S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/27/2020 - 06:00

హైదరాబాద్, ఫిబ్రవరి 26: జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు, జిల్లా కో-అపరేటీవ్ మార్కెటింగ్ సొసైటీలు అన్నింటినీ టీఆర్‌ఎస్ కైవసం చేసుకోవడం లాంఛనప్రాయమే. 29న జరుగనున్న డీసీసీబీ, డీసీఎంఎస్‌ల చైర్మన్లు, వైస్ చైర్మన్లు, పాలక వర్గాలకు ఎన్నికలు జరుగనున్నాయి. డీసీసీబీ, డీసీఎంఎస్‌ల్లో అన్ని డైరెక్టర్ పదవులు ఏకగ్రీవం కావడంతో చైర్మన్, వైస్ చైర్మన్, పాలకవర్గాలు అన్నీ టీఆర్‌ఎస్‌కే దక్కనున్నాయి.

02/27/2020 - 05:59

ఖమ్మం, ఫిబ్రవరి 26: ఏళ్ల తరబడి చాలీచాలని వేతనాలతో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధిహామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ల భవిష్యత్ అయోమయంలో పడింది. భారత రాజ్యాంగం ద్వారా 2005, ఆగస్టు 25వ తేదీన జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టం అమలులోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అమలు చేస్తున్న చట్టం కాలక్రమేణా ఉపాధిహామీ పథకంగా మారింది.

,
02/27/2020 - 05:58

వరంగల్, ఫిబ్రవరి 26: త్వరలోనే కొత్త మున్సిపల్ చట్టం రాబోతుందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం జనగామ జిల్లా కేంద్రంలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఆయన ఆకస్మికంగా పాల్గొన్నారు. 75 గజాల స్థలం ఉన్నట్టయతే కేవలం రూపాయి మాత్రమే మున్సిపాలిటీలో చెల్లించి భవనాన్ని నిర్మించుకోవచ్చునని అన్నారు.

02/27/2020 - 05:41

మిర్యాలగూడ టౌన్, ఫిబ్రవరి 26: ఏఐసీసీకి రాహుల్‌గాంధీయే అధ్యక్షుడు కావాలని, అవుతారని అదే తన కోరిక, తన అభిప్రాయం అని నల్లగొండ ఎంపీ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్‌భవన్‌లో విలేఖరులతో మాట్లాడుతూ రాహుల్‌గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడు కావాలని విధేయుల ఫోరం కోరిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లగా పైవిధంగా స్పందించారు.

02/27/2020 - 05:39

నిర్మల్, ఫిబ్రవరి 26: తెలంగాణ రాష్ట్రంలోని జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. బుధవారం నిర్మల్ పట్టణంలోని టీఎన్‌జీవోస్ భవనంలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు టీయూడబ్ల్యూజే 143 రాష్ట్ర మహాసభల సన్నాహక కమిటీ సమావేశం నిర్వహించారు.

,
02/27/2020 - 04:53

ఆదిలాబాద్, ఫిబ్రవరి26: ఆదిలాబాద్ జిల్లా సరిహద్దులోని పెన్‌గంగా నదీ పరీవాహక గ్రామాల్లో పెద్ద పులుల సంచారం అలజడి రేపుతోంది. ఇటీవలే తాంసి, భీంపూర్ మండలాల్లో పెద్దపులి సంచరిస్తూ ఎనిమిది పశువులపై దాడి చేసి గాయపర్చిన ఘటన మర్చిపోకముందే మంగళవారం రాత్రి జైనథ్ మండలం నిరాల ప్రధాన రహదారిపై రోడ్డు దాటుతుండగా ఓ యువకుడు కారులో నుండి ఫొటో తీయడం కలకలం రేపింది.

02/27/2020 - 05:46

భువనగిరి, ఫిబ్రవరి 26: రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల అభివృద్ధికోసం ప్రవేశపెట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని అమలుచేసిన మున్సిపాలిటీలకే నిధులు ఇవ్వనున్నట్టు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు వెల్లడించారు. పట్టణ ప్రగతి పురోగతిని తెలుసుకునేందుకు చేపట్టిన పర్యటనలో భాగంగా భువనగిరి మున్సిపాలిటీని బుధవారం మంత్రి సందర్శించారు.

02/27/2020 - 04:37

హైదరాబాద్, ఫిబ్రవరి 26: దేవాదాయ, ధర్మాదాయ శాఖ పరిధిలోని ఆలయాలు, ఛారిటబుల్ సంస్థల భూములను ప్రైవేట్ సంస్థలకు లీజుకు ఇస్తున్నారు. దేవాదాయ భూములు ఆక్రమణలకు గురికాకూడదన్నది ప్రధాన ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. అలాగే ఖాళీ స్థలాల వల్ల ఎలాంటి ఆదాయం లేని చోట వ్యాపార సంస్థలకు ఈ భూములను లీజుకు ఇవ్వడం వల్ల ఆలయాలకు ఆదాయం కూడా సమకూరుతోంది.

02/27/2020 - 02:32

యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 26: తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన యా దాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం ఉదయం కొండపైన బాలాలయంలో పాంచరాత్రాగమశాస్త్రానుసారం వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. స్వామివారి నూ తన ఆలయం నిర్మాణంలో ఉన్నందున బ్రహ్మోత్సవాలను బాల ఆలయంలోనే నిర్వహిస్తున్నారు.

02/27/2020 - 02:15

హైదరాబాద్: రైతుబంధు పథకానికి నియమావళి రూపొందించే అవకాశంపై ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటివరకు ఎలాంటి షరతులు లేకుండా రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్నారు. అయితే, ఇపుడు ఐదెకరాలలోపు ఉన్నవారికి ఎలాంటి ఆలోచన లేకుండా ఈ పథకాన్ని అమలు చేస్తారని స్పష్టమైంది. 5 నుండి 10 ఎకరాల మధ్య ఉన్న వారికి అమలు చేయడంలో ఆలోచన చేస్తున్నారు.

Pages