S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/17/2020 - 01:24

హైదరాబాద్, ఫిబ్రవరి 16: రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఈ నెల 24 నుంచి పది రోజుల పాటు నిర్వహించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఆదివారం జరిగిన మంత్రిమండలి సమావేశం నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి విధి విధానాలు ఖరారు చేయడానికి మంగళవారం ప్రగతిభవన్‌లో రాష్టస్థ్రాయి మున్సిపల్ సదస్సు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది.

02/17/2020 - 01:18

హైదరాబాద్: బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందనడం సరికాదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. తెలంగాణ ఆర్థిక క్రమశిక్షణను చక్కగా పాటిస్తున్న రాష్టమ్రని, జాతీయ స్థాయిలో కేంద్రానికి ఎక్కువ ఆదాయాన్ని అందిస్తున్న రాష్టమ్రని ఆమె చెప్పారు.

02/17/2020 - 01:14

హైదరాబాద్, ఫిబ్రవరి 16: ఎస్సీ, ఎస్టీ హక్కులు, రిజర్వేషన్ల పరిరక్షణ కోసం సోమవారం భారీ ఎత్తున ధర్నా చౌక్‌లో భారీ ఎత్తున ధర్నా నిర్వహించనున్నట్లు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పారు. ఈ ధర్నాలో కాంగ్రెస్ అనుబంధ సంఘాలతో పాటు ప్రజలు పాల్గొనాలని ఆయన కోరా రు. ధర్నా మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది.

02/17/2020 - 01:13

హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 66వ జన్మదినాన్ని పురస్కరించుకొని సోమవారం రాష్టవ్య్రాప్తంగా భారీ ఎత్తున వేడుకలు నిర్వహించడానికి మంత్రులు, పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, ఏర్పాట్లు చేశారు. కేసీఆర్ జన్మదినం కానుకగా ఆయనకు అమితంగా ఇష్టమైన మొక్కలు నాటాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

02/17/2020 - 06:08

హైదరాబాద్: కేంద్రం తీసుకువచ్చిన ఎన్పీఆర్ (నేషనల్ పాపులేషన్ రిజిష్టర్) చట్టంతో తెలంగాణ ప్రజల్లో భయాందోళన వ్యక్తం అవుతోందని, వీటిపై తెలంగాణ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని టీఎస్ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు.

02/17/2020 - 01:09

హైదరాబాద్, ఫిబ్రవరి 16: ఈ నెల 19వ తేదీన రాష్ట్రంలో భూసార ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ వ్యవసాయశాఖాధికారులను, రైతులను కోరింది. రైతులందరి కమతాల వారీగా మట్టి నమూనాలను సేకరించి పరీక్షలు చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో 2015-17 భూసార హెల్త్ కార్డు పథకం కింద 10.34 లక్షల మట్టి నమూనాలను సేకరించి వాటిని పరీక్షించి 55.44 లక్షల హెల్త్‌కార్డులను ముద్రించి రైతులకు పంపిణీ చేశారు.

02/16/2020 - 05:44

హైదరాబాద్, ఫిబ్రవరి 15: తెలంగాణలో వివిధ సంస్థలు ప్రైవేటు యూనివర్శిటీలను ఏర్పాటు చేసేందుకు సూత్రప్రాయంగా అంగీకరిస్తూ ప్రభుత్వం లెటర్ ఆఫ్ ఇంటెంట్‌ను జారీ చేసింది. మల్లారెడ్డి మహిళా వర్శిటీని మైసమ్మగూడలో ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపింది.

02/16/2020 - 05:44

హైదరాబాద్, ఫిబ్రవరి 15: ఆర్టీసీలో పనిచేసే ఉద్యోగ, కార్మికల భద్రత ఆర్టీసీ కర్తవ్యం అంటూ సంస్థ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌శర్మ స్పష్టం చేశారు.సంస్థలో అత్యుత్తమ సేవలు అందించిన ఉద్యోగ, కార్మికులకు అవార్డులను ఎండీ అందచేశారు. శనివారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి ఆర్టీసీ కళాభవన్‌లో ఏర్పాటు చేసిన అవార్డుల కార్యాక్రమంలో ఎండీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

02/16/2020 - 05:35

హైదరాబాద్, ఫిబ్రవరి 15: మెట్రో రైలు ప్రారంభోత్సవం టీఆర్‌ఎస్ సొంత వ్యవహారంలా చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ విమర్శించారు. మెట్రో రైలు పార్కింగ్, ఫుట్‌పాత్‌లకు స్థలాలు కేటాయించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు. శనివారం నాడు కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి వెంట లక్ష్మణ్ జేబీఎస్ నుండి సీబీఎస్ వరకూ మెట్రో రైలులో ప్రయాణించారు.

02/16/2020 - 05:17

హైదరాబాద్, ఫిబ్రవరి 15: ప్రముఖ వక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, రచయిత విజయర్కే రాసిన ‘కేసీఆర్ మహానాయకుడు’ పుస్తకాన్ని రవీంద్రభారతిలో రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వీ.శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్‌తో కలిసి ఆవిష్కరించారు.

Pages