S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/03/2020 - 00:48

హైదరాబాద్, మార్చి 2: తమది రైతు పక్షపాత ప్రభుత్వమని, సీఎం కేసీఆర్ స్వ యంగా రైతు కావడంతో రాష్ట్రంలో రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి కార్యక్రమాలు, ప్రత్యేక పథకాలు అమలు అవుతున్నాయని టీఆర్‌ఎస్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్ శాఖల

03/03/2020 - 00:44

హైదరాబాద్/సికిందరాబాద్, మార్చి 2: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కోవిడ్-19 (కరోనా) వైరస్ నగరానికి చేరుకుంది. దేశం లో మరో ఇద్దరికి కోవిడ్-19 లక్షణాలున్నట్లు సోమవారంనాడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అందులో ఒకరు హైదరాబాద్ నగరానికి చెందిన వాసిగా నిర్థారించింది. దీంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఇప్పటివరకు నగరానికి కోవిడ్ భ యం లేదని భావించిన నగరవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డా రు.

03/02/2020 - 05:45

మహబూబ్‌నగర్, మార్చి 1: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు నత్తనడకన కొనసాగుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందులో భాగంగా పాలమూరు ప్రాజెక్టు పరిధిలోని ఉదండాపూర్ జలాశయం నిర్వాసితులు తమకు పరిహారం ఇవ్వడంలో ప్రభుత్వం జాప్యం చేస్తుందని మార్కెట్‌కు అనుగుణంగా పరిహారం ఇవ్వాలంటూ ఆందోళన బాటపట్టారు. ఆందోళన బాటపట్టడంతో పాటు వారు జలాశయం పనులను అడ్డుకున్నారు.

03/02/2020 - 05:40

నల్లగొండ, మార్చి 1: ఏపీ పునర్విభజన ప్రక్రియకు సంబంధించి పార్లమెంట్ చేసిన చట్టాలను గౌరవించి కేంద్రం వాటి అమలుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కోరారు.

03/02/2020 - 05:37

నిజామాబాద్, మార్చి 1: నిజామాబాద్ జిల్లాకు ఆనుకుని గోదావరి నదిపై మహారాష్ట్ర నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను ఆదివారం తాత్కాలికంగా పైకి లేపి, దిగువ గోదావరిలోకి నిర్ణీత పరిమాణంలో నీటిని విడుదల చేశారు. ఇరు రాష్ట్రాలకు చెందిన నీటి పారుదల శాఖ అధికారులు ఈ నీటి విడుదల ప్రక్రియను పరిశీలించారు.

03/02/2020 - 00:54

ఖైరతాబాద్, మార్చి 1: మాటల సీఎం కేసీఆర్ అని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. ఆదివారం జూబ్లీహిల్స్‌లోని తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో బాధిత మహిళలతో కలిసి ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరేళ్ల పాలనలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని విమర్శించా రు. గత ప్రభుత్వాలు నిర్మించిన ఇళ్లకు రంగులు వేసి ప్రజలకు అందించారని పేర్కొన్నారు.

03/02/2020 - 00:51

హైదరాబాద్, మార్చి 1: దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్న అల్లర్లపై సోషల్ మీడియాను అరాచక శక్తులు పుకార్ల ప్రచారానికి వాడుకున్నాయని, ఇలాంటి తప్పుడు సమాచారానికి సోషల్ మీడియా సాధనం కాకూడదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్ రెడ్డి అన్నారు. సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా ఉపయోగించాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తు చేశారు.

03/02/2020 - 00:47

ఖమ్మం, మార్చి 1: ప్రజలంతా సంఘటితంగా సహకరిస్తే అద్భుతాలు సృష్టించవచ్చని, తమ ఇంటితో పాటు గల్లీ కూడా పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత వారిపైనే ఉందని రాష్ట్ర ఐటీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. ఆదివారం ఖమ్మం పర్యటనలో భాగంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఖమ్మం నగరంలో పలుచోట్ల నేరుగా ప్రజలతో మాట్లాడి ప్రభుత్వ పనితీరు, స్థానిక సమస్యలపై ఆరాతీశారు.

03/02/2020 - 00:44

హైదరాబాద్: రాష్ట్ర వార్షిక ఆర్థిక బడ్జెట్ (2020-21) ముసాయిదాకు తుదిరూపం ఇవ్వడానికి ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. వివిధ శాఖల నుంచి అందిన ప్రతిపాదనలపై ఆర్థిక శాఖ, ఆర్థిక సలహాదారులు, శాఖాధిపతులతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు లోతుగా చర్చించారు.

03/02/2020 - 00:42

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టీఎస్ క్యాబ్) పాలకమండలి ఎన్నికలు ఈ నెల 5వ తేదీన నిర్వహించాలని అధికారికంగా నిర్ణయించారు. ఈ మేరకు సోమవారం నోటిఫికేషన్ జారీ చేసేందుకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలో ఉన్న తొమ్మిది డీసీసీబీ చైర్మన్లు టీఎస్ క్యాబ్‌లో డైరెక్టర్లుగా ఉంటారు. రాష్ట్ర పాలక మండలిలో ప్రధానంగా చైర్మన్, వైస్-చైర్మన్ పదవులకు ఎన్నికలు నిర్వహిస్తారు.

Pages