S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/31/2016 - 15:42

హైదరాబాద్: ఎన్ని సమస్యలు, సవాళ్లు ఎదురైనా తెలంగాణలో కోటి ఎకరాలకు నీరు అందించి తీరుతామని సిఎం కెసిఆర్ గురువారం అసెంబ్లీలో స్పష్టం చేశారు. జల విధానం, సాగునీటి ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌పై ఆయన సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. సమైక్య పాలనలో తెలంగాణను నిర్లక్ష్యం చేయడం వల్లే నేడు కరవు పరిస్థితులు నెలకొన్నాయన్నారు. గోదావరి నదిలో 954 క్యూసెక్కుల నీటిని వాడుకుని తీరుతామన్నారు.

03/31/2016 - 15:41

హైదరాబాద్: నగర శివారులోని ఔటర్ రింగ్‌రోడ్డుపై మీర్జాగూడ వద్ద గురువారం ఓ జీపును లారీ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మరణించారు.

03/31/2016 - 15:39

హైదరాబాద్: ప్రైవేటు వ్యక్తుల నుంచి భారీ వడ్డీలకు అప్పులు తీసుకుని కష్టాల పాలవుతున్న రైతులను ఆదుకునేందుకు ఉద్దేశించిన రుణ విముక్తి కమిషన్ ఏర్పాటు బిల్లును తెలంగాణ అసెంబ్లీ గురువారం ఆమోదించింది. ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి మొహముద్ అలీ బిల్లును ప్రవేశపెట్టగా మూజువాణి ఓటుతో సభ ఆమోదించింది. ఈ బిల్లును విపక్షాలు స్వాగతించాయి.

03/31/2016 - 15:37

హైదరాబాద్: గత పాలకుల నిర్లక్ష్య వైఖరి వల్లే నేడు తెలంగాణలో సాగునీటికి ఇబ్బందులు ఏర్పడ్డాయని సిఎం కెసిఆర్ గురువారం అసెంబ్లీ సమావేశంలో అన్నారు. మహారాష్ట్ర, కర్నాటక అనుసరిస్తున్న విధానాల వల్ల తెలంగాణకు సమృద్ధిగా నీరు అందడం లేదన్నారు. మహారాష్టల్రో గోదావరిపై ఇబ్బడి ముబ్బడిగా ప్రాజెక్టులను నిర్మిస్తున్నందున తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలకు అన్యాయం జరుగుతోందన్నారు.

03/31/2016 - 12:26

హైదరాబాద్: మహారాష్ట్ర నుంచి కర్నాటక వరకూ ద్రోణి ప్రభావం, జార్ఖండ్‌లో ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణ, ఉత్తర కోస్తాలో గురువారం తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణ జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం పడే సూచనలున్నాయి. రాయలసీమ, దక్షిణ కోస్తాలో మాత్రం వాతావరణం పొడిగా ఉంటూ వేసవి ప్రతాపం కొనసాగుతోంది.

03/31/2016 - 12:25

హైదరాబాద్: నగరంలో 14 చోట్ల చైన్ స్నాచింగ్‌లకు పాల్పడి తప్పించుకుతిరుగుతున్న ఓ దొంగను క్రైమ్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అతడి నుంచి అరకిలో మేరకు బంగారు నగలను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.

03/31/2016 - 12:24

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ చివరి రోజు సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. నీటి పారుదల ప్రాజెక్టుల రీ-డిజైనింగ్‌పై సిఎం కెసిఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సమాయత్తమయ్యారు. ఇందుకోసం శాసససభ, శాసనమండలిలో భారీ స్ట్రీన్‌లను ఏర్పాటు చేశారు. కాగా, సంప్రదాయాలకు భిన్నంగా అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహణ పట్ల కాంగ్రెస్ సభ్యులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.

03/31/2016 - 12:23

హైదరాబాద్: అరకు ఎంపి గీత భర్త రామకోటేశ్వర రావును తన కుమారుడు సాయి యాదవ్ కిడ్నాప్ చేయలేదని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ గురువారం ఉదయం విలేఖరులకు తెలిపారు. ఒక స్థలానికి సంబంధించి బకాయిపడ్డ మొత్తాన్ని చెల్లించాలని అడిగేందుకే రామకోటేశ్వర రావును తన కుమారుడు, వ్యాపార భాగస్వాములు హోటల్‌కు పిలిపించారని వివరించారు. హోటల్‌కు పిలిపిస్తే కిడ్నాప్ చేసినట్లా అని ఆయన ప్రశ్నించారు.

03/31/2016 - 12:22

మహబూబ్‌నగర్: అయిజ మండలం పులికల్ గ్రామంలో మాజీ మహిళా సర్పంచ్ భర్త శేఖర్‌ను గురువారం తెల్లవారు జామున దుండగులు కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. తన ఇంట్లో రెండో అంతస్థులో నిద్రిస్తున్న ఇతడిని దుండగులు హత్య చేసి గోడ దూకి పరారయ్యారు. శేఖర్ ఫైనాన్స్ వ్యాపారం చేసేవాడని, ఆర్థిక లావాదేవీల కారణంగానే హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

03/31/2016 - 12:22

కరీంనగర్: నాలుగు నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకోగా, ఇంతలోనే భర్త ఆత్మహత్య చేసుకోవడం రామగుండం మండలం లింగాపూర్‌లో సంచలనం కలిగించింది. వరకట్నం కోసం వేధిస్తున్నారంటూ భార్య కేసు పెట్టడంతో తీవ్రంగా మనస్తాపం చెందిన తోట శరత్ అనే వ్యక్తి బుధవారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు.

Pages