S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/01/2020 - 06:19

హైదరాబాద్, ఫిబ్రవరి 29: సీఏఏ, ఎన్‌పీఆర్‌లను అమలుచేస్తే మొదట నష్టపోయేది ఆదివాసీలేనని ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ చైర్మన్ మిడియం బాబూరావు, మాజీ ఎంపీ జితిన్ చౌదరి పేర్కొన్నారు. ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ సమావేశాలు శనివారం నాడు ప్రారంభం అయ్యాయి .

03/01/2020 - 06:18

హైదరాబాద్, ఫిబ్రవరి 29: పంట రుణాల మాఫీపై స్పష్టత లేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు ఆరు వేల మంది రైతులు మరణించినట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. రైతు బీమా రైతు బంధు రైతులందరికీ అందడంలేదన్నారు. రైతు బంధు పథకం మూడు ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే అందుతున్నట్లు తెలుస్తుందన్నారు.

03/01/2020 - 06:18

హైదరాబాద్, ఫిబ్రవరి 29: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలను ఇప్పట్లో పెంచే యోచన లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్‌రెడ్డి స్పష్టం చేశారని బీజేపీ అధికార ప్రతినిధి డాక్టర్ ఎస్ ప్రకాశ్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలను తప్పుదోవపట్టించేలా టీఆర్‌ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.

03/01/2020 - 06:17

హైదరాబాద్, ఫిబ్రవరి 29: ఢిల్లీ అల్లర్లలో తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీలపై బీజేపీ ప్రభుత్వం నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని టీపీసీసీ అధికార ప్రతినిధి జీ నిరంజన్ అన్నారు. బీజేపీ దిగుజారుడు రాజకీయాలకు పాల్పడడం దారుణమన్నారు. నిందితులైన తమ నేతలను వెనకేసుకుని రావడానికి కాంగ్రెస్ నేతలపై ఎదురుదాడికి దిగిన నీచ మనస్తత్వం బీజేపీదేనన్నారు.

03/01/2020 - 05:50

హైదరాబాద్, ఫిబ్రవరి 29: రాష్ట్రంలోని మూడు వ్యవసాయ మార్కెట్ కమిటీల పాలవర్గాల కాలపరిమితిని మరో ఆరు నెలల పాటు పొడిగించారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ కార్యదర్శి బీ జనార్దన్‌రెడ్డి పేరుతో శనివారం జీఓలు జారీ అయ్యాయి.

03/01/2020 - 05:48

హైదరాబాద్, ఫిబ్రవరి 29: పదో తరగతి పరీక్షలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్టు విద్యాశాఖ స్పెషల్ సీఎస్ చిత్రారామచంద్రన్ తెలిపారు. శనివారం నాడు ఆమె ఇంటర్మీడియట్ బోర్డు నుండి పాఠశాల విద్యాశాఖకు చెందిన వివిధ జిల్లాల డిఈఓలు ఇతర సీనియర్ అధికారులతో వీడియోకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సమీక్షకు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్, పరీక్షల డైరెక్టర్ ఎ సత్యనారాయణ రెడ్డి హాజరయ్యారు.

03/01/2020 - 04:11

హైదరాబాద్, ఫిబ్రవరి 29: ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత పీవీ సింధుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శనివారం రాజ్‌భవన్‌లో విందు ఇచ్చారు. సింధుకు గౌరవపూర్వకంగా తమిళిసై ఈ విందు ఏర్పాటు చేశారు. సింధుతోపాటు ఆమె తల్లిదండ్రులు కూడా ఈ విందులో పాల్గొన్నారు. రాజ్‌భవన్‌లో మార్చి 4న నిర్వహిస్తున్న మహిళా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొనాలంటూ సింధుకు గవర్నర్ ఆహ్వాన పత్రం అందించారు.

03/01/2020 - 04:07

హైదరాబాద్: రాష్ట్రంలో రాష్ట్రపతి ఉత్తర్వులకు సంబంధించి వివిధ శాఖలు తమ తమ శాఖల వివరాలను 2020 మార్చి 4 లోగా జీఏడీకి సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. బూర్గుల రామకృష్ణారావు (బీఆర్‌కే) భవన్‌లో శనివారం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.

03/01/2020 - 04:04

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది జిల్లాల్లో జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్)లన్నీ గులాబీపరం అయ్యాయి. అన్ని జిల్లాల్లోనూ డీసీసీబీ, డీసీఎంఎస్‌లకు టీఆర్‌ఎస్‌కు చెందిన వారే అధ్యక్షులుగా, ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు.

03/01/2020 - 04:02

హైదరాబాద్: విద్యుత్ మీటర్ రీడింగ్‌లో మానవ ప్రమేయం లేకుండా ఖచ్చితమైన రీడింగ్ కోసం ఐఆర్‌డీఏ పోర్ట్ ఆధారిత సాం కేతికను ఉపయోగిస్తున్నామని దక్షిణ తెలంగాణ విద్యు త్ పంపిణీ సంస్థ సీఎండీ రఘమారెడ్డి తెలిపారు. నూత న విధానంలో ప్రస్తుతం 60 లక్షల మీటర్లుఉన్నాయన్నారు. మరో 30

Pages