S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/26/2020 - 05:10

హైదరాబాద్, ఫిబ్రవరి 25: సమాచార హక్కు చట్టం కమిషనర్లుగా ఇటీవల నియామకమైన ఐదుగురు కమిషనర్లు మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. కొత్త కమిషనర్లు కట్టా శేఖర్‌రెడ్డి, మైద నారాయణరెడ్డి, గగులోతు శంకర్‌నాయక్, సయ్యద్ ఖలీలుల్లా, మహ్మద్ అమీర్ హుస్సేన్‌తో చీఫ్ కమిషనర్ రాజా సదారామ్ ప్రమాణ స్వీకారం చేయించారు.

,
02/26/2020 - 05:08

హైదరాబాద్, ఫిబ్రవరి 25: భారత్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటనను నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తతతకు దారితీసింది. వామపక్షాలకు చెందిన సీనియర్ నేతలు అందర్నీ పోలీసులు అదుపులోకి తీసుకుని వేర్వేరు పోలీసు స్టేషన్లకు తరలించారు.

,
02/26/2020 - 05:04

దేవరకొండ, ఫిబ్రవరి 25: నూతన మున్సిపల్ యాక్ట్ ప్రకారం కౌన్సిలర్లు, అధికారులు పని చేయకపోతే పదవులను కోల్పోవడం ఖాయమని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. అలాగే వార్డు కమిటీ సభ్యులు వార్డులో నెలకొన్న సమస్యలపై నెలకోసారి వార్డులో సమావేశమై చర్చించాలని సూచించారు. వాటిని కౌన్సిలర్లు మున్సిపల్ సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకెళ్ళి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని దిశా నిర్దేశం చేశారు.

02/26/2020 - 04:24

హైదరాబాద్, ఫిబ్రవరి 25: పరిస్థితులు, మార్కెట్ అవసరాలు, మారుతున్న అభిరుచులకు అనుగుణంగా కాలేజీల యాజమాన్యాలు తమ సాంకేతిక విద్యాసంస్థలను నవీకరించుకోవాలని, విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంచి ఉపాధికి సన్నద్ధంగా తయారుచేయాలని జేఎన్‌టీయూహెచ్ ఇన్‌చార్జి వైస్ చాన్సలర్ జయేష్ రంజన్ పేర్కొన్నారు.

02/26/2020 - 04:22

హైదరాబాద్, ఫిబ్రవరి 25: జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీల (డీసీఎంఎస్) పాలక వర్గాలన్నీ టీఆర్‌ఎస్ ఖాతాలోకి వెళ్లేందుకు అవకాశాలు ఏర్పడ్డాయి. మంగళవారం డీసీసీబీ, డీసీఎంఎస్‌ల డైరెక్టర్ల పోస్టులకు నామినేషన్ల పర్వం కొనసాగింది. చాలా వరకు ఏకగ్రీవంగానే ఎన్నికలు జరిగాయి. చాలా జిల్లాల్లో ఎస్‌సీ, ఎస్‌టీలకు కేటాయించిన డైరెక్టర్ల స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు.

02/26/2020 - 04:21

హైదరాబాద్, ఫిబ్రవరి 25: వేలాది కాలేజీలు, లక్షలాది మందికి డిగ్రీలు చేతికి ఇస్తున్నామనే క్రెడిట్ కంటే ఎంత మందికి ఉపాధి కల్పించగలుగుతున్నామో, మిగిలిన వారికి ఎందుకు ఉపాధి కల్పించలేకపోతున్నామో అందరూ ఆలోచించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు అనుగుణంగా రాష్ట్రంలో సాంకేతిక విద్యకు సరికొత్త రూపాన్ని ఇచ్చేందుకు గత కొద్ది నెలలుగా ఉన్నత విద్యా మండలి కసరత్తు చేస్తోంది.

02/26/2020 - 04:21

హైదరాబాద్, ఫిబ్రవరి 25: దేశంలో ఐఐటీలు, ఐఐఎంలూ కలిసి పర్యావరణ వ్యవస్థ వృద్ధికి బృహత్తర కాన్సార్టియంను ఏర్పాటు చేశాయి. ఇన్నోవేషన్ వెంచరింగ్ అండ్ ఎంటర్‌ప్రిన్యూయర్ షిప్ ఇన్ ఇండియా నెట్‌వర్కు -ఐవీన్ పేరిట ఈ కాన్సార్టియంను ప్రారంభించాయి. పరిశోధనలను ప్రోత్సహించడం, ఆవిష్కరణ, వ్యవస్థాపకత చుట్టూ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం లక్ష్యాలుగా ఈ నెట్ వర్కు పనిచేస్తుంది.

02/26/2020 - 04:20

హైదరాబాద్, ఫిబ్రవరి 25: తెలంగాణ రాష్ట్రంలో కంది పంట వేసిన రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. మార్కెట్లో కందుల ధరలు తగ్గాయని, కనీస మద్దతు ధర లభించడం లేదంటూ రైతులు ఆందోళన చేస్తుండటంతో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకున్నది. రైతులనుండి కందులను సేకరించేందుకు ఇప్పటికే మార్క్‌ఫెడ్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

02/26/2020 - 04:02

మోత్కూర్, ఫిబ్రవరి 25: మోత్కూర్ మార్కెట్ యార్డ్‌లో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రంలో మంగళవారం రెండో రోజు కూడా కందుల కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆగ్రహంతో ఆందోళన వ్యక్తం చేస్తూ భువనగిరి మెయిన్ రోడ్డుపై రాస్తారోకోకు దిగారు. పట్టణ ప్రగతిలో పాల్గొని వెళ్తున్న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్ వాహనాన్ని రైతులు అడ్డుకున్నారు.

02/26/2020 - 04:00

జగదేవ్‌పూర్, ఫిబ్రవరి 25: గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందని గఢా అధికారి ముత్యంరెడ్డి పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలంలోని వెంకటాపూర్(బీజీ), మాందాపూర్‌లో గడపగడపకు గఢా కార్యక్రమంలో భాగంగా గ్రామాలలో పర్యటించారు. ఈసందర్భంగా ప్రతి ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల అమలు వాటి సద్వినియోగంపై గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు.

Pages