S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/04/2020 - 04:14

హైదరాబాద్, మార్చి 3: షాయరే తెలంగాణ ముఖ్దూమ్ మొహియుద్దీన్ పేరిట నెలకొల్పిన సిటీ కాలేజీ మఖ్దూమ్ మొహియుద్దీన్ నేషనల్ అవార్డును ప్రసిద్ధ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజకు ఇవ్వనున్నట్టు కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ విప్లవ్‌దత్ శుక్లా, డాక్టర్ యాకూబ్ తెలిపారు. అవార్డును బుధవారం నాడు ప్రభుత్వ సిటీ కాలేజీలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో అందజేస్తామని చెప్పారు.

03/04/2020 - 04:12

హైదరాబాద్, మార్చి 3: ఎయిడెడ్ కాలేజీలను ప్రభుత్వ పరం చేయాలని ఎబీవీపీ మంగళవారం నాడు డిమాండ్ చేసింది. ప్రైవేటు వ్యక్తుల నుండి వాటిని ప్రభుత్వం పరం చేయాలని జీవో 35ను రద్దుచేయాలని, ఎయిడెడ్ కాలేజీల భూములను కబ్జాదారుల నుండి కాపాడాలని కాలేజీయేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. దాంతో పోలీసులు ముందు జాగ్రత్తగా వారిని అడ్డుకుని, ఏబీవీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు.

03/04/2020 - 04:10

హైదరాబాద్, మార్చి 3: గీత వృత్తిదారులు ఆత్మగౌరవంతో జీవించాలని సీఎం కేసీఆర్ నీరా పాలసీని ప్రవేశపెట్టారని, ప్రమాదవశాత్తు మరణించిన గీత కార్మికులకు చెల్లించే ఎక్స్‌గ్రేషియాను రూ. రెండు లక్షల నుండి రూ. ఐదు లక్షల వరకు పెంచి చేయూతనిచ్చారని క్రీడలు, ఎక్సైజ్, సాంస్కృతిక శాఖ మంత్రి వీ.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

03/04/2020 - 04:10

హైదరాబాద్, మార్చి 3: మరో ఐదు రోజుల్లో రాష్ట్రప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతున్న తరుణంలో సంక్షేమానికి పెద్ద పీట వేసే దిశగా రాష్ట్రప్రభుత్వం అడుగులు వేస్తోంది. పేదలు, బడుగు బలహీనవర్గాలకు గతంలో మాదిరిగా సంక్షేమ ఫలాలు అందిస్తూనే, పన్నుల వసూళ్లు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటాను తెచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా కదులుతోంది.

03/04/2020 - 04:09

హైదరాబాద్, మార్చి 3: కరోనా తొలి పాజిటివ్ కేసును గుర్తించిన కేరళలో వ్యాధి ప్రబలకుండా తీసుకున్న చర్యలను అధ్యయనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అక్కడి వైద్య బృందాన్ని పంపించి అక్కడ కరోనా నివారణకు ఏ విధమైన చర్యలు చేపట్టింది అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.

03/04/2020 - 04:08

హైదరాబాద్, మార్చి 3: పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖలపై శాఖలవారీగా సమగ్ర నివేదికలను రూపొందించాలని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఆదేశించారు. పశుసంవర్థక, మత్స్య, పాడిపరిశ్రమాభివృద్ధి శాఖల కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన అనితా రాజేంద్ర మంగళవారం మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ను ఆయన ఛాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.

03/04/2020 - 01:21

హైదరాబాద్, మార్చి 3: అధునాతన సౌకర్యాలు, వసతులతో బంజారాహిల్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను హోం మంత్రి మహ్మద్ మహమూద్ అలీ మంగళవారం సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పోలీస్ శాఖలో వినూత్న సంస్కరణలు
తీసుకువచ్చారన్నారు. బంజారాహిల్స్‌లో రూ.350 కోట్లతో

03/04/2020 - 01:16

హైదరాబాద్: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పంట రుణ మాఫీకి రాష్ట్ర ప్రభు త్వం కసరత్తు చేస్తోంది. ఒక్కో రైతు కుటుంబానికి లక్ష రూపాయల వరకు పంట రుణ మాఫీ చేయనున్నట్టు శాసనసభ ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్‌ఎస్ పార్టీ హామీ ఇచ్చింది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం గత హయాంలో కూడా ఇదే మాదిరిగా ఒక్కో రైతు కుటుంబానికి రూ.లక్ష చొప్పున పంట రుణాన్ని మాఫీ చేసిన విష యం తెలిసిందే.

03/04/2020 - 01:16

హైదరాబాద్, మార్చి 3: కరోనా వైరస్ నివారణకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 100 కోట్ల రూపాయలు కేటాయించారని వైద్య ఆరోగ్య మంత్రి ఈట ల రాజేందర్ తెలిపారు. ఈటలతో పాటు మంత్రు లు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావుతో ప్రభుత్వం కరోనా నివారణ కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ఇక్కడి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో మంగళవారం సమావేశమై ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా చర్చించింది.

03/03/2020 - 05:13

హైదరాబాద్, మార్చి 2: మహానగరంలో ట్రాఫిక్ సమస్యను తగ్గి, సిగ్నల్ రహితమైన ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్‌ఆర్‌డీపీ పనులను మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే. తారకరామారావు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Pages