రామాయంపేట, జూలై 4: తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు పోటీపడుతున్నాయని నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట నీటిపారుదల శాఖ అతిథి గృహంలో సోమవారం డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, జడ్పీ చైర్మెన్ రాజమణి మురళీయాదవ్‌తో కలిసి విలేఖరులతో మాట్లాడారు. ప్రాజెక్ట్‌లను అడ్డుకోవడం అభివృద్ధిని ఆటంకపరచడమే అన్నారు.

07/05/2016 - 05:48

హైదరాబాద్, జూలై 4: నార్త్‌జోన్ పరిధిలోని బొల్లారంలో ఓ మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం, హత్య కేసులో నిందితుడు అనిల్‌కుమార్‌ను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలోని కళాసిగూడకు చెందిన మైనర్ బాలిక సరితను అదే ప్రాంతానికి చెందిన అనిల్‌కుమార్ మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం జరిపాడు.

07/05/2016 - 05:47

కోరుట్ల, జూలై 4: కరీంనగర్ జిల్లా మేడిపల్లి మండలం గోవిందారం గ్రామ పరిసరాల్లో ఆదివారం మోత్కురావుపేట గ్రామానికి చెందిన ఎల్లపల్లి వౌనిక (19) అనే వివాహిత హత్య కేసులో అమె తండ్రి భూమల్ల నడిపి మల్లయ్య హంతకుడని కోరుట్ల సిఐ రాజశేఖర్‌రాజు వెల్లడించారు. తన కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో హంతకుడు, హత్యకు గల కారణాలను ఆయన వెల్లడించారు.

Pages