S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/03/2020 - 05:11

హైదరాబాద్, మార్చి 2: సీఏఏపై దేశవ్యాప్తంగా కొన్ని రాజకీయ పార్టీలు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నాయని, దానికి మూలం కూడా హైదరాబాద్‌లోనే ఉందని ఎమ్మెల్సీ ఎన్ రామచందర్‌రావు పేర్కొన్నారు. సోమవారం ఆయన పార్టీ కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ ఆనాడు ఐపీఎస్ కృష్ణ ప్రసాద్‌ను హతమార్చిన నిందితులు పాతబస్తీలోనే దొరికారని చెప్పారు.

03/03/2020 - 05:09

హైదరాబాద్, మార్చి 2: నల్లగొండ జిల్లాలో వచ్చే ఖరీఫ్ సీజన్‌లో ఎస్సారెస్పీ చివరి ఆయకట్టుకు సాగునీటిని అందించడానికి కాలువల మరమ్మతులు చేపట్టాలని సాగునీటి శాఖ అధికారులను విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌లో మంత్రి చాంబర్‌లో అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

03/03/2020 - 05:07

హైదరాబాద్, మార్చి 2: గుట్టుచప్పుడు కాకుండా బాలకార్మికులతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్న గాజుల పరిశ్రమ యజమానులను అరెస్టు చేసి దాదాపు 14 మంది బాల కార్మికులకు పోలీసులు విముక్తి కలిగించారు. తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ తమకు తెలియని చోట కొద్దిపాటి డబ్బుల కోసం ఈ చిన్నారులు పడే బాధలు వర్ణనాతీతం.

03/03/2020 - 04:58

హైదరాబాద్, మార్చి 2: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పట్టించుకోరా అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నిలదీశారు. ఈ మేరకు ఆయన సీఎంకు ఒక లేఖ రాశారు. ప్రభుత్వ ఉద్యోగులకు వెంటనే పీఆర్‌సీ అమలు చేయాలని, కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం వర్తింప చేయాలని అన్నారు. ఉద్యోగ విరమణ వయస్సు 60 ఏళ్లకు పెంచాలని తమ్మినేని కోరారు.

03/03/2020 - 04:57

హైదరాబాద్, మార్చి 2: తెలంగాణలో అమలు జరుగుతున్న వివిధ రంగాల అభివృద్ధి పనులపై మాజీ చీఫ్ సెక్రటరీ మోహనకందాతో రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్‌కుమార్ భేటీ అయ్యారు. రాష్ట్ర సీఎం కేసీఆర్ చేపట్టిన ప్రాధాన్య రంగాల్లో వృద్ధిపై సమాలోచనలు చేశారు. ముఖ్యంగా వ్యవసాయం, సహకార, నీటిపారుదల, విద్యుత్ రంగాల్లో పురోగతిపై వారు చర్చించారు.

03/03/2020 - 04:55

హైదరాబాద్, మార్చి 2: రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పండించిన పంటను అమ్ముకోవడానికి రైతన్నలు నానా తంటాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో వ్యవసాయ రంగం నిర్లక్ష్యానికి గురి అవుతుందని విమర్శించారు.

03/03/2020 - 04:54

హైదరాబాద్, మార్చి 2: సింగరేణితో పాటు దక్షిణాది రాష్ట్రాల విద్యుత్ అవసరాలు తీర్చుతున్న సింగరేణి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం (మంచిర్యాల జైపూర్) మరోసారి తన ప్రతిభను చాటిచెప్పింది. ఫిబ్రవరి నెల విద్యుత్ ఉత్పత్తి పరిశీలిస్తే వందశాతం (ప్లాంట్ లోడ్ ప్యాక్టర్) విద్యుత్ ఉత్పత్తి జరిగింది. దీంతో స్టేషన్‌లో పీఎల్‌ఎఫ్ 100.18 శాతం ఉత్పత్తి సాధించింది.

03/03/2020 - 04:54

హైదరాబాద్, మార్చి 2: రానున్న అసెంబ్లీ బడ్జెట్ బడ్జెట్ సమావేశాల్లో అనేక ప్రజాసమస్యలు చర్చించాల్సి ఉందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై ఆయన ఒక వినతిపత్రాన్ని అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచారికి అందజేశారు.

03/03/2020 - 04:49

హైదరాబాద్, మార్చి 2: గిరిజనుల సంక్షేమం కోసం కేటాయించిన నిధులను సకాలంలో ఎందుకు ఖర్చు చేయడం లేదని అధికారులపై రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్ర్తి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మండిపడ్డారు.

03/03/2020 - 00:51

హైదరాబాద్, మార్చి 2: హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యక్తికి ‘కరోనా’ సోకినట్టు నిర్థారణ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. ఎట్టిపరిస్థితిలోనూ కరోనా వైరస్ ఇతరులకు విస్తరించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఇందుకోసం నిధులు ఎంత అవసరమున్నా విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి ప్రకటించారు.

Pages