S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/16/2020 - 01:44

ఖమ్మం, ఫిబ్రవరి 15: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలో ప్రాథమిక సహకార సంఘాలకు శనివారం జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అత్యధిక స్థానాలను గెలుచుకున్నది. ఖమ్మం జిల్లా పరిధిలోని 76 సంఘాలకు 34 టీఆర్‌ఎస్‌కు ఏకగ్రీవం కాగా, కొత్తగూడెం జిల్లా పరిధిలోని 21 సంఘాలకు 2 టీఆర్‌ఎస్‌కు ఏకగ్రీవం అయ్యాయి.

02/16/2020 - 01:37

హైదరాబాద్, ఫిబ్రవరి 15: ‘మెట్రో రైలు ప్రారంభోత్సవం అంటే టీఆర్‌ఎస్ పార్టీలో ఫంక్షనా? వాళ్లిష్టం వచ్చినట్టు చేసుకోవడానికి. అధికారులై మీరేం చేస్తున్నారు? చెప్పనక్కర్లేదా’ అంటూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్‌రెడ్డి మెట్రో రైలు ప్రాజెక్టు అధికారులకు క్లాసు తీసుకున్నారు.

02/16/2020 - 01:33

హైదరాబాద్, ఫిబ్రవరి 15: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభత్వం ప్రవేశపెట్టిన ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ల విధానం ఆంధ్ర. తెలంగాణ రాష్ట్రాల్లో కొనసాగుతోందని,

02/16/2020 - 01:28

హైదరాబాద్: రాష్ట్రంలో బీఎస్సీ డిగ్రీ లేదా పాలిటెక్నిక్ కోర్సులు పూర్తిచేసిన వారు నేరుగా ఇంజనీరింగ్‌లో ప్రవేశానికి నిర్వహిస్తున్న ఈసెట్-2020 షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టీ పాపిరెడ్డి శనివారం రాత్రి విడుదల చేశారు. మే 2వ తేదీన రెండు సెషన్స్‌లో ఆన్‌లైన్‌లో ఈసెట్ నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఆరోసారి ఈ పరీక్ష నిర్వహణ బాధ్యతను జేఎన్‌టీయూకు అప్పగించినట్టు ఆయన చెప్పారు.

02/16/2020 - 01:27

హైదరాబాద్, ఫిబ్రవరి 15: రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఎన్నికల్లో టీఆర్‌ఎస్ సత్తా చాటింది. పార్టీ రహితంగా ఎన్నికలు జరిగినా, మొత్తం మీద అత్యధిక స్థానాల్లో టీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులు విజయబావుటా ఎగురవేశారు. దీంతో టీఆర్‌ఎస్ పార్టీ అధినాయకత్వం, పార్టీ నేతలు, శ్రేణుల్లో కదనోత్సాహం కనపడింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పార్టీ కార్యకర్తల్లో జోష్ పెరిగింది.

02/16/2020 - 01:25

హైదరాబాద్, ఫిబ్రవరి 15: ఇక తెలంగాణలో ఎన్నికలు కనుచూపు మేరలో లేనందున విద్యుత్ చార్జీలు పెంచుకోవడానికి వీలు కలుగుతుందని విద్యుత్ సంస్థలు భావిస్తున్నాయి. ప్రస్తుత తెలంగాణ అవసరాల కోసం విద్యుత్‌ను కొనుగోలు చేయక తప్పదని విద్యుత్ సంస్థల అధికారులు స్పష్టం చేస్తున్నారు. మరో రెండేళ్లు 2020-2021 ఆర్థిక సంవత్సరానికి అవసరమైన విద్యుత్‌పై సమగ్ర నివేదికను డిస్కంలు ఇవ్వాలి.

02/14/2020 - 05:33

కరీంనగర్, ఫిబ్రవరి 13: బంగారు తెలంగాణ సాధనలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు. జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం రాత్రి కరీంనగర్‌లోని ఉత్తర తెలంగాణ భవన్‌కు చేరుకొని బస చేయగా, గురువారం ఉదయం వీఐపీలు, అధికారులు, కార్పొరేటర్లు సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు ఉత్తర తెలంగాణ భవన్‌కు వచ్చి పుష్పగుచ్ఛాలు అందించారు.

02/14/2020 - 05:25

నల్లగొండ, ఫిబ్రవరి 13: రాజకీయ రిజర్వేషన్ల సాధనకు బీసీలంతా పార్టీలకు అతీతంగా ఐక్య ఉద్యమాలు సాగించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు.

02/14/2020 - 05:18

భీమదేవరపల్లి, ఫిబ్రవరి 13: కన్న తండ్రి మరణించాడు అనే విషయం తెలిసినప్పటికీ ఆ బాధను గుండెల్లో దిగమింగి ఒక విద్యార్థిని గురువారం పరీక్షలు రాసింది. పరీక్ష హాల్ నుంచి బయటకు రాగానే కన్నీటి పర్యంతం కావడంతో విద్యార్థిని రోదన చూసి పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు, విద్యార్థులు కన్నీటి పర్యంతం అయ్యారు. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గురుకుల పాఠశాలలో గాయత్రి ఇంటర్మీడియేట్ బైపీసీ చదువుతోంది.

02/14/2020 - 00:36

వరంగల్, ఫిబ్రవరి 13: తెలంగాణ రాష్ట్రమంతా గోదారమ్మ పరవళ్లు తొక్కాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇంజనీర్లతో అన్నారు. గురువారం ఆయన కాళేశ్వరం, లక్ష్మీ బ్యారేజీ మేడిగడ్డలను సందర్శించారు. ముందుగా కాళేశ్వరం ఆలయం వద్దకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆహ్వానించారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన మహారుద్రాభిషేకం నిర్వహించారు.

Pages