S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/28/2020 - 03:55

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. రాష్ట్ర సచివాలయంలో పనిచేస్తున్న అన్ని శాఖల కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శనివారం సమావేశం అవుతున్నారు.

02/28/2020 - 03:52

హైదరాబాద్ , ఫిబ్రవరి 27: తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేసినట్టు విద్యాశాఖ స్పెషల్ సీఎస్ చిత్రా రామచంద్రన్ తెలిపారు. మార్చి 4వ తేదీ నుండి 18వ తేదీ వరకూ జరిగే ఇంటర్ పరీక్షలకు 4,80,516 మంది ఫస్టియర్, 4,85,323 మంది సెకండియర్ విద్యార్థులు హాజరవుతున్నారని వీరి కోసం 1339 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్నారు.

02/28/2020 - 03:34

హైదరాబాద్, ఫిబ్రవరి 27: ఢిల్లీలో అల్లర్లకు బీజేపీ అనుసరించిన మొండి వైఖరి కారణమని, ఇప్పటికైనా పౌరసత్వ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని పీసీసీ మాజీ నేత వీ హనుమంతరావు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. పౌరసత్వసవరణ చట్టం వల్ల దేశంలో మతతత్వ శక్తులు పేట్రేగుతున్నాయన్నారు. దేశ రాజధానిలో మూడు రోజుల పాటు అల్లర్లు జరిగినా పోలీసులు చోద్యం చూస్తున్నారన్నారు.

02/28/2020 - 03:33

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తెలంగాణ ఒలింపిక్ సంఘం (టీఓఏ) ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన కూసునురు జగదీశ్వర్ యాదవ్‌ను గురువారం పలు సంఘాల నేతలు ఘనంగా సత్కరించారు. లాల్‌బహదూర్ స్టేడియంలోని తెలంగాణ ఒలింపిక్ భవన్‌లో తెలంగాణ రాష్ట్ర ఆఫీషియల్, ప్రోఫేషనల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంబీ.కృష్ణ యాదవ్, ప్రధాన కార్యదర్శి చోళ ఓంప్రకాష్ యాదవ్‌లతో కూడిన ప్రతినిధుల బృందం జగ్దీశ్వర్ యాదవ్‌ను సత్కరించారు.

02/28/2020 - 03:32

హైదరాబాద్: మార్చి మొదటి వారంలో ప్రారంభం అవుతుందని భావిస్తున్న శాసనసభ బడ్జెట్ సమావేశాలపై గురువారం ప్రగతి భవన్‌లో ఆర్థిక శాఖ అధికారులతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సమీక్ష జరిపారు. వివిధ శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలను సమీక్షిస్తూ, ప్రభుత్వ ప్రాధాన్యతలను అధికారులకు సీఎం వివరించారు. బడ్జెట్ రూపకల్పనపై దిశా నిర్దేశం చేశారు.

02/28/2020 - 03:31

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంక్ (టీఎస్‌సీఏబీ) అధ్యక్ష, ఉపాధ్యక్షస్థానాలకు మార్చి 3 లేదా 4 న ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్టు తెలిసింది. డీసీసీబీ అధ్యక్షులంతా టీఎస్‌సీఏబీలో డైరెక్టర్లుగా ఉంటారు. రాష్టవ్య్రాప్తంగా ప్రస్తుతం 9 డీసీసీబీలు ఉన్నాయి. డీసీసీబీ డైరెక్టర్ల పోస్టులకు వాస్తవంగా శుక్రవారం ఎన్నికలు జరగాల్సి ఉంది.

02/28/2020 - 03:21

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తెలంగాణ ఎమ్సెట్ పరీక్షకు భారీ స్పందన లభిస్తోంది. తొలి వారంలోనే 20వేల దరఖాస్తులు వచ్చాయి. ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు ఇంకా నెల రోజుల గడువు ఉంది , 27వ తేదీ సాయంత్రం వరకూ 19740 దరఖాస్తులు వచ్చాయని కన్వీనర్ డాక్టర్ ఏ గోవర్థన్ తెలిపారు. 27వ తేదీ రాత్రికి ఈ సంఖ్య 20 వేలకు చేరింది. ఇందులో ఇంజనీరింగ్ స్ట్రీంకు 12,450, అగ్రికల్చర్ స్ట్రీంకు 7290 దరఖాస్తులు వచ్చాయి.

02/28/2020 - 01:09

కాటారం: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు, పెద్దపల్లి జిల్లా మంథని శాసనసభ్యుడు దుద్దిళ్ల శ్రీ్ధర్‌బాబు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) పార్టీలో చేరనున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఆయన చేరికకు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తోంది.

02/28/2020 - 01:06

హైదరాబాద్, ఫిబ్రవరి 27: కేంద్ర ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ లాంటి రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కోరా రు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్ హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సందర్భంగా గురువారం ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు.

02/28/2020 - 01:04

హైదరాబాద్, ఫిబ్రవరి 27: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మానవత్వాన్ని చాటుకున్న ఘటన హైదరాబాద్‌లో గురువారం చోటు చేసుకుంది. టోలిచౌక్‌లో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొని సీఎం కేసీఆర్ తిరిగి వెళ్తున్నారు. ఆ సమయంలో అదృష్టం బాగుండి సీఎం కంట పడితే తన సమస్య తీరుతుందన్న ఆశతో వికలాంగుడైన ఓ వృద్ధుడు దారి పక్కన వినతి పత్రంతో నిల్చున్నాడు. సరిగ్గా అతను ఊహించినట్టే జరిగింది.

Pages